AletheiAnveshana

Saturday, 25 January 2025

విమోచకుడు: నెహే 8:2-4a,5-6,8-10; 1 కొరింథీ 12:12-30; లూకా 1:1-4; 4:14-21 ( 3 సి)

 

విమోచకుడు

నెహే 8:2-4a,5-6,8-10; 1 కొరింథీ 12:12-30; లూకా 1:1-4; 4:14-21 ( 3 సి)

".. ప్రతీ అర్చన వేడుక, యాజకుడు క్రీస్తు శరీర క్రియ. ఇది క్రీస్తు సంఘం" ( Divine Office)

 

 లూకా సువార్తకుడు తన సువార్త  ప్రారంభ వచనాలలో సువార ఉద్దేశ్యాన్ని చాలా చక్కగా స్థాపించాడు. అతని గ్రంథస్త శైలి మెరుగుపెట్టిన గ్రీకు మరియు రోమను సాహిత్యానికి విలక్షణమైనది. లూకా తన సువార్తను “థియోఫిలస్” (లూకా 1:3) అనే పేరుగల వ్యక్తికి వ్రాసి ఉండవచ్చు! ఈ  థియోఫిలస్” అనే వ్యక్తీ చరిత్రలో వున్నవాడా అనేది పరిశుద్ధ వేద పండితుల్లో నిలిచిపోయిన చాలా పెద్ద ప్రశ్న! నిజానికి గ్రీకు పదం “థియోఫిలస్” అంటే “దేవుని ప్రియమైనవాడు” అని అర్ధం. దీని అర్థం బట్టి చూస్తే ఆ “థియోఫిలస్” ఎవరో కాదు - అది “దేవుని ప్రియమైన వాడ”యిన నువ్వు నేను అని మన గ్రహింపుకు తెలుస్తుంది. కాబట్టి లూకా సువార్తికుడు దేవుణ్ణి ప్రేమించే మరియు ప్రేమించ ఆశ పడే వారందరికీ తన సువార్తను వ్రాస్తున్నాడు. నజరేయుడైన యేసును గురించిన "సత్యాన్ని తెలుసుకోవాలని" తన పాఠకులను (లూకా 1:4) కోరుకున్నాడు లూకా. యేసు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించినప్పుడు అతని వయస్సు దాదాపు 30 సంవత్సరాలు అని లూకా మనకు చెప్తున్నాడు (లూకా 3:23). యేసు యోర్దాను నదిలో బాప్తిస్మం స్వీకరించిన వెంటనే (లూకా 3:21-22) సైతానుచే శోదించబడటానికి ఆత్మచేత (లూకా 4:1) అరణ్యంలోకి నడిపించబడినాడు (లూకా 4:1). ఆధ్యాత్మిక పరీక్షా కాలం ముగింపులో, యెషయా ప్రవక్త ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు తన బహిరంగ పరిచర్యను గలిలయలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు కూడా లూకా మనకు తెలియజేస్తున్నాడు (యేష 9:1,2).

 

మెస్సీయ "శుభవార్త"ను బోధిస్తాడనీ, అణచివేయబడిన వారందరికీ స్వస్థత మరియు స్వేచ్ఛను తీసుకోస్తాడని యెషయా ప్రవచించాడు (Is 61:1-2). తదనుగుణంగా, దేవుడు పంపిన మెస్సీయ తన “వ్యక్తి” లో నెరవేర్చిన ఆతని వాగ్దానాలపై వారి నిరీక్షణను మేల్కొల్పాడు. దేవుని ఆత్మ అనేది యేసును నడిపించే ప్రేరణగానూ, పేదల వద్దకు పంపించడం, అతని జీవితమంతా అవసరమైన, అణచివేయబడిన, అవమానించబడిన వారి వైపు మళ్లించడం. హిబ్రూ భాషన వీరందరిని ఒక్క మాటలో చెప్పాలంటే “అనావిం” అని చెప్పాలి. నేడు ఈ “అనావిం” మన మధ్యన చాలనే వున్నారు. "సువార్త" అనే పదానికి అక్షరాలా "శుభవార్త" అని అర్థం. ఈ రోజు దానిని అంగీకరించే వారందరికి  స్వేచ్ఛను మరియు మార్పు తీసుకురావడానికి ఇది సర్వశక్తిమంతమై, దయగలిగిన  జీవాన్ని ఇచ్చే శక్తిగా ఉంది.

 

"పేదలకు సువార్త బోధించబడినప్పుడు (లూకా 4,18), అది క్రీస్తు ఉనికికి సంకేతం"గా వుంటుంది (CCC 2443) అని మాతృ శ్రీసభ అర్థం చేసుకుంటుంది. తిరుసభ తాడిత పీడిత జనుల వైపు కొమ్ము కాస్తుంది. 'పేదల ఎంపిక' (ఆప్షన్ ఫర్ ది పువర్) అనే అంశాన్ని ద్వితీయ వాటికను మహా సభ కనుగొనలేదు. ఇది దేవుని ఎంపిక. అతను దానిని యేసు “భూలోక శరీర రోజుల్లో” తన  జీవితమంతా శ్వాసించాడు. నవ నవ్య వృద్ధి సాంకేతిక సమాజంలో దారిద్రియ రేఖన ఇంకా అణగారియున్న జనులను, సమాజంనుండి మినహాయింపబడిన వారిని రక్షించడానికి, వారికి మన సంఘీభావం తెలియచేయకపోతే, యేసుక్రీస్తువలె జీవించడం లేదా ఆతనిని  ప్రకటించడం అనేది అసలు సాధ్యమే కాదు. మన పోరు వారి పక్షాన లేకపోతె మనం ఏం సువార్తను ప్రకటిస్తున్నాము? మనం ఏ యేసును అనుసరిస్తున్నాము? ఈరోజు వివిధ రకాలైన వివక్షను ఎదుర్కొనేవారు, సమాజ పొలిమేర చూపులతో చూడబడి బాధపడేవారు యేసు విమోచకుడని అర్థం చేసుకొన శక్తిని వారికి ఇవ్వ లేకపోతే మనం ఏ ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తున్నాము? ఎటువంటి క్రీస్తు సంస్కరణలను వెలుగులోకి తెస్తున్నాము?

 

పునీత  పౌలుడు  ఇలా అంటాడు, "అవయవములు అనేకములైనను శరీరమొక్కటే. శరీరము ఏలాగున  అనేకమైన అవయవములను కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నదో...శరీరంలోని ఏదైనా అవయవం నాకు నీ అవసరం లేదు’ అని మరొకరితో చెప్పగలదా, ... ఒక అవయవం బాధపడితే, అందరూ కలిసి బాధపడతారు. ఒక సభ్యుడు గౌరవించబడినట్లయితే, అందరూ సంతోషిస్తారు” (1 కొరింథీ 12:20-23). ప్రభువైన యేసు నేడు మనలో ప్రతి ఒక్కరితో ఇలాగునే మాట్లాడుతున్నాడు. అతను మనకు స్వస్థత, పునరుద్ధరణ, క్షమాపణ మరియు పాపం, నిరాశ, నిస్సహాయత, విధ్వంసం, వివిధ రకాలైన అణచివేతల నుండి విముక్తిని తెస్తాడు. ప్రభువు తనను విశ్వసించి, తన కృపకు వాహినిగా మారడానికి ప్రయత్నించే మనందరిపై తన ఆత్మను కుమ్మరించడాన్ని ఎప్పటికి తిరస్కరించడు. సువార్త ఆనందాన్ని నమ్మకమైన విశ్వాసంతో, సంతోషకరమైన నిరీక్షణతో ఋజువర్తన ప్రేమతో ప్రతిరోజూ జీవించే స్వేచ్ఛను పునరుద్ధరించమని ప్రభువైన యేసును అడుగుదాం.

ప్రభూ, నీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం, అల్లెలూయా” (Divine Office)

The Liberator of the Captives : Neh 8:2-4a,5-6,8-10; 1 Cor 12:12-30; Lk 1:1-4; 4:14-21 (3 C)



The Liberator of the Captives


Neh 8:2-4a,5-6,8-10; 1 Cor 12:12-30; Lk 1:1-4; 4:14-21 (3  C)

“..every liturgical celebration, as an activity of Christ the priest and of his body, which is the Church” ( Divine Office)

 

In the opening verses, Luke establishes the purpose of his Gospel. His style is typical of polished Greek and Roman literature. We learn that Luke may have written to “Theophilus” (Lk 1:3). The Greek word “Theophilus” means “beloved of God”. This meaning could be you and me - “the lover of God”. Luke wants his readers to “know the truth” (Lk 1:4) about Jesus of Nazareth. He tells us that Jesus was about 30 years of age when he began his public ministry (Lk 3:23). Right after Jesus was baptized in the River Jordan (Lk 3:21-22), he was led by the Spirit into the wilderness (Lk 4:1) to be tempted by the Devil (Mt 4:1). At the end of the period of spiritual preparation and testing, Luke tells us that Jesus chose to begin his public ministry in Galilee in fulfillment of the prophecy of Isaiah (Is 9:1,2).

 

Isaiah prophesied that the Messiah would preach “good news” and bring healing and freedom to all who are oppressed (Is 61:1-2). Accordingly, Jesus the Messiah sent by God awakened their hope in God’s promises fulfilled in his person. God’s Spirit is the impulse directing Jesus, sending him to the poor, directing his whole life toward those in need, oppressed, and humiliated. To say it in a single word of Hebrew, it is “anawim”. The word “gospel” literally means “good news”. It has the all-powerful, merciful, and life-giving power to transform and bring freedom to those who accept it today.

 

The Church understands that “when ‘the poor have the good news preached (Lk 4,18), it is the sign of Christ’s presence” (CCC 2443). The Church opts for the poor. The ‘option for the poor’ is not invented by Vatican II. It is the option of God. He breathes it through Jesus’ whole life. It’s not possible to live and announce Jesus Christ if we don’t do it in defense of the least and in solidarity with those who are excluded. What Gospel are we preaching? What Jesus are we following? What spirituality are we promoting, if Jesus isn’t understood as the liberator by those who suffer in various forms of discrimination and alienation?

 

St Paul says, “Just as the body is one and has many members, and all the members of the body, though many, are one body. Can any organ or member of the body say to another - I do not require you… If one member suffers, all suffer together. If one member is honored, all rejoice (1 Cor 12:20-23). The Lord Jesus speaks the same word to each of us today. He brings us healing, restoration, pardon, and freedom from the oppression of sin, despair, hopelessness, and destruction. The Lord will not refuse to pour out his Spirit on all of us who trust in him and try to become the channel of his grace. Let us ask the Lord Jesus to renew the joy of the Gospel and the freedom to live each day with trusting faith, joyful hope, and fervent love.


“Your kingdom, Lord, is an everlasting kingdom, alleluia” (Divine Office)

Wednesday, 22 January 2025

THE GOSPEL ACCORDING TO LUKE (Lesson 02 – Jan 21, 2024) Background - 2

 

THE GOSPEL ACCORDING TO LUKE


(Lesson 02 – Jan 21, 2024) Background - 2

 

Author, Date, and Audience: Luke was a physician (Col 4:14) and a travel companion of Paul. The possible date of Luke–Acts is AD 62 in the events of persecution (Acts 28). Luke and Acts are addressed to “Theophilus” (Lk 1:3; Acts 1:1) about Jesus.

 

Aim: Jesus is the promised one of God as prophesied in the Old Testament for all, Jews and Gentiles alike to see God’s saving activity in Jesus’ life, death, and resurrection.

 

Purpose: Luke probably had several goals in writing:

 

(1) Assure the truth of Christ

(2) Understand how Israel rejected Jesus and welcomed the Gentiles into the kingdom of God

(3) Universality of Salvation

(4) The fulfillment of the OT promises

(5) Jesus does not return immediately but there is a period between his resurrection and his return

(6) Emphasize not to be terrified of any earthly power such as Rome.

(7) Importance of Women

 

 

Main Themes

 

1. God’s sovereign rule over history (Lk 13:33; 22:22, 42) – Jerusalem, the city of destiny

 

2. The arrival and actual presence (though not yet the completion) of the kingdom of God (Lk 11:2; 17:20–21; 21:34–36) - “the Kingdom of God is among you” (Lk 17:20-21)

 

3. The coming and presence of the Holy Spirit for Jesus and his followers (Lk 1:15–17, 35; 2:25–27; 3:16, 22; 4:1, 18; 24:49).

 

4. The great reversal in the world. The first become last and the last become first, the proud are made low and the humble are exalted (Lk 1:48; 6:20–26; 13:30; 14:11).

 

5. Invitation to live a life of prayer practicing good stewardship with their possessions (Lk 6:12; 9:28–29; 11:1–4; 12:33–34; 18:1; 22:40).

 

6. The danger of riches (Lk 6:20–26; 8:14; 12:13–21; 16:10–13, 19–31).

 

 

Outline

I. The Prologue (1:1–4)

II. The Infancy Narrative (1:5–2:52)

III. Preparation for the Ministry of Jesus (3:1–4:15)

IV. The Ministry of Jesus in Galilee (4:16–9:50)

V. The Journey to Jerusalem (9:51–19:27)

VI. The Ministry of Jesus in Jerusalem (19:28–21:38)

VII. The Suffering and Death of Jesus (22:1–23:56)

VIII. The Resurrection of Jesus (24:1–53)

 

TEXT ANALYSIS OF LUKE:   CHAPTER 1 (vv 1-9)

 

Vv. 1-4: It is a prologue in the way of Hellenistic Greek writers, and contemporary Greco-Roman literature. Ex: Herodotus begins, “These are the researches of Herodotus of Halicarnassus.” A much later historian, Dionysius of Halicarnassus, tells us at the beginning of his history, "Before beginning to write I gathered information, partly from the lips of the most learned men with whom I came into contact, and partly from histories written by Romans of whom they spoke with praise."

 

   Not only Luke writes the words and deeds of Jesus but also of his birth, ministry, death, and resurrection as fulfillment of OT. He acknowledges his debt to earlier eyewitnesses and ministers. Real religion is never a second-hand thing. It is a personal discovery. Luke had to rediscover Jesus Christ for himself. Personal experience is required. True inspiration comes when the seeking mind of man joins with the revealing Spirit of God (Mt 7:7)

 

Adding his source in a complete and accurate account writes to “Theophilus” (Friend of God)

 

V.  5a: Herod, king of Judea also known as Herod Antipas. He ruled as a tetrarch (a title, a ruler of one fourth in GK) of Galilee and Perea after the death of his father, Herod the Great. He was declared “king of Judea” by the Roman senate in 40 BC. but became undisputed ruler of Palestine only in 37 BC.

 

How does Luke see Christ?

 

Vv. 5b, 8, 9: Abijah to Zachariah: Zachariah was a priest who belonged to the section of Abijah/ Abihu. Who was Abijah? He was a descendant of Eleazar, the son of Aaron.  Aaron was the brother of Moses (Ex 4:14). He is identified as the brother of Moses, a Levite {(Jochebed - a daughter of Levi tribe, mother of Miriam, Aaron, and Moses (Num 26:59)}. How many sons did Aaron have? Aaron had four sons (Lev 10: 1, 6): Nadab, Abihu, Eleazar, and Ithamar. All four were ordained as priests. Moses instituted priests and Levites. Priests were direct descendants of Aaron. Priests offered the sacrifices and Levites helped the priests in the ceremonies. Who were the Levites? Levites were the descendants of Levi (Num 1:49).


Read the Book of Numbers 1:47-54

 

Abijah/ Abihu was a chief of the eighth (1 Chro 24:10) of the twenty-four orders into which the priesthood was divided (1 Chro 24: 7-19) and small groups of Levites (1 Chro 24: 4-6) by David (1 Chro 28:12-13). Moses instituted and David divided for the sake of the liturgy.

 

Priests could get an opportunity to serve a week at a time, twice a year. Abijah/ Abhihu was an ancestor of Zechariah, the priest who was the father of John the BaptistHe is not to be confused with Abijah daughter of Zechariah seen at 2 Kings 18:2 who gave birth to Hezekiah king of Jerusalem who reigned for 29 years.

 

 

What happened to the sons of Aaron and Moses?

 

Aaron had 4 sons. The first older sons Nadab and Abihu “offered fire that had not been commanded” to be consumed by the fire (Lev. 10:1). Another set of sons namely Eleazar and Ithamar were almost consumed because they did not obey the command of Moses (Lev. 10: 6, 8, 12, 17). V. 17 is most important.

 

What happened to the sons of Eli?  The wickedness of Eli’s sons (1 Sam 2: 12—17; 25, 12-13; 34).

                                        

What happened to the sons of Samuel? Joel and Abijah, the first judges (1 Sam 8:1-3) sought illicit gains. God needed to appoint a king.

 

Duty of the priests: “Aaron shall bring forward the live goat. Laying both the hands” (Lev. 16:20, 21,22). Does the blood of an animal remove our sins?

 

 

Leviticus 10:17 says, “it was given to you to take away the guilt of the community by making atonement for them before the Lord”.

 

God’s Decision: “I will choose a faithful priest who shall do what I have in heart and mind, I will establish a lasting house for him which shall function in the presence of my anointed forever” (1 Sam 2: 35)

 

Jesus Christ the High Priest “the impossibility of the blood of the animals to take away the sins” (Heb 10:3); Jesus Christ offered himself once and for all (Heb 10:9); became one of us (Heb 2:17) and “let us hold him fast” (Heb 4:14).

 

For this, God prepares the path for his coming to his humanity.

 

V. 7:Childless” – it was looked upon in contemporaneous Judaism as a curse or punishment for sin. It was intended to present Elizabeth in a situation similar to that of some of the great mothers of important OT figures like Sarah (Gen 15:3; 16:1); Rebekah (Gen 25:21) Rachel (Gen 29:31; 30:1); the mother of Samson and wife of Manoah (Jds13:2-3); Hanah (1 Sam 1:2). Elizabeth was a descendant of Aaron. Both were from the priestly class. Pure blood.

 

God makes his chosen fruitless first to make them exemplary and fruitful next to generation after generation to come.

 

Christ comes from the tribe of Judah to be the King of Kings, the high priest from the pure Blood to rule out the priestly class of the Old Testament, and Messiah prophesied by the prophets (John the Baptist, being the bridge between the OT and NT).

 

Do not be afraid(Lk 1:13)

 

 

 

 

Saturday, 18 January 2025

కానా వివాహము – లోక కళ్యాణ దివ్య సంస్కారం: యెషయ 62:1-5; 1 కొరింథి 12:4-11; యోహాను 2:1-11 (C 2)

 


కానా వివాహము – లోక కళ్యాణ దివ్య సంస్కారం

యెషయ 62:1-5; 1 కొరింథి 12:4-11; యోహాను  2:1-11 (C 2)

మీ కళ్ళు ధన్యమైనవి, ఎందుకంటే అవి చూస్తున్నాయి (Divine Office)

 

దేవుని రక్షణను వివరించడానికి అద్భుతాలు, వివాహా విందులు, ‘ద్రాక్షా వల్లి రెమ్మలు’ వంటి సంకేతాలు మరియు చిహ్నాలు పరిశుద్ధ గ్రంథంలో చాలానే ఉన్నాయి. యోహాను సువార్తికుడు క్రీస్తు చూపించిన ‘సంకేతాల’ను మన కళ్ళు చూడ మించిన వాటి పరమార్ధాన్ని చూపే సంజ్ఞలుగా అర్థం చేసుకున్నాడు. ఇశ్రాయేలుకు యెహోవా ఇచ్చిన వాగ్దానాన్ని తిరిగి అర్థం చేసుకోవడానికి మరియు నెరవేర్చడానికి అతను యేసును మనకు సమర్పించుకున్నాడు. కానా పల్లె వద్ద ‘నీటిని ద్రాక్షారసంగా మార్చడం’ అనే సంకేతం, యేసు మనకు అందించే “పరిపూర్ణ పరివర్తనాత్మక రక్షణను” మనకు తెస్తుంది. ప్రేమకు చిహ్నంగా ఓ పెళ్లి వేడుకలో ఈ సంకేతం జరిగింది. ఇది మానవులతో దేవుని నిశ్చయాత్మకమైన సహవాసాన్ని వ్యక్తీకరించడానికి పరిశుద్ధగ్రంథ సంప్రదాయంలో మనకు కనిపించే అత్యత్తమ ప్రతిమ. జీవితమంతా విచిత్రంగానూ దిక్కుతోచలేనంత అయోమయ స్థితిలో దిగాలుగా ఖాళీ అయిపోయింది   అనిపించినప్పుడు యేసు అనుచరులు తన మోక్షాన్ని  తప్పనిసరిగా వెతకి జీవించాలి మరియు దానిని ఇతరులకు అందించాలి. పాత నిబంధనలో 'ద్రాక్షా రసం' అనేది దేవుని బహుమతిగానూ  ఆశీర్వాదంగా పరిగణించబడింది (ద్వితీ 7:13; సామే 3:10, కీర్తన 105). యేసు మనకు తెచ్చే రక్షణ  మన జీవితంలో విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది.


నేడు చాలా మంది క్రైస్తవ, అందునా కథోలిక విశ్వాసులు దేవాలయంలో జరిగే సాంఘిక దైవీక సంస్కారముల పరిచర్య అనేది జీవాన్ని ఇచ్చే సజీవ సంజ్ఞలుగా భావించడం లేదు. పరిగణించడంలేదు.  ప్రార్ధనా వేడుక వారికి ‘బోరింగ్‌’ అనిపిస్తుంది. అందుచేతనే మాతృ శ్రీసభ - జీవితంలోని బాధలు, క్రూరత్వాలను తగ్గించడానికి యేసు సామర్థ్యాన్ని కనుగొనాలని, అందునా ఆధ్యాత్మిక జీవితాన్ని ధృవీకరించే అర్చన సంస్కార సంకేతాలను మరియు చిహ్నాలను చూచి గ్రహించమని మనలను ఆహ్వానిస్తుంది. సంతోషకరమైన వార్తగా అనిపించని విషయాన్ని మరి ముఖ్యంగా రెండంచులు కలిగిన ఖడ్గంలాంటి వాక్యాన్ని నిష్పక్షపాతంగా బోధిస్తే ఈ రోజున ఎవరు వినాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు మన ఉనికికి కారణాన్ని, ప్రేమించే శక్తిని, సున్నితంగా ఆనందంగా, ఋజువర్తనంగా జీవించడానికి ఒక జీవనశైలిని మనకు అందించడానికి వచ్చాడు. నేడు విశ్వాసులు కేవలం సైద్ధాంతిక మతాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ఇష్ట పడుతున్నారే కాని, దేవుని ప్రేమకు వున్న నిజ అందాన్ని ఆరాధించలేకపోతు న్నారు. అందుచేతనే సత్య సభకు చాలా మంది దూరంగా ఉంటున్నారు.


వివాహ విందులో, యూదులు తమ శుద్ధీకరణకు ఉపయోగించే నీటిని కూజాలనుండి 'బయటకు తీసిన'ప్పుడు మాత్రమె ఆ నీటిని ద్రాక్షారసంగా రుచి చూడగలిగారు. నీటిలో నిగూఢమైయున్న జీవాత్మక రుచిని చూరగొనలేక పోయారు. మానవ శరీరధారి యేసులో నిక్షిప్తమైయున్న త్రిత్వ దైవత్వాన్ని మరి ఇంకేమి గ్రహించగలరు? శిలాఫలకాలపై రాసుకున్న ధర్మశాస్త్రం కొందరికి అరిగి కరిగి పోయినట్లుంది! మానవ అవసరాలను శుద్ధి చేసి సంతృప్తి పరచగల జీవజలమేదీ ఇక లేదని వారు భావిస్తున్నారు. “అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును”(2 కొరి 3:6). అందుచేతనే అక్షర రూపంలో ఉన్నధర్మ శాస్త్రం ఆత్మతో భర్తీ చేయబడింది. యేసు వ్యక్త పరచే ప్రేమ జీవితం ద్వారా “మతం” విముక్తి పొందాలి. మనలోనూ మరియు మన సోదరుల్లో పరివర్తన చెందుతున్న యేసు ప్రేమను తెలుసుకోవడానికి, కేవలం బోధనాత్మక మాటలు సరిపోవు. సంజ్ఞనాత్మక సేవలు మరియు చెడును ఖండించగలిగే ధార్మికత కూడా అవసరం.


యేసు సుందర ఆనందకరమైన శైలిని మన స్వంతం చేసుకోవాలి. కానా వివాహం అనే  పరలోక విందు వేడుకలో సమస్త జనావళిని స్వాగతించే ఆనందం మాదిరిగానే మన తిరుసభ కలిగియున్న వైఖరి ఎడల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మనం కూడా యేసు మానవత్వానికి దగ్గరవుతూ, ఆయనలోని మానవ స్వభావాన్ని మరింత లోతుగా తెలుసుకొని పొరుగు వారిని ప్రేమించేందుకు ప్రయత్నిస్తూ, ఆయన మాట వింటూ, విశ్వాసంలో వృద్ధి చెందుతూ, తండ్రి ముఖాన్నికుమార యేసులో చూసే వరకు పరిశుద్దాత్మన మనం ప్రయాసపడదాం. లోక కళ్యాణ విందులోని త్రిత్వై౦లో ప్రమోదం చెందుదాం.   

 

“మీ చెవులు ధన్యమైనవి, ఎందుకంటే అవి వింటున్నాయి” (Divine Office)