AletheiAnveshana

Tuesday, 31 December 2024

దేవుని తల్లి : సంఖ్యా 6:22-27; గలతీ 4:4-7; లూకా 2:16-21

 

దేవుని తల్లి

సంఖ్యా 6:22-27; గలతీ 4:4-7; లూకా 2:16-21

"నిన్ను సృష్టించిన దేవునకు నువ్వు జన్మనిచ్చావు. నువ్వు ఎప్పటికీ కన్యగానే  ఉన్నవు" (Divine Office)

 

పవిత్ర కన్య మరియ దేవుని తల్లి కాదు అని ప్రతి పాదించి బోధించిన నేస్తోరియను అను వేదాందితికి సరైన జవాబు ఇచ్చినదే ఎఫేసుసు మహాసభ. ఎఫేసుసు అను ప్రాంతం పూర్వ గ్రీసు ఆసియా మైనరు మరియు రోము సామ్రాజ్యపు భాగంగా వుండేది. ప్రస్తుతం టర్కీ దేశ భాగం. నేస్తోరియను సిద్దాంతమును తర్కించడానికి నాటి రోము చక్రవర్తి  రెండవ తెయోదోశియుసు ఆనాటి పోపు సేలేస్తియను (1) అనుమతితో  క్రీస్తు శకం 451 వ సంవత్సరం, జూను నేలలో ఎఫెసుసు నందు ఒక మహా సభను 197 పీఠాధి పతులతో ఏర్పాటు చేశాడు. అసమ్మతి సిద్ధాంతమును బోధించిన నేస్తోరియను మాత్రం హాజరు కాలేదని చరిత్ర చెపుతుంది. హాజరయిన పీఠాధిపతులందరు ఏకగ్రీవమున ఈ మహాసభనందు యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన మరియను దేవుని తల్లి లేదా దేవమాత అని సగౌరముగా అంగీకరిస్తూ విశ్వాస నిర్దారణ చేశారు. దీనినే ఎఫేసుసు మహాసభ అని మన తిరుసభ పిలుస్తుంది. ఈ సభ  దేవుని తల్లి అన్న మాటను గ్రీకు భాషన థేయోటోకోస్ అని గంభీరంగా ప్రకటించబడింది. ఈ విశ్వాస ప్రకటన  మన కథోలిక సంప్రదాయంలో చిన్న భాగం.


ఈ గొప్ప థేయోటోకోస్ బిరుదుతో మరియ తల్లి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులచే గౌరవించబడుతోంది. ఆమె మాతృ సంరక్షణలో కొత్త సంవత్సర ప్రారంభమున మన ఆశలు  ప్రణాళికలను నెలకొల్పుకోవడానికి నేటి సాంఘిక పూజాబలి మనల్ని ఆహ్వానిస్తుంది. మన ఆందోళనలు మరియు మన యుగానికి సంబంధించిన సంఘర్షణలు, వెలుగు చూస్తున్న అన్యాయాలు మన ప్రపంచంలో శాంతిని మనము ఆమెకు అప్పగించవచ్చు.


తల్లి మరియ ప్రభువు దాసి. దేవుని కనికరంపై నమ్మకం ఉంచి, దేవుని మంచితనం ద్వారా నిలబడింది. వాస్తవానికి, ఆమె ప్రభువు ధన్యతను పొందుకున్నది. పాత నిబంధన హిబ్రూ భాషా పదం “అనావిమ్‌” అంటే యోహావాపై ఆధారపడు “దారిద్ర్యంలోని వారు” లేదా “కడు పేదవారు” అని అర్ధం. మరియ తల్లి దేవుని చేతిలోనే ప్రతిదీ ఉందని నమ్మకంగా విశ్వసించే వినయపూర్వకమైన దీనులందరిలో కల్లా ప్రత్యేకంగా నిలుస్తుంది (లూమెన్ జెంత్సియుం 55). పునీత అగస్టీను , "ఆమె తన కడుపులో యేసును గర్భం ధరించకముందే తన హృదయంలో గర్భం ధరించింది" అని అంటాడు, యోహాను సువార్త ఆమెను క్రీస్తు బహిరంగ జీవితం ప్రారంభంలో మరియు ముగింపులోను మాత్రమె చూపెడుతుంది. సువార్తికుడు యోహాను మాత్రమే కల్వరి వద్ద మరియ తల్లి ఉనికిని "యేసు శిలువ దగ్గర" (యోహా 19:25) వున్నట్లు గ్రంథస్తం చేసాడు.


యేసు చేసిన అద్భుతాలన్నీ చాలా మందికి భ్రమగా అనిపించినప్పటికీ, అతని తల్లి దేవుని శక్తిని విశ్వసిస్తూ అతని చివరి శ్వాస వరకు అతని చెంతనే మౌనంగా నిలబడింది. ఆమె విశ్వాసానికి ఆశ్చర్యపరిచే అద్భుతాలు మనకు అవసరం లేదు కానీ మన తండ్రి అయిన దేవుని మర్మమైన మార్గాలపై చిన్నపిల్లలకు కలిగిన నమ్మకంవలే ఆధారపడింది. యేసు యోహానుతో, “ఇదిగో నీ తల్లి” అంటూ తన  తల్లిని తనను అనుసరించే శిష్యులందరికీ మార్గదర్శక మూర్తిగా అనుగ్రహించాడు. ఆమె బలమైన మరియు సరళమైన విశ్వాసాన్ని మనతో పంచుకుంటుంది. మరియ తల్లి యేసు పుట్టిన సంఘటనలను అద్భుతంగా తన మదిన నిలుపుకున్నది. ఆమె తన హృదయంలో వాటిపై ధ్యానించింది. సర్వశక్తిమంతుడు తన కోసం మరియు ప్రజలందరికీ ఏమి చేసాడో ధ్యానించి౦ది. వినయపూర్వకమైన సాధారణ గొర్రెల కాపరులకు దూత, “ఈ రోజు దావీదు పట్టణంలో, మీకు రక్షకుడు జన్మించాడు. అతడు క్రీస్తు ప్రభువు” అన్న శుభవార్తను ఆమె తన హృదయంలో భద్రంగా పదిలపరచుకున్నది.


అదే సువార్త ఈరోజు మనకు ఇవ్వబడింది. మరయ తల్లి చేసినట్లుగా, దానిని నిధిగా పదిల పరచు కోవాడానికి, ధ్యానించడానికి మరియు దానికి ప్రతిస్పందించడానికి మనకు ఆహ్వానం అందించబడింది. ఈ రోజు, నూతన సంవత్సర ప్రారంభమున మనలో చాలా మంది మంచి తీర్మానాలు చేసుకోవడానికి ఇష్టపడే రోజు. దేవుని కృపకొరకు ప్రార్ధంచే ముందు మరియ వైఖరిని అవలంబించ కోరిక కంటే ఈ రోజు  నూతన సంవత్సర తీర్మానంలో మనం ఏమి కోరుకోగలం? ఈనాటి మన ఆరాధన మరియ తల్లి విస్మయ ఆశ్చర్య భావనలో పాలుపంచుకోవడానికి మనల్ని ఆహ్వానిస్తుంది. ఆమె కుమారుడు నిత్యుడైన క్రీస్తులో దేవుని దయగల ప్రేమ ముందు మనము కొత్త సంవత్సరం వైపు కనులెత్తి చూస్తున్నప్పుడు, కన్య మరియ ద్వారా సువార్తను నిధిగా పొందడానికి మనకు సహాయం చేయమని మరియ తల్లిని అడుగుదాము. తద్వారా క్రీస్తు తన తల్లి ద్వారా మన వద్దకు వచ్చినట్లుగా మన మధ్యస్థ ప్రార్ధన ద్వారా ఆతను ఇతరుల దరికి వస్తాడు. అన్ని రకాల సంతోష ధుఃఖాల మధ్య కొత్త సంవత్సరం 2025లో ఆశ్చర్య ఉత్కంఠలతో మరియు విశ్వాసంతో ప్రవేప్రవేశించుదాము.

 

వాక్కు మరియ నుండి శరీరాన్ని తీసుకున్నప్పటికీ, త్రీత్వైకం పెరుగుదలలో గాని తగ్గుదలలో గాని మార్పు లేకుండా త్రిత్వంగానే ఉంటుంది. ఇది ఎప్పటికీ పరిపూర్ణమైనది” (Divine Office)

 

Saturday, 28 December 2024

పవిత్ర కుటుంబం 1 సమూ 1:20-22, 24-281; యోహాను 3:1-2, 21-24; లూకా 2:41-52 (పవిత్ర కుటుంబం సి)

 

పవిత్ర కుటుంబం

1 సమూ 1:20-22, 24-281; యోహాను 3:1-2, 21-24; లూకా 2:41-52 (పవిత్ర కుటుంబం సి)

యేసు వారితో పాటు నజరేతుకు వెళ్లి వారి విధేయాతన జీవించాడు

 

రక్షకుని జననోత్సవం తరువాత ఆదివారం రోజున మనము పవిత్ర కుటుంబాన్నికొనియాడుతున్నాము. యేసు మరియ యోసేపుల కుటుంబం పవిత్ర కుటుంబం. మనము వారిని పవిత్ర కుటుంబం అని పిలిచినప్పటికీ, వారికి ఎప్పుడూ సమస్యలు లేవని తలంచ కూడదు. ఒక సాధారణ కుటుంబం సమస్యలను ఎదుర్కన్నట్లే ఈ పవిత్ర కుటుంబం కూడా చాలా సమస్యలను చవిచూసింది. యేసును అనుసరించే ప్రతి అనుచరునకు మోయడానికి ఒక శిలువను కలిగి ఉన్నట్లే, ప్రతీ కుటుంబం వారి జీవితంలో సిలువను అనుభవించవలసి వున్నది. ప్రతీ కుటుంబం సానుకూల ప్రతికూల విచిత్ర లక్షణాలు కలిగిన వ్యక్తులతో రూపొందించబడింది.


ఒక్కొక్క వ్యక్తిత్వపు ప్రతికూలతలు ఒక్కొక్కసారి వారి కుటుంబాన్ని చ్చిన్నా భిన్నం చేస్తున్నప్పటికీ అవి  దేవుని వైపు నడిపించే అవకాశాలుగా మారతాయి. అందుచేతనే భక్త పౌలుడు కొలస్సీయులను ఉద్దేశించి, " కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి (కొలస్సి 3:12-14). శారీరకంగా బలహీనమైనా, మానసికంగా బలహీనమైనా, నైతికంగా బలహీనమైనా, కుటుంబంలోని అత్యంత బలహీన సభ్యుడి పట్ల మనకున్న కనికరం, దేవునితో ఐక్యంగా ఎదగడానికి మన సాధనంగా మారుతుంది. మనం ఒకరి చమత్కారాలను అర్ధం చేసుకొని అంగికరింప  చేసే ప్రయత్నాలే పుణ్యం.


సిరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంధం ఇలామనకు గుర్తుచేస్తుంది, బిడ్డల కన్న తండ్రిని ప్రభువు గౌరవించెను. తల్లికి బిడ్డల మీద హక్కును ప్రభువు కల్పించెను” (సిరా. పు. యేసు. 3:2). కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉత్తమ తల్లిదండ్రులు కానందుకు తమను తాము తగ్గించుకుంటారు. సాధ్యమైనంతవరకు  ఉత్తమమైన  తల్లి దండ్రులుగా ఉండటం అనేది మీరు ప్రయత్నించే ఆదర్శం. కానీ దానిని మీరు చేరుకోలేనంత వాస్తవం అయితే మాత్రం కాదు. సాధ్యమైనంతవరకు నేను ఉత్తమమైన గురువుగా జివించడం అనేది నేను ప్రయత్నించే ఒక ఆదర్శం. కానీ దాని పరిపూర్ణతకు నేను ఎప్పటికీ చేరుకోలేనంత  వాస్తవం అయితే మాత్రం కాదు. సంసారికమైనా లేదా విరక్తతత్వ జీవితమైన సరే మనమందరం ఆ పరిపూర్ణజీవితం  చేరుకొనేందుకు దేవునిపై నమ్మకం ఉంచాలి.


శోధనాత్మక పరీక్షల్లో లేదా శిలువ శ్రమ లన్నింటిలో నజరేతు పవిత్ర కుటుంబాన్ని ఏది నిలబెట్టింది? కష్టకాలంలో కుటుంబాన్ని నిలబెట్టేది ప్రేమ, విశ్వాసం మరియు అంగీకారం. కుటుంబాలు సంతోషంగా వుండాలంటే వారి మధ్య ప్రేమ మరియు గౌరవం అత్యంత విలువైనవి. ఈరోజు మన కుటుంబాల్లో ఆ లక్షణాలు వెల్లివిరియాలని ప్రార్థిస్తున్నాం. ఈ రోజుల్లో కుటుంబ జీవితానికి పెద్ద ముప్పు ఏమిటంటే, మనం కలిసి తగినంత సమయం గడపలేకపోవడం. మనము కలసి పని చేయలేకపోవడం. మన భోజన సమయంలో మన సంఘీభావానికి మనలను దూరం చేసేది మన ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు లేదా టీవీ మాధ్యమాలు. వీటిని చూడటంలోమనము చాలా శ్రద్ధగా ఉన్నాము.  ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి మనకు సమయం లేదు.


నేడు, మనమందరం క్రీస్తు జ్ఞానాన్ని మన కుటుంబాలకు తీసుకురావడానికి వెతకాలి. తిరుసభ పితృపాదులలో ఒకరైన ఓరిజిను, నేటి సువార్తను గురించి వ్యాఖ్యానిస్తూ, ఎవరైతే క్రీస్తు కోసం వెతుకుతున్నారో, ఆయనను కనుగొనడంలో విజయం సాధించలేని వారిలాగా అజాగ్రత్తగా ఆయనను వెతకకూడదు” అని అన్నారు. మరియ యోసేపులు చేసినట్లుగా మనం కూడా గొప్ప శ్రద్ధతోనూ మరియు ఆవేదనతో ఆయన కోసం మనలో మనం వెతకాలి. అలాగునే మన కుటుంబంలోనూ వెతకాలి.


యేసు వయస్కుడవుతున్నప్పుడు, అతను దేవుని జ్ఞానంలోనూ మరియు మనుష్యుల అబిమనంలో అభివృద్ధి చెందాడు”

 

 

Holy Family : 1 Sam 1:20-22, 24-281; Jn 3:1-2, 21-24; Lk 2:41-52 (Holy Family C)

 

Holy Family


1 Sam 1:20-22, 24-281; Jn 3:1-2, 21-24; Lk 2:41-52 (Holy Family C)


Jesus went down with them to Nazareth and lived under their authority.


On the Sunday after the Solemnity of the Nativity of the Lord, Christmas, we consider the family. Even though we call them the Holy Family that does not mean they never had problems. Just as each follower of Jesus has a cross to carry, the holy family also had to experience the cross in their shared life. Every family is made of unique individuals with positive qualities and negative quirks.


Sometimes, the negatives become opportunities for grace, leading the rest of the family to God.  This is what St. Paul is referring to when he tells the Colossians to “put on, as God's chosen ones, holy and beloved, heartfelt compassion, kindness, humility, gentleness, and patience, bearing with one another and forgiving one another, if one has a grievance against another; as the Lord has forgiven you, so must you also do. And over all these put on love, that is, the bond of perfection” (Col 3:12-14). The compassion that we have for the weakest member of the family, whether that be physically weak, psychologically weak, or morally weak, becomes our means to grow in union with God. The efforts that we make to accept each other's quirks are themselves acts of virtue.


The book Jesus, Son of Sirach, reminds us, “For the Lord sets a father in honor over his children and confirms a mother’s authority over her sons” (Sir 3:2). Sometimes parents get down on themselves for not being the best parents possible. Being the best parent possible is an ideal you strive for, not a reality you will reach. Being the best priest possible is an ideal I strive for; it is not a reality I will ever reach out to. We all need to trust in God.


What sustained the family of Nazareth through all of these trials and crosses? What holds families together in times of difficulty is love and trust. Whenever families are happy, love and respect are highly prized among them. We pray for an outpouring of those qualities in our families today. A major threat to family life nowadays is our lack of time together. We are so busy working, socializing, using our electronic gadgets, or watching TV that we have no time to talk to each other.


Today, we must all look for Christ's wisdom to bring it to our families. Origin, an early Church Father, commenting on today's Gospel, said that whoever is looking for Christ, must not carelessly seek him, as those who fail in finding him. We must look for Him with “anxiety”, and with great solicitude, as Joseph and Mary did.


“As Jesus grew up, he advanced in wisdom and favour with God and men”

Tuesday, 24 December 2024

“Glory to God in the highest, and on earth peace among men with whom he is well pleased”. Saint Leo the Great, Pope

 

“Glory to God in the highest, and on earth peace among men with whom he is well pleased”.

 

Saint Leo the Great, Pope


Dearly beloved, today our Savior is born. Let us rejoice. Sadness should have no place on the birthday of life. The fear of death has been swallowed up. Life brings us joy with the promise of eternal happiness. No one is shut out from this joy. All share the same reason for rejoicing. Our Lord, victor over sin and death, finding no man free from sin, came to free us all. Let the saint rejoice as he sees the palm of victory at hand. Let the sinner be glad as he receives the offer of forgiveness. Let the pagan take courage as he is summoned to life.

 

In the fullness of time, chosen in the unfathomable depths of God’s wisdom, the Son of God took for himself our common humanity in order to reconcile it with its creator. He came to overthrow the devil, the origin of death, in that very nature by which he had overthrown mankind. And so at the birth of our Lord the angels sing in joy: Glory to God in the highest, and they proclaim peace to men of goodwill as they see the heavenly Jerusalem being built from all the nations of the world. When the angels on high are so exultant at this marvelous work of God’s gooess, what joy should it not bring to the lowly hearts of men?

 

  Beloved, let us give thanks to God the Father, through his Son, in the Holy Spirit, because in his great love for us he took pity on us, and when we were dead in our sins he brought us to life with Christ, so that in him we might be a new creation. Let us throw off our old nature and all its ways and, as we have come to birth in Christ, let us renounce the works of the flesh. Christian, remember your dignity, and now that you share in God’s own nature, do not return by sin to your former base condition. Bear in mind who is your head and whose body you are a member. Do not forget that you have been rescued from the power of darkness and brought into the light of God’s kingdom.

 

Through the sacrament of baptism, you have become a temple of the Holy Spirit. Do not drive away so great a guest by evil conduct and become again a slave to the devil, for your liberty was bought by the blood of Christ.

 

“Today the king of heaven has deigned to be born of a virgin for us, to recall fallen man to his heavenly kingdom”.

"అత్యున్నతమైన దేవునికి మహిమ, భూమిమీద ఆయన సంతోషించు మనుష్యులందరి మధ్య శాంతి": సెయింట్ లియో ది గ్రేట్, పోపు

 

 

"అత్యున్నతమైన దేవునికి మహిమ, భూమిమీద ఆయన సంతోషించు మనుష్యులందరి మధ్య శాంతి".

సెయింట్ లియో ది గ్రేట్, పోపు


ప్రియమైన ప్రియులారా, నేడు మన రక్షకుడు జన్మించాడు. మనం ఆనందిద్దాం. జీవితంలో పుట్టిన రోజున దుఃఖానికి స్థానం ఉండకూడదు. చావు భయం మింగి వెయబడింది. శాశ్వతమైన ఆనంద వాగ్దానంతో జీవితం మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆనందానికి ఎవరూ దూరంగా ఉండరు. అందరూ ఆనందించడానికి ఒకే కారణాన్ని పంచుకుంటారు. మన ప్రభువు పాపం మరియు మరణంపై విజేత. పాపం నుండి ఏ వ్యక్తి విముక్తి కనుగొనలేని, మనందరినీ విడిపించడానికి వచ్చాడు. అరచేతిలో విజయాన్ని చూసి సాధువులు ఆనందించండి. పాప క్షమాపణను స్వీకరించినందుకు పాపి సంతోషంగా ఉండు. అన్యమతస్థుడు ప్రాణం పోసుకున్నందున ధైర్యం తెచ్చుకో!


కాల సంపూర్ణతలో, దేవుని జ్ఞాన అపరిమితమైన లోతులలో ఎన్నుకోబడిన దేవుని కుమారుడు మనలను సృష్టికర్తతో పునరుద్దరించటానికి మన సాధారణ మానవత్వాన్ని ఆయన మన కోసం తీసుకున్నాడు.  మానవజాతిని ధ్వంసంచేసి  మరణానికి మూలమైన సైతానును పడగొట్టడానికి అతను మన  స్వభావంలోనే వచ్చాడు. కాబట్టి మన ప్రభువు పుట్టినప్పుడు దేవదూతలు ఆనందంతో ఇలా సన్నుతించారు: అత్యున్నతమైన దేవునికి మహిమ. మరియు ప్రపంచంలోని అన్ని దేశాల నుండి స్వర్గపు జెరూసలేం నిర్మించబడడాన్ని వారు చూసినప్పుడు  సద్భావన కలిగిన వ్యక్తులకు వారు శాంతిని ప్రకటించారు. దేవుని మంచితనానికి సంబంధించిన ఈ అద్భుతమైన పనిని చూసి అత్యున్నత స్థానంలో ఉన్న ఆ దేవదూతలు ఎంతగానో సంతోషిస్తున్నప్పుడు, అణకువగా ఉన్న భూలోక మనుషుల హృదయాలకు ఇలాంటి ఆనందాన్ని కలిగించకూడదా?

 

ప్రియులారా, తండ్రియైన దేవునికి, ఆయన కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మలో కృతజ్ఞతలు తెలుపుదాము. ఎందుకంటే ఆయన మనపట్ల తనకున్న గొప్ప ప్రేమతో మనపై జాలిపడ్డాడు మరియు మనం మన పాపాలలో చనిపోయినప్పుడు ఆయన మనలను క్రీస్తుతో బ్రతికించాడు కారణం ఆయనలో మనము నూతన సృష్టిగా ఉండగలమని. మన పాత స్వభావాన్ని మరియు దాని మార్గాలన్నింటినీ విసర్జిద్దాం మరియు మనం క్రీస్తులో జన్మించినందున, శరీర క్రియలను త్యజిద్దాం. క్రైస్తవులారా! మీ గౌరవాన్ని గుర్తుంచుకోండి మరియు ఇప్పుడు మీరు దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నందున, పాపం ద్వారా మీ పూర్వ స్థితికి తిరిగి రాకండి. మీ తల ఎవరో మరియు మీరు ఎవరి శరీరపు  సభ్యులుగా ఉన్నారో గుర్తుంచుకోండి. మీరు చీకటి శక్తి నుండి రక్షించబడి దేవుని రాజ్యం యొక్క వెలుగులోకి తీసుకురాబడ్డారని మర్చిపోవద్దు.


బాప్తిస్మపు దివ్య సంస్కారము ద్వారా, మీరు పవిత్ర ఆత్మ యొక్క దేవాలయంగా మారారు. దుష్ట ప్రవర్తన ద్వారా అంత గొప్ప అతిథిని తరిమికొట్టవద్దు. మళ్ళీ దెయ్యానికి బానిస అవ్వకండి. ఎందుకంటే మీ స్వేచ్ఛ క్రీస్తు రక్తం ద్వారా కొనుగోలు చేయబడింది.

 

"పడిపోయిన వ్యక్తిని తన స్వర్గపు రాజ్యానికి తిరిగి తెచ్చుకోవడానికి ఈ రోజు స్వర్గపు రాజు మన కోసం కన్యక నుండి జన్మించడానికి రూపొందించుకున్నాడు”

Saturday, 21 December 2024

" స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు: " మీక 5:1-4; హెబ్రీ 10:5-10; లూకా 1:39-45 (ఆగమనం C 4)

 

" స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు"

మీక 5:1-4; హెబ్రీ 10:5-10; లూకా 1:39-45 (ఆగమనం C 4)

“అప్పుడు మరియ యిట్లనెను నా ఆత్మ ప్రభువును ఘనపరచుచున్నది”

 

క్రీస్తు జననమునకు ముందు ఈ చివరి ఆదివారం నాడు, మన సువార్త పఠనం క్రీస్తు జననానికి సాక్ష్యమివ్వడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. గాబ్రియేలు దూత సువార్తను ప్రకటించినప్పుడు, మరియ ఆ ప్రవచనాన్ని నమ్మింది. సందేశం  ఎడల గట్టి నమ్మకాన్ని కలిగి ఉంది. అయితే యేసు పుట్టుక గురించిన ప్రకటన తర్వాత మరియ చేసిన క్రియలను సువార్త పఠనం మనకు గుర్తుచేస్తుంది. మరియ తన బంధువైన ఎలిజబెత్తును సందర్శించింది. ఆమె కూడా గర్భవతిగా ఉంది. ఆమెను దర్శించడానికి కొండ ప్రాంతంలోకి వెళ్ళింది. మరియ రాక మరియు ఆమె కుమారుని ఉనికి చాలా ప్రభావాలను చూపుతున్నాయి. మరియ పలుకులను విన్నవెంటనే ఎలిజబెత్తు గర్బంలో వున్న శిశువు ఆనందంతో గంతులు వేయడం (లూకా 1:41) అదే సమయంలో ఆమె పరిశుద్ధాత్మతో నిండిపోయింది అని వాక్యం చెపుతుంది.

 

సువార్తికుడు లూకా ఈ సంఘటనను వ్రాస్తున్నప్పుడు తన పదాల ఎంపికలో తాను తీసుకున్న జాగ్రత్తను గమనించండి! మొదట ఎలిజబెత్తు మరియ స్వరాన్నివిన్నది. కానీ మరియ మాటలు  “వినగానే” ఎలిజబెత్తు తన గర్భంలోని కుమారుడు యోహాను దేవుని కృపా ప్రభావాలను అనుభవించాడు. ఆమె సహజంగా వినినట్లు విన్నది కాని అతను మాత్రం అద్వితీయంగా గంతులు వేసాడు. ఆమె మరియ రాకను గ్రహించింది. కానీ యోహాను మాత్రం దేవుని రాకడను గ్రహించాడు. స్త్రీలు దేవుని కృపను గురించి మాట్లాడుకుంటే వారి గర్భాల్లోని తమ పిల్లలపై ఆత్మ పనిచేసింది. ఇది తల్లులకు అర్థంకాని ఒక అద్వితీయ క్రియ. ఎలిజబెత్తు గర్భం దాల్చిన తర్వాత దేవుని ఆత్మను పొందుకుంటే   మరియ మాత్రం దేవదూత ప్రకటనతోనే గర్భం దాల్చింది. అందుచేతనే, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు” (లూకా 1:42) అని ఎలిజబెత్తు పలికినట్లుగా లూకా వ్రాస్తున్నాడు.

 

విని నమ్మిన మీరందరు ధన్యులు! వాక్యాన్ని విశ్వసించే ప్రతి ఆత్మ కృపను గర్భం దాల్చిన ఆత్మయే! అటువంటి ఆత్మ దేవుని వాక్యానికి జన్మనిస్తుంది. అలాంటి ఆత్మ దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తుంది. శరీరానుసారంగా, ఒక స్త్రీ మాత్రమే క్రీస్తుకు తల్లి కావచ్చు, కానీ విశ్వాస ప్రపంచంలో, క్రీస్తు మనందరికీ ఒక సజీవ ఫలం. ప్రతి ఆత్మ పవిత్రంగా నిరాడంబరతతో తనను తాను కాపాడుకుంటే దేవుని వాక్యాన్ని స్వీకరించగలదు. ఈ స్థితికి చేరుకోగలిగిన ప్రతి ఆత్మ భగవంతుని గొప్పతనానికి సాక్ష్య మిస్తుంది. ఫలిస్తుంది.

 

మానవ మాటల వల్ల ప్రభువు గొప్పతనం ఏమాత్రం అధికమవ్వదు. ఆత్మ చేసే ప్రతీ మతపరమైన క్రియ మాత్రమే భగవంతుని ప్రతిరూపాన్ని పెంచగలదు. క్రీస్తు దేవుని స్వరూపం. మానవ ఆత్మ దేవుని పోలికలో రూపుదిద్దుకుంది (ఆది 1:27). కాబట్టి, ఆ దేవుని గొప్పతనంలో ఆత్మకు కొంత భాగం ఉంది. ఈ ఆగమన కాలంలో దేవుని రక్షణ ప్రణాళికలో మరియ మాత పాత్రను మనం పరిగణించడం సముచితం. మరియమాత దేవుని వాక్యాన్ని విశ్వసించిన మొదటి శిష్యురాలు అని ఎలిజబెత్తు వర్ణించింది. మరియమాత విశ్వాసం తన ప్రజల చరిత్రలో మరియు తన స్వంత జీవితంలో దేవుని పనిని గుర్తించేలా చేసింది. దేవునిపట్ల ఆమె కలిగివున్న పావిత్రత ప్రతి ఒక్కరికీ దైవ మోక్షం వచ్చేలా పని  చేసింది (లూకా 1:38). దీని కారణంగా, మరియ మాత తిరుసభ ప్రతీకగానూ  మరియు చిహ్నంగానూ వున్నది. మనము కుడా మరియ మాత ఆదర్శమున నడుద్దాం. మానవాళి రక్షణ కొరకు దేవుని ప్రణాళికలో బహిరంగముగా సహకరించుదాము.

 

యథార్థవంతులు దేవుని దయను చూసి సంతోషిస్తారు; వారు ప్రభువు ప్రేమను పొందుకుంటారు"