AletheiAnveshana

Saturday, 28 December 2024

Holy Family : 1 Sam 1:20-22, 24-281; Jn 3:1-2, 21-24; Lk 2:41-52 (Holy Family C)

 

Holy Family


1 Sam 1:20-22, 24-281; Jn 3:1-2, 21-24; Lk 2:41-52 (Holy Family C)


Jesus went down with them to Nazareth and lived under their authority.


On the Sunday after the Solemnity of the Nativity of the Lord, Christmas, we consider the family. Even though we call them the Holy Family that does not mean they never had problems. Just as each follower of Jesus has a cross to carry, the holy family also had to experience the cross in their shared life. Every family is made of unique individuals with positive qualities and negative quirks.


Sometimes, the negatives become opportunities for grace, leading the rest of the family to God.  This is what St. Paul is referring to when he tells the Colossians to “put on, as God's chosen ones, holy and beloved, heartfelt compassion, kindness, humility, gentleness, and patience, bearing with one another and forgiving one another, if one has a grievance against another; as the Lord has forgiven you, so must you also do. And over all these put on love, that is, the bond of perfection” (Col 3:12-14). The compassion that we have for the weakest member of the family, whether that be physically weak, psychologically weak, or morally weak, becomes our means to grow in union with God. The efforts that we make to accept each other's quirks are themselves acts of virtue.


The book Jesus, Son of Sirach, reminds us, “For the Lord sets a father in honor over his children and confirms a mother’s authority over her sons” (Sir 3:2). Sometimes parents get down on themselves for not being the best parents possible. Being the best parent possible is an ideal you strive for, not a reality you will reach. Being the best priest possible is an ideal I strive for; it is not a reality I will ever reach out to. We all need to trust in God.


What sustained the family of Nazareth through all of these trials and crosses? What holds families together in times of difficulty is love and trust. Whenever families are happy, love and respect are highly prized among them. We pray for an outpouring of those qualities in our families today. A major threat to family life nowadays is our lack of time together. We are so busy working, socializing, using our electronic gadgets, or watching TV that we have no time to talk to each other.


Today, we must all look for Christ's wisdom to bring it to our families. Origin, an early Church Father, commenting on today's Gospel, said that whoever is looking for Christ, must not carelessly seek him, as those who fail in finding him. We must look for Him with “anxiety”, and with great solicitude, as Joseph and Mary did.


“As Jesus grew up, he advanced in wisdom and favour with God and men”

Tuesday, 24 December 2024

“Glory to God in the highest, and on earth peace among men with whom he is well pleased”. Saint Leo the Great, Pope

 

“Glory to God in the highest, and on earth peace among men with whom he is well pleased”.

 

Saint Leo the Great, Pope


Dearly beloved, today our Savior is born. Let us rejoice. Sadness should have no place on the birthday of life. The fear of death has been swallowed up. Life brings us joy with the promise of eternal happiness. No one is shut out from this joy. All share the same reason for rejoicing. Our Lord, victor over sin and death, finding no man free from sin, came to free us all. Let the saint rejoice as he sees the palm of victory at hand. Let the sinner be glad as he receives the offer of forgiveness. Let the pagan take courage as he is summoned to life.

 

In the fullness of time, chosen in the unfathomable depths of God’s wisdom, the Son of God took for himself our common humanity in order to reconcile it with its creator. He came to overthrow the devil, the origin of death, in that very nature by which he had overthrown mankind. And so at the birth of our Lord the angels sing in joy: Glory to God in the highest, and they proclaim peace to men of goodwill as they see the heavenly Jerusalem being built from all the nations of the world. When the angels on high are so exultant at this marvelous work of God’s gooess, what joy should it not bring to the lowly hearts of men?

 

  Beloved, let us give thanks to God the Father, through his Son, in the Holy Spirit, because in his great love for us he took pity on us, and when we were dead in our sins he brought us to life with Christ, so that in him we might be a new creation. Let us throw off our old nature and all its ways and, as we have come to birth in Christ, let us renounce the works of the flesh. Christian, remember your dignity, and now that you share in God’s own nature, do not return by sin to your former base condition. Bear in mind who is your head and whose body you are a member. Do not forget that you have been rescued from the power of darkness and brought into the light of God’s kingdom.

 

Through the sacrament of baptism, you have become a temple of the Holy Spirit. Do not drive away so great a guest by evil conduct and become again a slave to the devil, for your liberty was bought by the blood of Christ.

 

“Today the king of heaven has deigned to be born of a virgin for us, to recall fallen man to his heavenly kingdom”.

"అత్యున్నతమైన దేవునికి మహిమ, భూమిమీద ఆయన సంతోషించు మనుష్యులందరి మధ్య శాంతి": సెయింట్ లియో ది గ్రేట్, పోపు

 

 

"అత్యున్నతమైన దేవునికి మహిమ, భూమిమీద ఆయన సంతోషించు మనుష్యులందరి మధ్య శాంతి".

సెయింట్ లియో ది గ్రేట్, పోపు


ప్రియమైన ప్రియులారా, నేడు మన రక్షకుడు జన్మించాడు. మనం ఆనందిద్దాం. జీవితంలో పుట్టిన రోజున దుఃఖానికి స్థానం ఉండకూడదు. చావు భయం మింగి వెయబడింది. శాశ్వతమైన ఆనంద వాగ్దానంతో జీవితం మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆనందానికి ఎవరూ దూరంగా ఉండరు. అందరూ ఆనందించడానికి ఒకే కారణాన్ని పంచుకుంటారు. మన ప్రభువు పాపం మరియు మరణంపై విజేత. పాపం నుండి ఏ వ్యక్తి విముక్తి కనుగొనలేని, మనందరినీ విడిపించడానికి వచ్చాడు. అరచేతిలో విజయాన్ని చూసి సాధువులు ఆనందించండి. పాప క్షమాపణను స్వీకరించినందుకు పాపి సంతోషంగా ఉండు. అన్యమతస్థుడు ప్రాణం పోసుకున్నందున ధైర్యం తెచ్చుకో!


కాల సంపూర్ణతలో, దేవుని జ్ఞాన అపరిమితమైన లోతులలో ఎన్నుకోబడిన దేవుని కుమారుడు మనలను సృష్టికర్తతో పునరుద్దరించటానికి మన సాధారణ మానవత్వాన్ని ఆయన మన కోసం తీసుకున్నాడు.  మానవజాతిని ధ్వంసంచేసి  మరణానికి మూలమైన సైతానును పడగొట్టడానికి అతను మన  స్వభావంలోనే వచ్చాడు. కాబట్టి మన ప్రభువు పుట్టినప్పుడు దేవదూతలు ఆనందంతో ఇలా సన్నుతించారు: అత్యున్నతమైన దేవునికి మహిమ. మరియు ప్రపంచంలోని అన్ని దేశాల నుండి స్వర్గపు జెరూసలేం నిర్మించబడడాన్ని వారు చూసినప్పుడు  సద్భావన కలిగిన వ్యక్తులకు వారు శాంతిని ప్రకటించారు. దేవుని మంచితనానికి సంబంధించిన ఈ అద్భుతమైన పనిని చూసి అత్యున్నత స్థానంలో ఉన్న ఆ దేవదూతలు ఎంతగానో సంతోషిస్తున్నప్పుడు, అణకువగా ఉన్న భూలోక మనుషుల హృదయాలకు ఇలాంటి ఆనందాన్ని కలిగించకూడదా?

 

ప్రియులారా, తండ్రియైన దేవునికి, ఆయన కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మలో కృతజ్ఞతలు తెలుపుదాము. ఎందుకంటే ఆయన మనపట్ల తనకున్న గొప్ప ప్రేమతో మనపై జాలిపడ్డాడు మరియు మనం మన పాపాలలో చనిపోయినప్పుడు ఆయన మనలను క్రీస్తుతో బ్రతికించాడు కారణం ఆయనలో మనము నూతన సృష్టిగా ఉండగలమని. మన పాత స్వభావాన్ని మరియు దాని మార్గాలన్నింటినీ విసర్జిద్దాం మరియు మనం క్రీస్తులో జన్మించినందున, శరీర క్రియలను త్యజిద్దాం. క్రైస్తవులారా! మీ గౌరవాన్ని గుర్తుంచుకోండి మరియు ఇప్పుడు మీరు దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నందున, పాపం ద్వారా మీ పూర్వ స్థితికి తిరిగి రాకండి. మీ తల ఎవరో మరియు మీరు ఎవరి శరీరపు  సభ్యులుగా ఉన్నారో గుర్తుంచుకోండి. మీరు చీకటి శక్తి నుండి రక్షించబడి దేవుని రాజ్యం యొక్క వెలుగులోకి తీసుకురాబడ్డారని మర్చిపోవద్దు.


బాప్తిస్మపు దివ్య సంస్కారము ద్వారా, మీరు పవిత్ర ఆత్మ యొక్క దేవాలయంగా మారారు. దుష్ట ప్రవర్తన ద్వారా అంత గొప్ప అతిథిని తరిమికొట్టవద్దు. మళ్ళీ దెయ్యానికి బానిస అవ్వకండి. ఎందుకంటే మీ స్వేచ్ఛ క్రీస్తు రక్తం ద్వారా కొనుగోలు చేయబడింది.

 

"పడిపోయిన వ్యక్తిని తన స్వర్గపు రాజ్యానికి తిరిగి తెచ్చుకోవడానికి ఈ రోజు స్వర్గపు రాజు మన కోసం కన్యక నుండి జన్మించడానికి రూపొందించుకున్నాడు”

Saturday, 21 December 2024

" స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు: " మీక 5:1-4; హెబ్రీ 10:5-10; లూకా 1:39-45 (ఆగమనం C 4)

 

" స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు"

మీక 5:1-4; హెబ్రీ 10:5-10; లూకా 1:39-45 (ఆగమనం C 4)

“అప్పుడు మరియ యిట్లనెను నా ఆత్మ ప్రభువును ఘనపరచుచున్నది”

 

క్రీస్తు జననమునకు ముందు ఈ చివరి ఆదివారం నాడు, మన సువార్త పఠనం క్రీస్తు జననానికి సాక్ష్యమివ్వడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. గాబ్రియేలు దూత సువార్తను ప్రకటించినప్పుడు, మరియ ఆ ప్రవచనాన్ని నమ్మింది. సందేశం  ఎడల గట్టి నమ్మకాన్ని కలిగి ఉంది. అయితే యేసు పుట్టుక గురించిన ప్రకటన తర్వాత మరియ చేసిన క్రియలను సువార్త పఠనం మనకు గుర్తుచేస్తుంది. మరియ తన బంధువైన ఎలిజబెత్తును సందర్శించింది. ఆమె కూడా గర్భవతిగా ఉంది. ఆమెను దర్శించడానికి కొండ ప్రాంతంలోకి వెళ్ళింది. మరియ రాక మరియు ఆమె కుమారుని ఉనికి చాలా ప్రభావాలను చూపుతున్నాయి. మరియ పలుకులను విన్నవెంటనే ఎలిజబెత్తు గర్బంలో వున్న శిశువు ఆనందంతో గంతులు వేయడం (లూకా 1:41) అదే సమయంలో ఆమె పరిశుద్ధాత్మతో నిండిపోయింది అని వాక్యం చెపుతుంది.

 

సువార్తికుడు లూకా ఈ సంఘటనను వ్రాస్తున్నప్పుడు తన పదాల ఎంపికలో తాను తీసుకున్న జాగ్రత్తను గమనించండి! మొదట ఎలిజబెత్తు మరియ స్వరాన్నివిన్నది. కానీ మరియ మాటలు  “వినగానే” ఎలిజబెత్తు తన గర్భంలోని కుమారుడు యోహాను దేవుని కృపా ప్రభావాలను అనుభవించాడు. ఆమె సహజంగా వినినట్లు విన్నది కాని అతను మాత్రం అద్వితీయంగా గంతులు వేసాడు. ఆమె మరియ రాకను గ్రహించింది. కానీ యోహాను మాత్రం దేవుని రాకడను గ్రహించాడు. స్త్రీలు దేవుని కృపను గురించి మాట్లాడుకుంటే వారి గర్భాల్లోని తమ పిల్లలపై ఆత్మ పనిచేసింది. ఇది తల్లులకు అర్థంకాని ఒక అద్వితీయ క్రియ. ఎలిజబెత్తు గర్భం దాల్చిన తర్వాత దేవుని ఆత్మను పొందుకుంటే   మరియ మాత్రం దేవదూత ప్రకటనతోనే గర్భం దాల్చింది. అందుచేతనే, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు” (లూకా 1:42) అని ఎలిజబెత్తు పలికినట్లుగా లూకా వ్రాస్తున్నాడు.

 

విని నమ్మిన మీరందరు ధన్యులు! వాక్యాన్ని విశ్వసించే ప్రతి ఆత్మ కృపను గర్భం దాల్చిన ఆత్మయే! అటువంటి ఆత్మ దేవుని వాక్యానికి జన్మనిస్తుంది. అలాంటి ఆత్మ దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తుంది. శరీరానుసారంగా, ఒక స్త్రీ మాత్రమే క్రీస్తుకు తల్లి కావచ్చు, కానీ విశ్వాస ప్రపంచంలో, క్రీస్తు మనందరికీ ఒక సజీవ ఫలం. ప్రతి ఆత్మ పవిత్రంగా నిరాడంబరతతో తనను తాను కాపాడుకుంటే దేవుని వాక్యాన్ని స్వీకరించగలదు. ఈ స్థితికి చేరుకోగలిగిన ప్రతి ఆత్మ భగవంతుని గొప్పతనానికి సాక్ష్య మిస్తుంది. ఫలిస్తుంది.

 

మానవ మాటల వల్ల ప్రభువు గొప్పతనం ఏమాత్రం అధికమవ్వదు. ఆత్మ చేసే ప్రతీ మతపరమైన క్రియ మాత్రమే భగవంతుని ప్రతిరూపాన్ని పెంచగలదు. క్రీస్తు దేవుని స్వరూపం. మానవ ఆత్మ దేవుని పోలికలో రూపుదిద్దుకుంది (ఆది 1:27). కాబట్టి, ఆ దేవుని గొప్పతనంలో ఆత్మకు కొంత భాగం ఉంది. ఈ ఆగమన కాలంలో దేవుని రక్షణ ప్రణాళికలో మరియ మాత పాత్రను మనం పరిగణించడం సముచితం. మరియమాత దేవుని వాక్యాన్ని విశ్వసించిన మొదటి శిష్యురాలు అని ఎలిజబెత్తు వర్ణించింది. మరియమాత విశ్వాసం తన ప్రజల చరిత్రలో మరియు తన స్వంత జీవితంలో దేవుని పనిని గుర్తించేలా చేసింది. దేవునిపట్ల ఆమె కలిగివున్న పావిత్రత ప్రతి ఒక్కరికీ దైవ మోక్షం వచ్చేలా పని  చేసింది (లూకా 1:38). దీని కారణంగా, మరియ మాత తిరుసభ ప్రతీకగానూ  మరియు చిహ్నంగానూ వున్నది. మనము కుడా మరియ మాత ఆదర్శమున నడుద్దాం. మానవాళి రక్షణ కొరకు దేవుని ప్రణాళికలో బహిరంగముగా సహకరించుదాము.

 

యథార్థవంతులు దేవుని దయను చూసి సంతోషిస్తారు; వారు ప్రభువు ప్రేమను పొందుకుంటారు"

 

 

“Of all women, you are the most blessed”: Mic 5:1-4; Heb 10:5-10; Lk 1:39-45 (Advent C 4)

 

“Of all women, you are the most blessed”


Mic 5:1-4; Heb 10:5-10; Lk 1:39-45 (Advent C 4)

“Mary said, My soul proclaims the greatness of the Lord”

 

On this last Sunday before Christmas, our Gospel reading prepares us to witness Christ’s birth.  When the angel Gabriel announced the good news, Mary believed the prophecy. She was certain of the message. The gospel reading also recalls Mary’s actions after the announcement of Jesus’s birth. Mary visited Elizabeth, her cousin, who was also with a child. She went up into the hill country. Mary’s arrival and the presence of her Son quickly show their effects. As soon as Elizabeth heard Mary’s greeting her child leapt in her womb (Lk 1:41) and she was filled with the Holy Spirit.

 

See the careful distinction in the choice of words! Elizabeth was the first to hear the voice, but her son John was the first to feel the effects of grace. She heard as one hears naturally but he leapt because of the mystery. She sensed the coming of Mary, but he sensed the coming of God. The women spoke of grace as the Spirit worked on their babies inside. The incomprehensible was working incomprehensibly within the mothers. Elizabeth had been filled with the Spirit after she conceived. But Mary was conceived at the announcement of the angel. Elizabeth said, “Blessed are you among women” (Lk 1:42).

 

You who hear and believe are blessed! Every soul that believes and conceives gives birth to the Word of God. Such a soul recognizes his works and proclaims the greatness of the Lord. According to the flesh, only one woman can be the mother of Christ but in the world of faith, Christ is the fruit of all of us. Every soul can receive the Word of God if it is pure and preserves itself in chastity and modesty. The soul that has been able to reach this state proclaims the greatness of the Lord.

 

Nothing cannot be added to the Lord’s greatness by human words. Only good or religious acts that a soul performs magnify the image of God. Christ is the image of God. The human soul is shaped in the likeness of God (Gen 1:27). So, the soul has some share in that greatness. It is appropriate in this season of Advent that we consider the role of Mary in God’s plan of salvation. Elizabeth describes Mary as the first disciple who believed in God’s word. Mary's faith enabled her to recognize the work of God in her people’s history and her own life. Her openness to God allowed God to work (Lk 1:38) through her so that salvation might come to everyone. Because of this, Mary is a model and symbol of the Church. May we be like Mary, open and cooperative in God's plan for salvation.

 

“The upright see and rejoice; they consider the love of the Lord”

Saturday, 14 December 2024

Gaudete Sunday: Zep 3:14-18a; Phi 4:4-7; Lk 3:10-18

 

Gaudete Sunday


Zep 3:14-18a; Phi 4:4-7; Lk 3:10-18 (Advent C 2)

Rejoice in the Lord always.  I say it again, rejoice.”

Why did thousands come out to hear John the Baptist preach? It had been hundreds of years since a prophet had spoken out and performed signs. John broke the long silence with the sudden announcement that the Messiah was about to appear as was promised through the patriarchs of the old covenant, the prophets, and rulers of Israel to save people from their sins, and oppression and fill them with the joy of his presence (Zep 3:17).

 

John’s task was to wake people from spiritual sleep and turn them back to hear God’s voice and obey his commandments. Luke mentions two groups in particular who came to John for spiritual renewal. They were tax collectors and Jewish soldiers belonging to the Roman peace-keeping forces. Both groups were regarded as spiritually unfit and unclean and were treated as outcasts. John welcomed them to be baptized in the River Jordan.

 

John’s message of renewal and repentance suggested three things: First, every follower of God must share one’s wealth with those who do not have anything in life. John recognized that one has a key duty to love one’s neighbor as oneself (Lev 19:18). Second, John pointed out the sacred duty to give respect and honor where it is due. He instructed soldiers and tax collectors not to misuse their authority or power to compel people to give. He did not tell them to leave their profession but to be good, honest, and respectful soldiers. And thirdly, he exhorted his listeners to be content with what they had and to avoid coveting what belonged to others. He called the people to walk in the way of love and righteousness.

 

John’s message of “good news” was that the Messiah would “baptize with the Holy Spirit and with fire”. Fire in biblical times was associated with God and with his actions in the world and the lives of his people. God sometimes manifested his presence by use of fire, such as the burning bush which was not consumed when God spoke to Moses (Ex 3:2). The image of fire was also used to symbolize God’s glory (Ezk 1:4, 13), his protective presence (2 Kgs 6:17), his holiness (Det. 4:24), his righteous judgment (Zech 13:9), and his wrath against sin (Is 66:15-16).

 

In the New Testament, the image of fire is also used of the Holy Spirit who comes to cleanse us from sin and make us holy (Mt 3:11 and Acts 2:3). God’s fire both purifies us of sin and inspires in us a reverent fear of God and his word. It increases our desire for holiness and the joy of meeting the Lord when he comes again. May the Spirit of Christ, the Holy Spirit burn all that is evil in us and instill his works in us to become joyful in receiving Jesus, our liberator.

“I am the voice of one crying in the wilderness: Prepare the way for the Lord”.

సంతోషకరమైన ఆదివారం : జేఫానియ 3:14-18a; ఫిలిప్పి 4:4-7; లూకా 3:10-18

 

సంతోషకరమైన ఆదివారం

జేఫానియ  3:14-18a; ఫిలిప్పి 4:4-7; లూకా 3:10-18 (ఆగమానం C 2)

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుదును ఆనందించుడి

 

బాప్తిస్మ యోహాను బోధ వినడానికి వేలాది మంది ఎందుకు వచ్చారు? క్రీస్తు జననమునకు ముందు  ప్రవక్త ప్రవచించి సూచకాలను ప్రదర్శించి వందల సంవత్సరాలు అయింది.  ప్రవక్తల ద్వారా చేయబడిన పాత ఒడంబడిక వాగ్దానం  ఇశ్రాయేలు  ప్రజలను వారి పాపాలు మరియు అణచివేత నుండి రక్షించి వారిని సంతోషంతో నింపడానికి మెస్సీయ రాబోతున్నాడన్న బాప్తిస్మ యోహాను తన ఆకస్మిక ప్రకటనతో సుదీర్ఘ నిశ్శబ్దాన్ని ఛేదించాడు (జెఫ 3:17).

 

ప్రజలను ఆధ్యాత్మిక నిద్ర నుండి మేల్కొలిపి దేవుని ఆజ్ఞలను పాటింపచేస్తూ దేవుని స్వరాన్ని ఆలకించేందుకు వారిని వెనక్కి మరల్చడమే బాప్తిస్మ యోహాను పరిచర్య. ఆధ్యాత్మిక పునరుద్ధరణ కోసం ఆతని వద్దకు వచ్చిన రెండు సమూహాలను లూకా సువార్తికుడు ప్రత్యేకంగా పేర్కొన్నాడు. వారు రోమను ప్రభుత్వ శాంతి పరిరక్షక దళాలకు చెందినవారు. ఒకరు పన్ను వసూలు చేసేవారు. రెండవ వారు యూదు సైనికులు. ఈ రెండు సమూహాలు ఆధ్యాత్మికంగా అనర్హులుగానూ అపవిత్రమైనవారుగా  పరిగణించబడి బహిష్కృతులుగా పరిగణించబడ్డారు. జోర్డాను నదిలో బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను వారిని స్వాగతించాడు.

 

బాప్తిస్మ యోహాను పునరుద్ధరణ, పశ్చాత్తాప సందేశం మూడు విషయాలను సూచించింది. మొదటిగా, దేవుని ప్రతి అనుచరుడు తన సంపదను జీవితంలో ఏమీ లేని వారితో పంచుకోవాలి. కారణం యోహాను తన పొరుగువారిని తనలాగే ప్రేమించడం ఒక ముఖ్య బాధ్యత అని గుర్తించాడు (లేవీ 19:18). రెండవదిగా, గౌరవ మర్యాదల పవిత్ర కర్తవ్యాన్ని సూచించాడు. ప్రజలనుండి బలవంతంగా సంపదను దోచుకొనే వారి అధికారాన్ని లేదా శక్తిని దుర్వినియోగం చేయవద్దని అతను సైనికులను మరియు పన్ను వసూలు చేసేవారిని ఆదేశించాడు. వారి వృత్తిని వదిలివేయకుండా నిజాయితీగా గౌరవప్రదమైన సైనికులుగా ఉండమని బోధించాడు. మూడవదిగా, కలిగి ఉన్నదానితో సంతృప్తి చెందాలని మరియు ఇతరులకు చెందినవాటిని కోరుకోకుండా ఉండమని తన శ్రోతలను ఉద్బోధించాడు. ప్రేమ, ధర్మమార్గంలో నడవాలని ప్రజలకు పిలుపునిచ్చాడు.

 

మెస్సీయ వచ్చినప్పుడు తాను "పరిశుద్ధాత్మతో మరియు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడని  బాప్తిస్మ యోహాను తన ముఖ్యమైన"శుభవార్త”ను అందించాడు. పరిశుద్ద గ్రంధ కాలంలో “అగ్ని” అన్నది  దేవునితోనూ, ప్రపంచంలోని అతని చర్యలతోనూ మరియు అతని ప్రజల జీవితాలతో ముడిపడి ఉండేది. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు దహించబడని మండుతున్న పొదవంటి అగ్నిని ఉపయోగించడం ద్వారా దేవుడు తన ఉనికిని వ్యక్తపరిచాడు (నిర్గమ 3:2). అలాగునే దేవుని మహిమ (యెహే 1:4, 13) అనీ, ఆయన రక్షిత ఉనికి (2 రాజు. 6:17) అనీ, ఆయన పవిత్రత (ద్వితీ. 4:24) అనీ, ఆయన నీతియుక్తమైన తీర్పు (జెక 13:9) నకు ప్రతీకగా కూడా అగ్ని ప్రతిమ ఉపయోగించబడింది. మరియు పాపానికి వ్యతిరేకంగా అతని కోప (యేష 66:15-16) నిదర్శనమునకు కూడా ఉపయోగించ బడింది.

 

పాపం నుండి మనలను శుభ్రపరచడానికి, పవిత్రపరచడానికి వున్న పవిత్రాత్మ అగ్ని సాదృశ్యం క్రొత్త నిబంధనలోకూడా ఉపయోగించబడింది (మత్త 3:11; అపో. కా. 2:3). దేవుని అగ్నిలా వున్న పవిత్రాత్మ మనలను పాపం నుండి శుద్ధి చేస్తూ  దేవుని పట్ల ఆతని వాక్కు పట్ల భక్తిపూర్వక భయాన్ని మనలో ప్రేరేపిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ పవిత్రత పట్ల మనకున్న ఆసక్తిని మరియు ప్రభువు మళ్లీ వచ్చినప్పుడు ఆయనను కలుసుకునే ఆనందాన్ని మనలో పెంచుతుంది. క్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనలోని చెడులన్నింటినీ కాల్చివేసి, మన విమోచకుడైన ఆతనిని స్వీకరించడంలో ఆనందంగా ఉంచడానికి అతని పనులను మనలో నింపుతుంది.

 

నేను అరణ్యంలో ఏడుస్తున్న వాని స్వరాన్ని: ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధం చేయండి”.