జయము! విశ్వ న్యాయాధి పతి
దానియలు 7:13-14; ప్రకటన 1:5-8; యోహాను 18:33b-37 (B)
“ఉదయించే సూర్యుడు సింహాసనంపై కూర్చుని అందరినీ
పరిపాలిస్తాడు. అతను ప్రజలకు శాంతిని బోధిస్తాడు” (Divine Office)
నేడు సత్య తిరుసభ యేసుక్రీస్తును విశ్వానికి రాజాధి రాజుగా ప్రకటిస్తుంది.
పరిశుద్ధ గ్రంధం “రాజు” అనే పదాన్ని మన
ప్రభువుకు ఆపాదించింది. కీర్తన ఇలా చెబుతోంది, “ప్రభువు
రాజు. అతను మహిమ కిరీట మును ధరించియున్నాడు” (కీర్త 93). అలాగునే "నేను రాజును" (యోహా 18:37) అన్న యేసు తన నిర్ధారణను భక్త యోహాను తన సువార్తలో గ్రంథస్తం చేసాడు.
అతను యెరూషలేములో ప్రవేశించినప్పుడు ప్రజలు, “ప్రభువు
నామంలో వచ్చు రాజు ధన్యుడు” (లూకా 19:38) అని గొప్ప
శబ్దాలతో ఆర్భాటిoచారు. కానీ అతను "నా రాజ్యం భూలోకమైనది కాదు” అని కూడా
నిర్ధారించాడు (యోహా 18:36).
ఆయన పాలన నియంతృత్వానికి చాలా దూరం. క్రూరమైన రోమను
న్యాయమూర్తి ముందు ఈ రాజు ఊదారంగు దుస్తులను ధరింప జేసియున్నవాడై, ముళ్ళ కిరీటంను పొందుకున్నవాడై, బలహీనమైన దీన స్థితిలోనే ఆధ్యాత్మిక అధికారాన్ని నిబద్ధత చేశాడు. ఇది భూలోక శక్తులకు ఎలాంటి సంబంధంలేని అధికారం. అతని అధికారం సత్య అధికారం. అందుకే
ఆయన, “సత్యానికి సాక్ష్యమివ్వడానికి నేను పుట్టాను మరియు
ప్రపంచంలోనే జీవించాను. సత్యం వైపు ఉన్నవారందరూ నా స్వరం వింటారు” (యోహా 18:37) అని అన్నాడు. క్రీస్తు సత్యంలో జీవించాడు మరియు అతను దాని
కోసమే మరణించాడు.
క్రీస్తు సత్య జీవ వాక్కు అనేది దాని కార్యాన్ని తన సంపూర్ణ
సామరస్యంతో మిళితం చేసుకుంటుంది. లోతైన
సత్య జీవనంలో జివించడానికి మన జీవనశైలిలో పూర్ణ మార్పును కోరుకుంటుంది. దాని ప్రతి
ఫలాల కొరకు మౌన ధ్యానం అవసరం. అందుకు మన వ్యక్తిగత ప్రార్థనలో మనలో మనం ఏకమయ్యే గడియలు చాలా అవసరం. క్రీస్తు
నుండి వచ్చే ఆత్మ ప్రేరణ లేకుండా సత్యం అనేది మన జీవితాలను గుర్తించదు!! ఇది
ప్రార్థన నుండి జీవితంలోకి ప్రవహించాలి మళ్లీ అదే సత్య జీవితం ప్రార్థనలోకి తిరిగి
రావాలి. అప్పుడే సత్యం పట్ల మనం పొందుకున్న కొత్త నిబద్ధత మన జీవితానికి కొత్త
దృష్టిని ఇవ్వగలుగుతుంది. క్రీస్తు సత్య రాజు మనలను అన్ని రకాల బంధాల నుండి విడిపించగలుగుతాడు.
మన రాజు మన ప్రభువు యేసు క్రీస్తు. అందరకి ప్రభువు. అతను మనలను సంపూర్ణతన పాలించేవాడు. పునీత ఆంబ్రోసు తన ప్రతులలో ఇలా ఫ్రాసాడు: ప్రభువు నేర్పిన
ప్రార్థనలో, “నీ రాజ్యం వచ్చునుగాక” అని ప్రతీ సమయం మనం చెప్పినప్పుడు, దాని అర్ధం - సమస్త ప్రజలు తమ పరమానందానికి
గల మూలాన్ని ఆతనిలోనే కనుగొనాలని మనము కోరుకుందాము. ఆకలితో ఉన్నవారికి, దాహంతో ఉన్నవారికి, వస్త్ర
హినులైన వారికి మరియు అణగారిన వారికి న్యాయం జరిగినప్పుడల్లా ఆ పరమానందం అనేది యేసు
రాజు రాజ్యంలో నెరవేరుతుందని ఆశించుదాం.
మన రాజైన క్రీస్తును గౌరవించటానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, ఆయన రాజ్యాన్ని మన మధ్య నిజం చేసేందుకు కృషి చేయడమే!!
అణగారిన మరియు వెనుకబడిన వారి ఉపశమనం కోసం మనం చేసే త్యాగ క్రియ ఏదైనప్పటికి, అది
క్రీస్తుకు సేవే అవుతుంది. ఎందుకంటే
తనను తాను అక్కరలో వున్న వారితో పోల్చుకుంటాడు కదా!!! క్రీస్తు రాజు శిష్యులు అన్నవారు
తమను తాము విలాస జివితానికి అంటిపెట్టుకొని వుండలేరు. అవసరంలో ఉన్న
పొరుగువారి ఏడుపులను గ్రహించకపోవడం అంటే క్రీస్తును వినలేని చెవిటి వారిగా వుండడమే.
ఆకలితో చనిపోతున్నవారి వేదనను గ్రహించకుండా వుండడమంటే ఆకలితో వున్న క్రీస్తు వైపు
మన కళ్ళను మూసేసుకోవడమే! యేసుక్రీస్తును
మన కాపరి-రాజుగా మనం అనుసరిస్తే, అతని కొరకు మనం ఏదో ఒక విధంగా సేవాత్మక
సైనికులుగా ఉండాలి.
"ఆయన లోకమును న్యాయముతోనూ, ప్రజలందరినీ న్యాయముతోనూ తీర్పు తీర్చును" (Divine Office)