AletheiAnveshana

Saturday, 8 February 2025

దేవుని వలలో చిక్కిన వారు ధన్యులు: 6:1-2a,3-8; 1 కొరింథీ 15:1-11; లూకా 5:1-11 (5 C)

 

దేవుని వలలో చిక్కిన వారు ధన్యులు

6:1-2a,3-8; 1 కొరింథీ 15:1-11; లూకా 5:1-11 (5 C)

నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును? చిత్తగించుము. నేనున్నాను”


గెన్నేసరెతు సరస్సులో యేసు శిష్యుల చేపల వేట సారాంశం సారూప్య సువార్తలలో చెప్పబడింది. అయితే లూకా మాత్రమే పేతురును ఒక నమ్మదగ్గ శిష్యునిగానూ పాపిగానూ చూపించే సన్నివేశాన్ని   చిత్రించాడు. అసాధారణమైనన్ని చేపలను వలలో పట్టుకున్నప్పుడు పేతురు తన బలహీనతవు అయోగ్యతను గుర్తించిన్నట్లు లూకా వ్యక్త పరిచాడు. ఆ భావాన్ని “ప్రభూ, నన్ను విడిచిపెట్టు, ఎందుకంటే నేను పాపాత్ముడిని" (లూకా 5:8) అన్న మాటల్లో చూపించాడు. క్షమాపణా గుణశైలిని మరియు అంగీకార మనస్తత్వానికి అద్దం పట్టే సందేశాన్ని పాపులు బాగా అర్థం చేసుకుంటారననీ, అందువల్లనే యేసు తన సహవాసంలో పాపులను, అసమర్ధులను, అయోగ్యులను శిష్యులుగా స్వీకరించాడని లూకా తన సువార్తలో బయలు పరుస్తున్నాడు.

 

లియోన్స్ అను ప్రాంతపు పునీత ఇరేనియుడు పాపమునకున్న గుణాన్ని, దాని బోధనాపరమైన అంశాన్ని కనుగొన్నాడు. పాపపు స్వభావం దాని బలహీనతను గురించి తెలిసిన వారు తమ స్థితిని పురుగులాంటి జీవిగానూ మరియు ఆ జీవి కంటే సర్వ సృష్టికర్త మాత్రమె గొప్పవాడుగా గుర్తించగలరని తన బోధనలో చెప్పాడు. దేవుని ఉద్దేశ్యం ధర్మం లేదా యోగ్యతపై ఆధారపడి ఉండదు! పొరుగువారికి తన ప్రేమపూర్వక సేవలో పాలుపంచుకోవడానికి మనల్ని పిలిచే ముందు మనం యోగ్యులమా అని లేదా మన అర్హతను గుణించి గణించడు. దాని కోసం ఎదురు చూడడు యేసు! అది నిజమే! మన అనర్హత గుర్తింపు క్రీస్తు మన ద్వారా పనిచేయడానికి ఒక ప్రారంభాన్ని సృష్టిస్తుంది. పేతురువలే మనం కూడా యేసుతో కలిసి పనిచేయడానికి పిలువబడితే, ఈ లోక తుఫాను జలాల కెరటాల మధ్య గాయపడి వైద్యం చేసేవారిగా మనం బోధించే వాటిని ఆచరించడానికి కూడా ప్రయత్నిస్తాము. సువార్త ప్రబోధనా ఫలాలను  అందించే ఒక మంచి సముద్ర వేట కోసం ప్రవాహాలకు వ్యతిరేకంగా ఈదడానికి ప్రయత్ని౦చ గలుగుతాము.

 

మనము కూడా దేవుని వలలో చిక్కుకోబడాలి. లోపాలతో కూడిన జీవితం, అంగీకార మనస్తత్వం,  నిరీక్షణ వాగ్దానాన్ని ఆ యేసు వలలో మాత్రమె చూడగలము. మత్తయి మరియు యోహాను సువార్తలు పేతురు వలలో వివిధ రకాల చేపలు పడినట్లు వివరిస్తున్నాయి. అలాగునే, నేడు యేసు  వల కంటే, వివిధ వినియోగదారులు (కన్స్యూమర్) మరియు వారి కృత్రిమ అవసరాల వలలు మనలను సులభంగా ఆకర్షిస్తున్నాయి. మానవ మరియు ఆధ్యాత్మిక విలువలకు విఘాతం కలిగించే విధంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థ, దాని బాహ్య భూటకపు ప్రలోభంపై ప్రత్యేక దృష్టి సారించే అవినీతి విజయం గురించి ఏమని ఆలోచించాలి? అలాగే, డ్రగ్స్ మరియు ఆల్కహాల్ సంస్కృతుల వల, మరియు జీవితపు అర్ధాన్ని కోల్పోతున్న వారి నిరాశ, ఆత్మహత్యల వల సంగతి ఏమిటి! పాపులను వెదకి వారిని క్షేమంగా పరలోక ఇంటికి చేర్చడానికి వచ్చిన యేసు మనస్సు మనకు గుర్తుకు రావాలి కదా? అతనికి వంద గొర్రెలు ఉంటే, ఒకటి తప్పుదారి పట్టినట్లయితే, అతను తొంభైతొమ్మిది౦టిని విడిచిపెట్టి తప్పిపోయిన దాని వెంట వెళ్ళేవాడు గదా! పరిశుద్ధ పోపు గారు ప్రకటించిన జూబ్లీ సంవత్సరానికి ఈ సందేశం ప్రధానమైనది కదా!!!

 

పాపిని వాని పాపమును మన వలతో పట్టుకోవడానికి మన బలం సరిపోదు. మనలను ఎన్నటికీ ఒంటరిగా విడిచిపెట్టని దేవుని వాక్యాన్ని విశ్వసించూదాం. పేతురు , బోధకుడా! మేము రాత్రంతా కష్టపడి ఏమీ పట్టుకోలేదు, కానీ మీ ఆజ్ఞ ప్రకారం నేను వలలు దించుతాను" (లూకా 5:5) అని అన్నాడు. నిజమే మన విర్క్తత్వ మరియు జీవితాంత ప్రకటన కష్టార్జితం సరిపోదేమో!! దయగల గుణదల లూర్దు మాత మనకు తన నిత్య సహాయాన్ని మన పరిచర్యలో అందిస్తుంది. కానాలో జరిగిన వివాహ వేడుకలో మరియ తల్లి మాటలు “ఆయన మీకు ఏది చెబితే అది చేయండి!” (యోహాను 2:5) అన్న ప్రోతాహిక మాటలు పేతురి ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. మనము జీవించే, బోధించే సువార్త ప్రకటనానందానికి సాక్ష్యమిచ్చే విధానంగా మరయు మనలో క్రీస్తు వెలుగును పాపాత్ముడు చూడాలనే ప్రభు చిత్తం కోరుకున్న విధంగా నమ్మకంగా వుందాం.

 

ప్రభువు శిలువ మనకు జీవ వృక్షంగా మారింది” (Divine Office)

Wednesday, 5 February 2025

THE GOSPEL ACCORDING TO LUKE (Lesson 3 – Feb 4, 2025) Chs. 1: 5 - 29

 

THE GOSPEL ACCORDING TO LUKE


(Lesson 3 – Feb 4, 2025) Chs. 1: 5 - 29

 

Luke presents Jesus’ earthly ministry as a battle between Christ and Satan and wins over by his death and resurrection.


He presents challenges between Now and the end times (eschaton)


He presents the Joy of the world because the blood of Christ redeemed him.

 

The Infancy Narrative


Lk 1:5only Matthew and Luke present stories of the birth of Christ but from two different perspectives. Luke centers on Mary while Matthew focuses on Joseph. Despite the many variations, both agree on the essential point that Mary is pregnant without human relations.

 

The purpose of drawing the Gentiles to the community of Israel by setting the many references to political events and leaders of the day within the context of the OT. Ex; Simion proclamation: Jesus is “a light of revelation to the Gentiles/ and glory for people of Israel (1:29-32)

 

Vv. 11, 19 -  the angel appeared” – Lk does not mention the name of the angel – doubt is clarified by revealing the name “I am Gabriel”

 

The name - Gabriel – is a combination of two Hebrew terms: Gabur (“strong man”, “warrior”) and El (“God”) = “Warrior of God”.

Gabriel has a role in the OT: explains a vision to Daniel (8:15, 17-26) while simultaneously giving Daniel understanding (9:22).


V. 13 – “Do not be afraid”; a stereotyped OT phrase (Dt 3:22; Gen 15:1; Jos 1:9; Dan       10:12,19) – 365 times mentioned in the Holy Bible.

- “You shall name him John”. The name John means YHWH has shown favor”. It shows his role in the salvation history.


V. 15 – “He will drink neither wine nor strong drink” (similar to Samson (Jgs 13: 4-5) and Samuel (1 Sam 1:1, 11) – consecrated by Nazarite vow and set apart for the Lord’s service.

- The Nazarite vow is a set of laws in the Hebrew Bible that describe a voluntary vow of separation from the world for some time (Num 6:1–21) to serve the Lord.

V. 17 – “He will go before him in the spirit and power of Elijah to turn the hearts of fathers……….


John is to be the messenger sent before Yahweh as described in Mal 3:1-2 is sent before “the great and terrible day of the Lord comes”


V. 20 – “You will be speechless and unable to talk”: When Mary asked a similar question (Lk 1:34), she was encouraged, praised, and reassured but Zechariah was punished.


V. 25 -  “to take away my reproach/disgrace before others: Rachel, when she bare a son, said, “God hath taken away my reproach,” (Gen 30:23; Is 4:1; Hos 9:11;1 Sam 1:6-10) = “Yet the days were coming when to be childless would be regarded by Jewish mothers as a blessing” ( Lk 23:29).


Among the Jews, a family of children was counted as a signal blessing, evidence of the favor of God (Ps 113:9; Ps 128:3; Is 4:1; Is 44:3-4; Lev 26:9). To be “barren,” therefore, or to be destitute of children, was considered a “reproach” or a “disgrace”.

 

            - All the prayers we offer up to God, are acceptable and successful only by Christ's intercession in the temple of God above – “through Christ our Lord” Amen.


- “Prayers of faith are filed in heaven and are not forgotten. Prayers made when we were young and entering into the world, may be answered when we are old and going out of the world” - Matthew Henry

 

-        Definition of Faith: Heb. 11:1

 

Vv. 26-27 – “In the sixth month” - after the vision of Zachariah. This is the only passage that indicates the age of John the Baptist, as half a year older than our Lord.

 

- Named Nazareth — A small city in the tribe of Zebulon, now reduced to a very low and contemptible condition (Mt 2:23). Josephus describes it as rich in trees and pastures, strong, populous, containing 204 towns, of which the least had 15000 inhabitants.

 

- “a virgin” (Is 7:14; Jer 31:22) The many miraculous and glorifying legends which soon began to gather around her name in the Apocryphal Gospels are utterly unknown to Scripture.


Jer 31:22: St Jerome in his commentary on this verse understood it of Mary's virginal conception of Christ. "The Lord has created a new thing on earth; without seed of man, without carnal union and conception. ' a woman will encompass a man' within her womb - One who, though He will later appear to advance in wisdom and age through the stages of infancy and childhood, yet, while confined for the usual number of months in his mother's womb, will already be perfect man".  

 

- unto a city of Galilee, named Nazareth; the whole country of Galilee was mean and contemptible with the Jews: they observe, though through mistake, that no prophet arose out of it, Jn 7:52 and Nazareth particularly was exceeding despicable in their eye: hence those words of Nathanael, "can any good thing come out of Nazareth?" Jn 1:46  “yet hither an angel was sent by God; and here dwelt the mother of our Lord”.

 

V. 27 – “a virgin betrothed to a man named Joseph”

 

The Protoevangelium of James: 8, 9 (not inspired by the Holy Spirit, non-canonical)

a.      And when she was twelve years old there was held a council of the priests, saying: Behold, Mary has reached the age of twelve years in the temple of the Lord. What then shall we do with her, lest perchance she defile the sanctuary of the Lord? And they said to the high priest: You stand by the altar of the Lord; go in, and pray concerning her; and whatever the Lord shall manifest unto you, that also will we do. And the high priest went in, taking the robe with the twelve bells into the holy of holies; and he prayed concerning her. And behold an angel of the Lord stood by him, saying unto him: Zacharias, Zacharias, go out and assemble the widowers of the people, and let them bring each his rod; and to whomsoever the Lord shall show a sign, his wife shall she be. And the heralds went out through all the circuit of Judæa, and the trumpet of the Lord sounded, and all ran.

b.       And Joseph, throwing away his axe, went out to meet them; and when they had assembled, they went away to the high priest, taking with them their rods. And he, taking the rods of all of them, entered into the temple, and prayed; and having ended his prayer, he took the rods and came out, and gave them to them: but there was no sign in them, and Joseph took his rod last; and, behold, a dove came out of the rod, and flew upon Joseph's head. And the priest said to Joseph, You have been chosen by lot to take into your keeping the virgin of the Lord. But Joseph refused, saying: I have children, and I am an old man, and she is a young girl. I am afraid lest I become a laughing-stock to the sons of Israel. And the priest said to Joseph: Fear the Lord your God, and remember what the Lord did to Dathan, and Abiram, and Korah; Numbers 16:31-33 how the earth opened, and they were swallowed up on account of their contradiction. And now fear, O Joseph, lest the same things happen in your house. And Joseph was afraid, and took her into his keeping. And Joseph said to Mary: Behold, I have received you from the temple of the Lord; and now I leave you in my house, and go away to build my buildings, and I shall come to you. The Lord will protect you.

 

V. 28 – “Hail favored one! The Lord is with you”

 

V. 29 – “Do not be afraid, (….) for you have found favor with God”

 

 

 

 

 

 

 

 

Saturday, 1 February 2025

నా కనులు నీ రక్షణను చూస్తున్నాయి: మలాకి 3:1–4; హెబ్రీ 2:14–18; లూకా 2:22-40 (4 C)


నా కనులు నీ రక్షణను చూస్తున్నాయి

మలాకి  3:1–4; హెబ్రీ 2:14–18; లూకా  2:22-40 (4  C)

“ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను” (నిర్గమ 13:1)

 

ఈ రోజు బాల యేసు సమర్పణ  పండుగను మాతృ శ్రీసభ ఘనపరుస్తుంది. క్రీస్తు జయంతి  40 రోజులు తర్వాత వచ్చే ఈ పండుగ గురించిన విషయాలను లూకా సువార్తలో మాత్రమే ప్రస్తావించబడినాయి. యూదుల శుద్ధీకరణ సంస్కారములను గురించి తెలియని నూతన క్రైస్తవుల కోసం తన సువార్తలో లూకా  వ్రాసాడు. యేరూశలేము ఆలయ పునఃనిర్నిర్మాణ సమయంలో, ఆ దేశంలో తాండవించిన ఆనాటి పేదరికం దేవుని బిడ్డలను బాగా నిరుత్సాహపరిచింది. అప్పుడు ప్రవక్త హగ్గయి దేవుని స్వరాన్ని ఇలా ప్రవచించాడు, “నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరి యిష్టవస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును...ఈ కడవరి మందిర మహిమ మునుపటి మందిర మహిమను మించును. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు” (హగ్గయి  2:7, 9). 

 

బాల యేసు తల్లి దండ్రులు యెహోవా ఇచ్చిన చట్టం, “ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాది” అన్న చట్టాన్ని పరిపూర్తి చేశారు. ఆలయంలో బాల యేసును సమర్పించడంలో, హగ్గయి ప్రవచనం నెరవేరిందని మనకు సుస్పష్టమయింది. యేసు రాకతో ఆలయమంతా  దైవీక తేజస్సుతో నిండిపోయింది. సిమియోనుడు “ప్రభువు క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు” అని పరిశుద్ధాత్మచేత ఒక వరమును పొందుకున్నాడు. అందువలననే తల్లి దండ్రులైన మరియ యోసేపులు తమ అద్వితీయ కుమారుడు యేసును ఆలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు “ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను" (లూకా 2:26). అని లూకా వ్రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో, సిమియోను ఆలయంలోనికి వెళ్ళాడు. అతను లేవీయుడు కాదు, వాగ్గేయకారుడు కాదు లేదా న్యాయశాస్త్ర పండితుడు కాదు. అతను కేవలం "నీతిమంతుడు భక్తిపరుడు, ఇశ్రాయేలు ఓదార్పు కోసం ఎదురు చూస్తున్నవాడు" మాత్రమె (లూకా 2:25)! పరిశుద్ధాత్మ తనకు నచ్చిన చోటుకు ప్రవహిస్తుంది (యోహాను 3:8). అతను ఇశ్రాయేలు ఇంటి మహిమను మరియు కొత్త ఇశ్రాయేలు అయిన సర్వలోక పీడనాన్ని చూశాడు. తల్లి  మరియ హస్తాలలో ఉన్న మహిమాన్విత శిశువు యేసును చూసినప్పుడు అతను కీర్తనకర్త మాటలను ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు, “మహిమ కలిగిన రాజు లోపలికి వచ్చేలా, ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి" (కీర్తన 24:7).

 

సిమియోను బాల యేసును తన చేతుల్లోకి తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు: “నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని నిష్క్రమింపనిమ్ము! అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని" (లూకా 2:29-32). ఈతని ప్రార్థన మాతృ శ్రీసభ రాత్రి కాల ప్రార్థన [Nunc dimittis (Divine Office)]లో భాగమయింది. తల్లి తండ్రులు, యేసును గూర్చి చెప్పబడిన విషయానికి చాలానే ఆశ్చర్యపడ్డారు! అప్పుడు సిమియోనుడు మరియ తల్లితో “నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొని పోవును” (లూకా 2:35) అని ప్రవచనం చెప్పాడు.

 

చీకటిని పారద్రోలడానికి, అతని వైభవంలో మనందరికీ భాగస్వామ్యం కల్పించడానికి నిజమైన వెలుగును పంపిన దేవునికి కృతజ్ఞతా గీతాన్ని సిమియోనుతో కలసి ఆనందిస్తూ ఆలపిద్దాం. పునీత సోఫ్రోనియసు  ఇలా అంటాడు, సిమియోనుని కనుల ద్వారా మాత్రమె కాకుండా మనం కూడా దేవుడు ఏర్పరిచిన లోక రక్షణను కనులారా చూస్తున్నాము. కొత్త ఇశ్రాయేలు అయిన మన కోసం సిద్ధం చేయబడిన యేసునందు మోక్షాన్ని ప్రతీ రోజు వాక్యమందును దివ్య సత్ర్పసాదమమందును అనుభూతి చెందుతున్నాము. సిమియోనుడు రక్షకుడు యేసును చూసినప్పుడు ఈ జీవిత బంధాల నుండి విడుదల పొందినట్లుగా, మనం కూడా దేవుణ్ణి మనలోనూ ఇతరుల్లోనూ చూడగలిగినప్పుడు మన భారాల నుండి విముక్తి పొందుతాము. ఎందుకంటే ఆత్మ ఘోషను దాని దాహాన్ని మనము ".. దేవునికొరకు తృష్ణగొనుచున్నది. జీవముగల దేవునికొరకు తృష్ణగొనుచున్నది. నేను ఎప్పుడు దేవుడి ముఖాన్ని చూస్తాను? (కీర్త 42:2) అని వింటూనే ఉన్నాము. మనమందరం మరియ తల్లి బిడ్డలం కాబట్టి, యేసును దేవధి దేవునకు సమర్పించినట్లుగా మనలను కూడా తన చేతుల మీదుగా సర్వోన్నతుడైన దేవునకు సమర్పించమని ఆమెను కోరుకుందాం.

 

"మనం వెలిగించిన కొవ్వొత్తులు మన ఆత్మల దివ్య వైభవానికి సంకేతం" (Divine Office)

My Eyes See Your Salvation : Mal 3:1–4; Heb 2:14–18; Lk 2:22–40 (4 C)

 

My Eyes See Your Salvation

 

Mal 3:1–4; Heb 2:14–18; Lk 2:22–40 (4  C)

“Consecrate all the first-born to me, the first issue of every womb, among the sons of Israel” (Ex 13:1)

 

Today the Church celebrates the Feast of the Presentation of Jesus in the temple. The events of this feast celebrated 40 days after Christmas, are only mentioned in the Gospel of Luke. He wrote this Gospel for Gentile Christians unfamiliar with the Jewish rite of presentation and purification. During the rebuilding of the temple, poverty highly discouraged builders. The prophet Haggai prophesied: “Greater will be the glory of this house, says the Lord of hosts, and in this place, I will give you peace. I will shake all the nations so that the treasures of all the nations will come in. And I will fill this house with glory” (Hag 2:7, 9). 

 

Parents of the Baby Jesus fulfilled the commandment of God, “Consecrate to me every firstborn male. The firstborn from every womb among the Israelites belongs to me, both of man and beast” (Ex 13:1). And, at the presentation of the Child Jesus in the temple, the prophecy of Haggai was fulfilled. And the temple was refilled with Divine glory. The Holy Spirit had assured Simeon “that he should not see death before he had seen the Christ of the Lord” (Lk 2:26). Led by the Holy Spirit, Simeon went into the Temple. He was not a Levite, nor a scribe, nor a doctor of the law. He was just a “righteous and devout man, awaiting the consolation of Israel” (Lk 2:25). The Holy Spirit blows where it wills (Jn 3:8). He saw the glory of the house of Israel and the new Israel (all the nations) coming into the temple. When he saw the Baby Jesus in the hands of Mother Mary, he remembered the words of the Psalmist, “Lift up your heads, O gates; be lifted, your ancient portals, that the king of glory may enter” (Ps 24:7).

Simeon took the child in his arms and praised God, saying, “Master, now you dismiss your servant in peace, according to your word; for my eyes have seen your salvation, which you have prepared in the presence of all peoples, a light for revelation to the Gentiles and glory to your people Israel” (Lk 2:29-32). This prayer has become part of the night prayer (Nunc dimittis) of the Church. And the child’s father and mother were amazed at what was being said about Jesus. Then Simeon said to Mother Mary, “This child is destined for the falling and the rising of many in Israel, and to be a sign that will be opposed so that the inner thoughts of many will be revealed — and a sword will pierce your soul too” (Lk 2:35).

 

Rejoicing with Simeon, let us sing a hymn of thanksgiving to God who sent the true light to dispel the darkness and to give us all a share in his splendor. Saint Sophronius says, “Through Simeon’s eyes we too have seen the salvation of God which he prepared for all the nations, the new Israel”. As Simeon was released from the bonds of this life when he saw Jesus, we will also have the liberation of our burdens when we see the phase of God” because we suffer the thirst of our souls, “My soul thirsts for God, for the living God. When will I come and see the face of God? (Ps 42:2). Let us also ask Mother to take us in her arms and offer to God as she did with Jesus, for we are all her children.

 

“Our lighted candles are a sign of the divine splendor of…our souls” (Divine Office)

 

 

Saturday, 25 January 2025

విమోచకుడు: నెహే 8:2-4a,5-6,8-10; 1 కొరింథీ 12:12-30; లూకా 1:1-4; 4:14-21 ( 3 సి)

 

విమోచకుడు

నెహే 8:2-4a,5-6,8-10; 1 కొరింథీ 12:12-30; లూకా 1:1-4; 4:14-21 ( 3 సి)

".. ప్రతీ అర్చన వేడుక, యాజకుడు క్రీస్తు శరీర క్రియ. ఇది క్రీస్తు సంఘం" ( Divine Office)

 

 లూకా సువార్తకుడు తన సువార్త  ప్రారంభ వచనాలలో సువార ఉద్దేశ్యాన్ని చాలా చక్కగా స్థాపించాడు. అతని గ్రంథస్త శైలి మెరుగుపెట్టిన గ్రీకు మరియు రోమను సాహిత్యానికి విలక్షణమైనది. లూకా తన సువార్తను “థియోఫిలస్” (లూకా 1:3) అనే పేరుగల వ్యక్తికి వ్రాసి ఉండవచ్చు! ఈ  థియోఫిలస్” అనే వ్యక్తీ చరిత్రలో వున్నవాడా అనేది పరిశుద్ధ వేద పండితుల్లో నిలిచిపోయిన చాలా పెద్ద ప్రశ్న! నిజానికి గ్రీకు పదం “థియోఫిలస్” అంటే “దేవుని ప్రియమైనవాడు” అని అర్ధం. దీని అర్థం బట్టి చూస్తే ఆ “థియోఫిలస్” ఎవరో కాదు - అది “దేవుని ప్రియమైన వాడ”యిన నువ్వు నేను అని మన గ్రహింపుకు తెలుస్తుంది. కాబట్టి లూకా సువార్తికుడు దేవుణ్ణి ప్రేమించే మరియు ప్రేమించ ఆశ పడే వారందరికీ తన సువార్తను వ్రాస్తున్నాడు. నజరేయుడైన యేసును గురించిన "సత్యాన్ని తెలుసుకోవాలని" తన పాఠకులను (లూకా 1:4) కోరుకున్నాడు లూకా. యేసు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించినప్పుడు అతని వయస్సు దాదాపు 30 సంవత్సరాలు అని లూకా మనకు చెప్తున్నాడు (లూకా 3:23). యేసు యోర్దాను నదిలో బాప్తిస్మం స్వీకరించిన వెంటనే (లూకా 3:21-22) సైతానుచే శోదించబడటానికి ఆత్మచేత (లూకా 4:1) అరణ్యంలోకి నడిపించబడినాడు (లూకా 4:1). ఆధ్యాత్మిక పరీక్షా కాలం ముగింపులో, యెషయా ప్రవక్త ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు తన బహిరంగ పరిచర్యను గలిలయలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు కూడా లూకా మనకు తెలియజేస్తున్నాడు (యేష 9:1,2).

 

మెస్సీయ "శుభవార్త"ను బోధిస్తాడనీ, అణచివేయబడిన వారందరికీ స్వస్థత మరియు స్వేచ్ఛను తీసుకోస్తాడని యెషయా ప్రవచించాడు (Is 61:1-2). తదనుగుణంగా, దేవుడు పంపిన మెస్సీయ తన “వ్యక్తి” లో నెరవేర్చిన ఆతని వాగ్దానాలపై వారి నిరీక్షణను మేల్కొల్పాడు. దేవుని ఆత్మ అనేది యేసును నడిపించే ప్రేరణగానూ, పేదల వద్దకు పంపించడం, అతని జీవితమంతా అవసరమైన, అణచివేయబడిన, అవమానించబడిన వారి వైపు మళ్లించడం. హిబ్రూ భాషన వీరందరిని ఒక్క మాటలో చెప్పాలంటే “అనావిం” అని చెప్పాలి. నేడు ఈ “అనావిం” మన మధ్యన చాలనే వున్నారు. "సువార్త" అనే పదానికి అక్షరాలా "శుభవార్త" అని అర్థం. ఈ రోజు దానిని అంగీకరించే వారందరికి  స్వేచ్ఛను మరియు మార్పు తీసుకురావడానికి ఇది సర్వశక్తిమంతమై, దయగలిగిన  జీవాన్ని ఇచ్చే శక్తిగా ఉంది.

 

"పేదలకు సువార్త బోధించబడినప్పుడు (లూకా 4,18), అది క్రీస్తు ఉనికికి సంకేతం"గా వుంటుంది (CCC 2443) అని మాతృ శ్రీసభ అర్థం చేసుకుంటుంది. తిరుసభ తాడిత పీడిత జనుల వైపు కొమ్ము కాస్తుంది. 'పేదల ఎంపిక' (ఆప్షన్ ఫర్ ది పువర్) అనే అంశాన్ని ద్వితీయ వాటికను మహా సభ కనుగొనలేదు. ఇది దేవుని ఎంపిక. అతను దానిని యేసు “భూలోక శరీర రోజుల్లో” తన  జీవితమంతా శ్వాసించాడు. నవ నవ్య వృద్ధి సాంకేతిక సమాజంలో దారిద్రియ రేఖన ఇంకా అణగారియున్న జనులను, సమాజంనుండి మినహాయింపబడిన వారిని రక్షించడానికి, వారికి మన సంఘీభావం తెలియచేయకపోతే, యేసుక్రీస్తువలె జీవించడం లేదా ఆతనిని  ప్రకటించడం అనేది అసలు సాధ్యమే కాదు. మన పోరు వారి పక్షాన లేకపోతె మనం ఏం సువార్తను ప్రకటిస్తున్నాము? మనం ఏ యేసును అనుసరిస్తున్నాము? ఈరోజు వివిధ రకాలైన వివక్షను ఎదుర్కొనేవారు, సమాజ పొలిమేర చూపులతో చూడబడి బాధపడేవారు యేసు విమోచకుడని అర్థం చేసుకొన శక్తిని వారికి ఇవ్వ లేకపోతే మనం ఏ ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తున్నాము? ఎటువంటి క్రీస్తు సంస్కరణలను వెలుగులోకి తెస్తున్నాము?

 

పునీత  పౌలుడు  ఇలా అంటాడు, "అవయవములు అనేకములైనను శరీరమొక్కటే. శరీరము ఏలాగున  అనేకమైన అవయవములను కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నదో...శరీరంలోని ఏదైనా అవయవం నాకు నీ అవసరం లేదు’ అని మరొకరితో చెప్పగలదా, ... ఒక అవయవం బాధపడితే, అందరూ కలిసి బాధపడతారు. ఒక సభ్యుడు గౌరవించబడినట్లయితే, అందరూ సంతోషిస్తారు” (1 కొరింథీ 12:20-23). ప్రభువైన యేసు నేడు మనలో ప్రతి ఒక్కరితో ఇలాగునే మాట్లాడుతున్నాడు. అతను మనకు స్వస్థత, పునరుద్ధరణ, క్షమాపణ మరియు పాపం, నిరాశ, నిస్సహాయత, విధ్వంసం, వివిధ రకాలైన అణచివేతల నుండి విముక్తిని తెస్తాడు. ప్రభువు తనను విశ్వసించి, తన కృపకు వాహినిగా మారడానికి ప్రయత్నించే మనందరిపై తన ఆత్మను కుమ్మరించడాన్ని ఎప్పటికి తిరస్కరించడు. సువార్త ఆనందాన్ని నమ్మకమైన విశ్వాసంతో, సంతోషకరమైన నిరీక్షణతో ఋజువర్తన ప్రేమతో ప్రతిరోజూ జీవించే స్వేచ్ఛను పునరుద్ధరించమని ప్రభువైన యేసును అడుగుదాం.

ప్రభూ, నీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం, అల్లెలూయా” (Divine Office)