AletheiAnveshana

Saturday, 18 January 2025

WEDDING AT CANA - A JOY OF SACRAMENT OF MATRIMONY OF THE WORLD: Is 62:1-5; 1 Cor 12:4-11; Jn 2:1-11 (C 2)

 


 WEDDING AT CANA -  A JOY OF SACRAMENT OF MATRIMONY OF THE WORLD

 

Is 62:1-5; 1 Cor 12:4-11; Jn 2:1-11 (C  2)

Blessed are your eyes, for they see (Divine Office)

 

There are signs and symbols in the Bible like miracles, feasts of weddings, and ‘vine and branches’ to describe God’s salvation. John the Evangelist understands signs as gestures pointing toward something beyond what our eyes cannot see. He presents Jesus as to re-interpret and fulfill Yahweh’s promise to Israel. The sign of ‘changing water into wine’ at Cana, brings us the saving transformation of Jesus. It happened at a wedding party as a symbol of love. This is the best image of the Biblical tradition to express the definitive communion of God with us. Jesus’ salvation must be lived and offered by his followers as a party when life seems emptied or weird. In the Old Testament ‘wine’ is seen as a gift and blessing of God (Dt 7:13; Prov 3:10, Ps 105). The salvation that Jesus brings us renews our faith in life.

 

Many people today do not find the Church’s ministry life-giving. Liturgical celebration seems to be boring to them. The Church invites us to see the signs and symbols that are more life-affirming to discover Jesus’ capacity to alleviate the suffering and cruelties of life. Who does want to listen to something that does not seem to be joyful news, especially if the Gospel is preached with a cautious tone? Jesus Christ came to provide a power to love, a reason to exist, a lifestyle to live sensitively and joyfully. If people today only know a theoretical religion and can’t cherish the beauty of the love of God many will continue to stay away.

 

At the wedding feast, the water could be tasted as wine, only when it was ‘drawn out’ the water used by the Jews for their purifications. The religion of the law written on stone tablets seems to be worn out for some, today! They feel it has no living water capable of purifying and satisfying human needs.  But the letter of the law is replaced by the spirit of the law (2 Cor 3:6). The religion needs to be freed by the love and the life that Jesus communicates. To communicate the transforming love of Jesus, just talking is not enough. Gestures of service and condemning evil are also needed.

 

We need to make Jesus’ joyful style our own. I am happy about our Church, a place of joy and celebration, where people can feel welcomed, as at the wedding in Cana. Striving to progressively know and love more deeply his human nature, let us draw closer to the humanity of Jesus by listening to his word, and growing in faith and trust guided by the Holy Spirit until we see in him the face of the Father. Let us enjoy the divine presence of the Triune God in his plan for the sacrament of the matrimony of the world.

 

Blessed are your ears, for they hear (Divine Office)

Friday, 10 January 2025

మన శుద్ధి కోసం ఆయన జలాలను పవిత్రం చేశాడు (యేష 40:1-5,9-11; తీతు 2:11-14; 3:4-7; లూకా 3:15-16,21-22 (యేసు బాప్తిస్మము – C)

 

మన శుద్ధి కోసం ఆయన జలాలను పవిత్రం చేశాడు

 

(యేష 40:1-5,9-11; తీతు 2:11-14; 3:4-7; లూకా 3:15-16,21-22 (యేసు బాప్తిస్మము – C)

ఇదిగో దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలను మోసుకొనుపోవు వ్యక్తిని చూడు" (Divine Office)

 

ఈ రోజు మనం ప్రభువు బాప్తిస్మపు పండుగను జరుపుకుంటున్నాము. యేసు బాప్తిస్మము మూడు సారూప్య సువార్తలయిన మత్తయి, మార్కు, లూకా లో నివేదించబడింది. యేసు స్వీకరించిన బాప్తిస్మ సంస్కారము యేసులో నిక్షిప్తమైయున్న దేవుణ్ణి అభివ్యక్తిగా చూపెడుతుంది. ఇది మరొక ఎపిఫనీ లేదా దేవుని సాక్షాత్కారం. లూకా సువార్తలో ప్రసాదించబడిన ఈ బాప్తిస్మ సన్నివేశంలో త్రిత్వైక సర్వేశ్వరుణ్ణి మనము చూస్తున్నాము. వినిపించబడిన స్వరంలో తండ్రిదేవుడు,  పావుర రూపమున ఆకాశ మండలాల నుండి దిగివచ్చిన పవిత్రాత్మ దేవుడు, యోర్దాను నది జలంలో శరీరధారి వాక్కైన దేవుని ఏకైక కుమార దేవుడు – త్రిత్వైక దేవుడుగా మనకు సాక్షాత్కరించడం గొప్ప వరం.

 

దేవుని కుమారుడు యేసు యోర్దాను నదీ జలాలో బాప్తిస్మం తీసుకోవాలని ఎందుకు కోరుకున్నాడు? ఈ సంస్కారం దేవునకు అవసరమా? సృష్టి కర్త సృష్టి చేత సంస్కరింపబడతాడా? పవిత్ర ప్రజలను నీరు శుద్ధి చేస్తుందా లేక మానవులను శుద్ధి చేయడానికి అతిపవిత్ర జనుల ప్రవేశంతో నదీ జలాలు శుద్ధి చేయబడతాయా? తనచే యేసు బాప్తిస్మం తీసుకోకుండా బాప్తిస్మ యోహాను ఆపడానికి ప్రయత్నించాడు.నేను మీ ద్వారా బాప్తిస్మం తీసుకోవాలి. మీరు నా దగ్గరకు రావడం ఏమిటి? అని వారించ బోయాడు యోహాను. అపుడు యేసు అతనితో, “ఇప్పుడు ఇలా జరగనివ్వండి” (మత్త 3:14-15) అని నచ్చ జెప్పాడు. ఇటలీ దేశంలోని ట్యూరిను అను ప్రాంత పీఠాధిపతి అయిన పునీత మాక్సిమసు ఈ సంభాషణను బాగా అర్థం చేసుకొని ఇలా వ్రాస్తున్నాడు: “యేసు క్రీస్తు బాప్తిస్మం తీసుకోవడానికి గల కారణం యోర్దాను జలాల ద్వారా తాను పవిత్ర పరపబడడానికికాదు. కానీ అతను తాకిన నీరు అంతా మరియు భూమి మీద నెలకొని యున్న నీటి నంతటిని శుద్ధి చేయడానికి యేసు యోర్దాను నదిలో దిగాడు. రక్షకుడు నది నీటిని ఆ సమయాన తాకినపుడు సర్వ మానవాళి బాప్తిస్మం కోసం సర్వ జలాలు శుభ్రంగా తయారు చేయబడినాయి. భావి యుగాల ప్రజలకు బాప్తిస్మ కృపను అందించడం కోసం యేసు తన బాప్తిస్మ సంస్కారం ద్వారా సర్వ జలాలను శుద్ధి చేసాడు.

 

ఎర్ర సముద్రం గుండా ఇజ్రాయేలు బిడ్డలు వెడలినపుడు వారికి ముందు అగ్ని స్తంభం వెళ్ళింది. తద్వారా వారు వారి నిశి రాత్రి ప్రయాణంలో ధైర్యం పొందుకున్నారు. అదే విధంగా, బాప్తిస్మపు నీటి ద్వారా యేసును అనుసరించే వారికి మార్గాన్ని సిద్ధం చేయు నిమిత్తం యేసు సత్య వెలుగు స్తంభమై మొదట యోర్దాను నదీ జలాల గుండా వెళ్ళాడు. ఇశ్రాయేలీయుల నిర్గమ సమయంలో అగ్ని స్తంభము వారికి కాంతిని అందించింది. ఇప్పుడు అది బాప్తిస్మపు స్నానంలో మన విశ్వాసుల హృదయాలకు వెలుగునిస్తుంది. పాపమున మనము ఆదాము ఏవ పిల్లలము. కానీ ఇప్పుడు బాప్తిస్మము ద్వారా మరోసారి దేవుని బిడ్డలముగా రూపుదిద్దబడినాము. బాపిస్మము అనేది జీవితకాల పిలుపుకు నాంది”(Divine Office) అని నమ్మాడు.

 

బాప్తిస్మము పొందిన యేసు మనలను తన పోలికలో పునరుద్ధరించడానికి తన చైతనాత్మక క్రియ అయిన  పరిశుద్ధాత్మ బహుమానం ద్వారా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. అతను నీతి, శాంతి మరియు సంతోషాలను నెలకొల్పి అందించే తన రాజ్యానికి మిషనరీలుగా మనలను అభిషేకించాడు (రోమా 14:17). మన చుట్టూ ఉన్నవారికి ఆయన దయ మరియు మంచితనపు  అందచందాలతో నిండిన సువాసనలను ప్రసరింపజేసే ఆతని రాజ్యానికి మనము "వెలుగు మరియు ఉప్పు" అని మనలను పిలిచాడు (Mt 5:13,15-16). ఇతరులు పరిశుద్ధాత్మలో నూతన జీవితాన్ని, స్వేచ్ఛను ఆనందాన్ని పొందేలా తన ప్రేమ మరియు సత్యం మన ద్వారా ప్రకాశించాలని ప్రభువైన యేసు కోరుకుంటున్నాడు. తిరుసభ పితృపాదులు గ్రెగొరీ ఆఫ్ నజియాంజసు ఇలా చెబుతున్నాడు: “క్రీస్తుతో పాటు ఉత్థాన మవ్వడానికి బాప్తిస్మము ద్వారా మనం క్రీస్తుతో సమాధి చేయబడినాము. అతనితో లేపబడుటకు మనము అతనితో కలిసి మరణిద్దాము. అతనితో పాటు మహిమపరచబడుటకు మనము కూడా ఆయనతోపాటు  ఉత్థానమవుదాము".

 

నిబద్ధత కలిగిన క్రైస్తవుడు క్రీస్తు జీవితంలోని మన భాగస్వామ్య క్రియాత్మక ప్రభావాలను నిర్ధారించగలడు. మనం ఆధ్యాత్మిక సజీవులం. మనము దేవుని కుమార కుమార్తెలం. యేసు బాప్తిస్మ సమయంలో స్వర్గం నుండి వచ్చిన స్వరం, “ఈయన నా ప్రియమైన కుమారుడు,  ఇతనియందు నేను సంతోషించుచున్నాను” అని యేసును గూర్చి చెప్పిన ఘనత యేసు ఆత్మలో జీవించే మనకు కూడా దక్కుతుంది. ఇది నిజం. తధ్యం.

 

ఇతను మనుషుల మధ్య దేవుని నివాస స్థలం. ఇతను మన మధ్య నివసిస్తున్నాడు" (Divine Office)

 

He Made Waters Holy for our Purification (Is 40:1-5,9-11; Tit 2:11-14; 3:4-7; Lk 3:15-16,21-22 (Baptism of the Lord – C)

 


He Made Waters Holy for our Purification

 

(Is 40:1-5,9-11; Tit 2:11-14; 3:4-7; Lk 3:15-16,21-22 (Baptism of the Lord – C)

 

“Behold the Lamb of God. Behold him who takes away the sins of the world” (Divine  Office)

 

Today we celebrate the feast of the Baptism of the Lord. The baptism of Jesus is reported in three Synoptic Gospels—Matthew, Mark, and Luke. The Baptism of Jesus is a manifestation of God in Jesus, another “epiphany.”  In Luke’s Gospel, all three members of the Trinity are manifested: God the Father in the voice, the Holy Spirit descending, and Jesus the Son in the river Jordan.

 

Why did the Son of God desire to be baptized in the rivers of Jordan? Does the water purify the holy people or does the most holy purify the waters to purify the others? John the Baptist tried to stop Jesus from being baptized by him saying, “I need to be baptized by You. Do You come to me? Jesus told him, “Let it be done now” (Mt 3:14-15). St Maximus of Turin understands it well. He says that Christ is baptized, not to be made holy by the waters of Jordan, but to make the water holy to purify the waters which he touched. When the Savior is washed, all water for our baptism is made clean, and purified at its source for dispensing baptismal grace to the people of future ages.

 

The column of fire went before the sons of Israel through the Red Sea so they could follow on their brave journey. In the same way, the column went first through the waters to prepare a path for those who follow Jesus through the waters of Baptism. At the time of the Exodus, the column provided light for the people. Now it gives light to the hearts of believers in  Baptism. We are children of Adam and Eve and once again made children of God through Baptism. Baptism is the beginning of a lifelong call.

 

The Baptized Jesus is ever ready to renew and refashion us in his likeness through the gift and working of the Holy Spirit - and he anoints us for a mission as missionaries of his kingdom of righteousness, peace, and joy (Rom 14:17). We are called to be the “light and salt” of his kingdom that radiate the beauty and aroma of his mercy and goodness to those around us (Mt 5:13,15-16). The Lord Jesus wants his love and truth to shine through us so that many others may find new life, freedom, and joy in the Holy Spirit. Gregory of Nazianzus, an early church Father tells us: “Let us be buried with Christ by Baptism to rise with him; let us go down with him to be raised with him; and let us rise with him to be glorified with him.”

 

The committed Christian ascertains the effects of an action upon our sharing in the Life of Christ. We are spiritualized.  We are sons and daughters of God.  We have dignity, the dignity of the One about whom the voice from heaven said at his Baptism, “This is my son, my beloved, in whom I am well pleased.”

 

“This is God’s dwelling place among men. He shall live with them” (Divine Office)

Wednesday, 8 January 2025

AN INTRODUCTION TO THE GOSPEL OF LUKE (BACKGROUND)

 

AN INTRODUCTION TO THE GOSPEL OF LUKE

(Lesson 01 – Jan 07, 2025) BACKGROUND

 

 

Ta Biblia (GK) means “the books” (collection of books). The canon of the Catholic Church was affirmed by the Council of Rome (382), the Synod of Hippo (393), two of the Councils of Carthage (397 and 419), the Council of Florence (1431–1449), and finally, as an article of faith, by the Council of Trent (1545–1563). Those established the Catholic biblical canon consisted of 46 Old Testament, 27 New Testament, and 73 books in total.

 

The Protestant Bible contains 66 books in total—39 in the Old Testament and 27 in the New Testament. However, it does not contain seven books: Baruch, Tobit, Judith, I and 2 Maccabees, Wisdom, or Sirach, which Roman Catholic, Eastern Catholic, and Orthodox Churches use. These books are called Deuterocanonical books. Catholics and Protestants agree on the New Testament, which contains 27 books.

 

Until Martin Luther (not to be confused with Martin Luther King) an Augustinian friar, and ordained priest (1507) the Church had all these Canonical books.

 

The paschal event was the central point to tracing the Jewish people's beginnings (Old Testament), reflected in the era of King Solomon. Christ’s passion, death, and resurrection were the main events for the beginning of Christianity and the New Testament.

 

New Testament (27 Books): 4 Gospels: (3 Synoptic Gospels: Matthew, Mark, Luke) and the Gospel of John; Acts of the Apostles; “Pauline epistles” are letters written by the apostle Paul (14), while “Catholic epistles” (7 also called “general epistles”) are letters from other apostles like Peter (2 letters), James, John (3 letters), and Jude; and The Book of Revelation by John

 

The Pauline Epistles are addressed to specific communities or individuals. The Catholic Epistles are concerned with the connection between faith and works, and the importance of correct doctrine and moral living. For example, 1 Peter encourages followers of Jesus to live out their new identity in Christ, while Jude confronts those who deny the right doctrine through immoral lifestyles.

 




According to the majority of scholars, the Gospels were probably written between AD 66 and 110Mark was the first to be written, using a variety of sources, followed by Matthew and Luke, which both independently used Mark for their narrative of Jesus's career, supplementing it with a collection of sayings called "the Q source" (German word Quelle = source = sayings of Jesus), and additional material unique to each – so they are called Synoptic Gospels

 

 

 

Ex. Common Tradition of Mt and Lk  = “Do to others what you would have them do to you”  Lk 6:31 and Mt 7:12.


Many non-canonical gospels were also written later than the four canonical gospels and like them advocated the theological views of their various authors. Important examples include the gospels of Thomas, Peter, Judas, and Mary; infancy gospels such as that of James (the first to introduce the perpetual virginity of Mary); and gospel harmonies such as the Diatessaron.

 

The Book of Enoch is an ancient Jewish religious text considered non-canonical and not included in the Bible. But, there are several references to Enoch in the Bible: Enoch, the great-grandfather of Noah. Jude 1:14–15: A prophetic passage that quotes from the Book of Enoch. The passage attributes the words to “Enoch, the Seventh from Adam; Lk 3:37: Briefly mentions Enoch in one of the genealogies of Jesus' ancestors; Gen 5:18: Mentions Enoch as the seventh generation from Adam and the father of Methuselah; 1 Pet 3:19–20; 2 Pet 2:4–5; Mt 5:5; Lk 6:24; Mt 19:28; Lk 16:26; Jn 12:36.

 

Until the age of the printing press - Papyrus was made from the pith of the papyrus plant, Cyperus papyrus, a wetland sedge. Papyrus (plural: papyri or papyruses) can also refer to a document written on sheets of such material, joined side by side and rolled up into a scroll, an early form of a book.

 

LXX (Septuagint, Seventy) Ptolemy II Philadelphus (the Greek Pharaoh of Egypt) sent seventy-two Hebrew translators—six from each of the Twelve Tribes of Israel—from Jerusalem to Alexandria to translate the Tanakh from Biblical Hebrew into Koine Greek.

 

Inspiration and Inerrancy: Inspiration from God's errors by human incapacity in the Bible by the translators.

 

The symbols of the 4 Gospels: Matthew = man, Mark = lion, John = eagle, and Luke = calf

 

 

The gospel of Luke (a companion of Paul) and the Acts of the Apostles make up a two-volume work that scholars call Luke-Acts. Luke begins his gospel with a preface addressed to “Theophilus,” which means “Lover of God” and could refer to any Christian.

 

Luke emphasizes the fact that Jesus and all his earliest followers were Jews, although by his time the majority of Christ-followers were Gentiles. Nevertheless, the Jews had rejected and killed the Messiah, and the Christian mission now lay with the Gentiles. 


Lukan source from Old Testament: Ex. "He has filled the hungry with good things but has sent the rich away empty":  Lk 1:53 = Ps 107:9; 1 Sam 2:5.   

 

.......To be Continued....

Saturday, 4 January 2025

మనం దేవుడిని చూశాం: యెషయ 60:1-6; ఎఫేసి 3:2-3a,5-6; మత్త 2:1-12 (క్రీస్తు సాక్షాత్కారం C)

 

మనం దేవుడిని చూశాం

యెషయ 60:1-6; ఎఫేసి 3:2-3a,5-6; మత్త 2:1-12 (క్రీస్తు సాక్షాత్కారం  C)

మనము వెళ్లి ఆయనను వెదకుదాము. మనం అతనికి బంగారము,  బోళము మరియు సుగంధ పరిమళాల బహుమతులను అందజేద్దాం” (Divine Office)

 

ఆంగ్ల పదం “ఎపిఫనీ” గ్రీకు పదం “ఎపిఫనీయ” అనే పదం నుండి వెలువడింది. తెలుగు భాష నందు "వ్యక్తీకరణ" లేదా “ సాక్షాత్కారము" అని అర్ధం. యేసును ఇజ్రాయేలు మెస్సీయగా, దేవుని కుమారుడుగా మరియు ప్రపంచ రక్షకునిగా చూపడం" అని ఈ మాటకు అర్థం. చారిత్రాత్మకంగా క్రీస్తు ప్రారంభ జీవితంలో మరియు తన పరిచర్య జీవిత క్షణాల్లో అనేక "ఎపిఫనీ"లను జరుపుకుంటాము. వీటిలో ప్రాముఖ్యంగా బెత్లెహేములో అతని జననం, జ్ఞానుల సందర్శన, బాప్తిస్మ యోహాను చేత ఆతని బాప్తిస్మము మరియు గలలీయలోని కానా పల్లెలో అతని మొదటి అద్భుతం (CCC 528).

 

తిరుసభ పితృ పాదులు జాను క్రిసోస్టముడు  బెత్లెహేము నక్షత్రపు ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరిస్తాడు. జ్ఞానులు బెత్లెహేము గమ్యాన్ని చేరుకునే వరకు ఆ నక్షత్రం పవిత్ర స్థలాన్ని ప్రకాశింపజేసింది అని వ్రాశాడు. తూర్పు నుండి దేవుని జ్ఞానం కోసం దాహంతోవచ్చిన జ్ఞానుల  నిజమైన జ్ఞాన మూలం యేసు క్రీస్తు!! దేవుని కాంతి జ్ఞానాన్ని వెతకడానికి ఇష్టపూర్వకంగా సమస్తమును విడిచిపెట్టారు. వారు నవజాత రాజును కనుగొన్నప్పుడు  వినయంగా అతనిని వారు ఆరాధించారు. ఆ రాజు  శాంతి యువరాజు (యేష 9:6), రాజులకు రారాజు (ప్రకటన 19:16). అందుచేతనే ఆతనికి తగినటువంటి బహుమతులు ఇచ్చారు.


యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు లోకం ఆయనను తెలుసుకోలేదని మరియు ఆయన స్వంత ప్రజలే  ఆయనను స్వీకరించలేదని భక్త యోహాను సువార్తికుడు పేర్కొన్నాడు (యోహా 1:10-11). ఆ నిశి రాత్రిన జ్ఞానులు, మరి కొంతమంది గొర్రెల కాపరులు తప్ప ప్రపంచంలోని మిగిలిన వారందరూ అంధకారంలోనే వుండిపోయారు. యూదుల పెద్దలకు ఏమైంది? వాగ్ధాన ప్రవచనాలు కప్పివేయ బడ్డాయా? కానీ మనం మాత్దేరం వుడిని చూశాం (న్యాయాధి. 13:22; యోహా 14:9; యోహా 1:14). విశ్వాసం అనేది భగవంతుడు మనకు ఇచ్చే పూర్తి బహుమతి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వెల్లడించిన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, అంగీకరించడానికి మరియు విశ్వసించడానికి హృదయం అనేది మనస్సు కళ్ళను తెరుస్తుంది. విశ్వాస జీవితంలో, మానవ సంకల్పం మరియు బుద్ధి అనేవి దేవుని దయతో సహకరించాలి కదా! అందుచేతనే పునీత థామస్ అక్వినాసు “మానవ బుద్ధిన విశ్వాస క్రియ అనేది దేవుని కృప చేత ప్రేరేపించబడిన సంకల్పంవల్ల దైవీక సత్యం వైపు చైతన్యం చేయబడే ఒక చర్య” అని అంటాడు.

 

జ్ఞానులు బహుకరించిన బహుమతుల అర్థం క్రీస్తు శాస్త్రము (క్రిస్టోలాజి)నకు అనుబంధముగా వుందని  అని మనము నమ్ముతున్నాము. యేసు, రాజు కాబట్టి దానికి ప్రతినిధిగా బంగారం సమర్పించబడింది. యాజకులు ఆలయంలో దేవునకు సాంబ్రాణి పదార్థాన్నిఅర్పిస్తారు. యేసు నిత్య శాశ్విత యాజకుడు కాబట్టి దానికి అణుగుణంగా సాంబ్రాణిని  సమర్పించారు. మరణించిన వారి దేహములకు సుగంధ పరిమళాలను పూస్తారు. యేసు క్రీస్తు సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు. మానవ కళ్యాణార్ధం మరణించ బోతున్నాడని వేద జ్ఞానాన్ని గ్రహించిన తూర్పు జ్ఞానులు ముందుగానే ఆతని సమాధి సంసిద్ధత కొరకు ఉపయోగించే ఆ సుగంధ ద్రవ్యములను బహుకరించారు.

 

మరి మనము ఆతనికి ఏమి బహుహరించాలనుకుంటున్నాముయేసుక్రీస్తును కలుసుకోవడమంటే దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం. యేసుతో జ్ఞానుల ముఖాముఖి సాక్షత్కారమున, యూదు ప్రజలకు మాత్రమె కాకుండా సర్వ ప్రజలకు తన ఏకైక కుమారుడిని రాజుగా రక్షకునిగా ఇవ్వాలనే దేవాధి దేవుని ప్రణాళికను చూస్తున్నాము. యూదులు మరియు అన్యజనులు ఇద్దరూ దేవునితో నిజమైన శాశ్వతమైన శాంతిని కనుగొనడానికి యేసు ప్రభువు వచ్చాడు. చివరిగా, బెత్లెహేము అను పదం రెండు హేబ్రియ పదాల కలియిక. బెత్ అంటే ఇల్లు అనీ, లేహెం అంటే రొట్టె అని అర్ధం. మొత్తంగా బెత్లెహేము అంటే “గృహ రొట్టె” అని అర్ధం. బెత్లెహేములో సాక్షాత్కారించిన యేసు సజీవ రొట్టె. నిత్య జీవమునకు ఆకలిని తీర్చే నిత్య జీవాహారం. యేసును విశ్వసించే మనము, విశ్వసించని వారందరూ ఆ “బెత్లెహేము”లోనే మన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం కొనసాగాలని ప్రార్థిద్దాం.

 

మనం ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో ఉన్నట్లే మనం నిజమైన దేవునిలో ఉన్నాము” (Divine Office)

We have Seen God: Is 60:1-6; Eph 3:2-3a,5-6; Mt 2:1-12 (Epiphany C)

 

We Have Seen God

 

Is 60:1-6; Eph 3:2-3a,5-6; Mt 2:1-12 (Epiphany C)

 

“let us go and seek him; let us offer him gifts: gold, frankincense and myrrh’.

 

The Greek word “Epiphania” means “Epiphany” meaning “manifestation” or “showing forth Jesus as Messiah of Israel, Son of God and Savior of the world.” Historically several moments in Christ’s early life and ministry have been celebrated as “epiphanies,” including his birth in Bethlehem, the visit of the Magi, his baptism by John, and his first miracle at Cana in Galilee (CCC 528).

 

John Chrysostom explains the significance of the star of Bethlehem. He writes that the star at Bethlehem was to manifest and illumine the lowly place until the magi or wise men had reached their destination at the manger. In their thirst for knowledge of God, the wise men from the East willingly left everything to seek the source of true knowledge Jesus Christ, the Light and Wisdom of God. When they found the newborn King, they humbly worshiped him and gave him gifts fitting for a king the Prince of Peace (Is 9:6), King of Kings (Rev 19:16), and Savior. 


John the Evangelist states that when Jesus came into the world the world knew him not and his people received him not (Jn1:10-11). Apart from the Magi and some shepherds, the rest of the world remained in the dark. What happened to the elders of the Jews? But “We have seen God” (Judg. 13:22; Jn 14:9; Jn 1:14). Faith is an entire gift that God gives us. Through the help of the Holy Spirit, the heart opens the eyes of the mind to understand, accept, and believe the truth that God has revealed through his Son, Jesus Christ. In faith, the human will, and intellect cooperate with grace. Thomas Aquinas says, “Believing is an act of the intellect assenting to the divine truth by command of the will moved by God through grace”.

 

We believe the meaning of the gifts of the Magi to be Christological. Gold is presented as representative of Jesus’ kingship. Frankincense symbolizes divinity because priests burned the substance in the Temple. Myrrh, which was used to prepare the dead for burial, is offered in anticipation of Jesus’ death. What do we wish to offer him? To know and to encounter Jesus Christ is to know God personally. In the encounter of the wise men with Jesus, we see the plan of God to give his only Son as King and Savior, not just for the Jewish people but for all the nations as well. The Lord Jesus came that both Jew and Gentile might find true and lasting peace with God. Bethlehem is a Hebrew name consisting of two terms: Beth (house) and lehem (bread). Bethlehem means “House of Bread”. Jesus who is born at Bethlehem is the “bread of Life”. Let us pray that we and non-Christians might live in that “Bethlehem” towards union with God.

 

“We are in the true God, as we are in his Son, Jesus Christ” (Divine Office)