AletheiAnveshana

Saturday, 26 October 2024

సేవ చేయడం అంటే క్రీస్తుతో పాటు పరిపాలించడం: యెషయ 53:10-11; హెబ్రీ 4:14-16; మార్కు 10:35-45 (B 29)

 

సేవ చేయడం అంటే క్రీస్తుతో పాటు పరిపాలించడం

యెషయ 53:10-11; హెబ్రీ 4:14-16; మార్కు 10:35-45 (B 29)

నేను మీ కోసం ఉద్దేశించిన ప్రణాళికలు నాకు తెలుసు - శాంతి కోసం ప్రణాళికలు, విపత్తు కాదు” (ఆర్చనకాల ప్రార్ధన)

 

కీర్తి కాంక్ష, అధికార దాహం, ఆత్మ సంక్షోబం లేదా గుర్తింపు కోసం కొందరిలో తక్కువుగాను, మరికొందరిలో అతి ఎక్కువుగాను కట్టలు తెంచుకొని ఉంటుంది. ఈ స్వార్ధ వ్యక్తిత్వం ఎదుటివారిని కించ పరచడమో లేక బలితీసుకోవడమో చేస్తుంది. సంఘంలో ఇది ఒక సాధారణమైన జాడ్యంగా మారిపోయింది. అధికార దాహం యేసు శిష్యుల్లో కొంతమందిని విడిచి పెట్టలేదు. జెబెదీ కుమారులైన యాకోబు మరియు యోహానులు, యేసుతో ఒప్పందం కుదుర్చుకోమని తమ తల్లిని కోరారు. ప్రతిష్టాత్మకమైన ఆశిష్యులు యేసు రాజ్యంలో అత్యున్నత స్థానాన్ని కోరుకున్నారు. కానీ యేసు మాత్రం అందుకు భిన్నంగా శక్తి, అధికారం ప్రఖ్యాత స్థానముల గురించిన ప్రపంచ అవగాహనను తిప్పికొట్టాడు. యజమాని, రాజు, డాలు, ప్రథమం అనేవాటి ప్రముఖ వరుస స్థానాలను సేవకుడు, కింకరుడు, కొడవలి, కడ అనేవాటితో బంధంవేసి విప్లవాత్మక సేవా తత్పరతను నేర్పినవాడు యేసు.  అధికారాన్ని వినయంతోను, ఆధిపత్యాన్ని సమర్పణ త్యాగ  వైఖరితో బంధం చేయగలిగాడు.


మన ప్రభువు అనేక సందర్భాల్లో వ్యర్థమైన అహంకారం, కీర్తి మరియు వైభవం కొరకు తారసపడే  కలహాలను గురించి చాల సమయాల్లో మందలించాడు. ఒక చిన్న పిల్లవాడిని చూపిస్తూ పిల్లల  మనస్సును పోలి ఉండమని ప్రోత్సహించడం వంటి ప్రతీకాత్మక చర్యల ద్వారా బోధించాడు యేసు. శిష్యుల పాదాలను కడగడం వంటి వినయ విధేయాత్మకు ఉదాహరణను చూపిస్తున్నాడు యేసు. అందువల్లనే తన రాజ్యంలో అధికార దాహం తీర్చుకోవడానికి అవకాశం లేదని యేసు తన శిష్యుల   అభ్యర్థనను ఆమోదించలేదు. గౌరవ మర్యాదలు అనేవి ఒకరి నైతిక చట్టాల బద్దత వల్లనే నిర్వహించబడతాయి. ఒకరి జీవితాన్ని లేదా సమాజాన్ని మలచ గలదే నైతిక చట్టాలే అని తన శిష్యులకు  అవగాహన కల్పించాడు.

ప్రధమాసనాలను కోరుకున్న ఇద్దరు శిష్యులకు కల్వరి శిలువపై బాధామయ సేవకుని మరణం  శ్రమల బాప్టిజంనువాగ్దానం చేసింది. వారు తమ యజమానుని అవమాన మరమరణాలను చూసినప్పుడు పరలోక రాజ్యభాగస్వామ్యానికి కొంత ముందస్తు రుచిని కలిగించింది. కాలక్రమంలో అదే వారి అనుభవాన్ని విస్తృతం చేసింది. వేద శ్రమల్లో కత్తికి జేమ్స్ బలయ్యాడు. జాన్ చాలా కాలం సాక్షిగా జీవించాడు. ఇద్దరూ తమ గురువు క్రీస్తుకు కొరకు వారి మరణం వరకు సాక్ష్యులుగా జీవించారు. ఇద్దరూ ప్రాపంచిక సంబంధమైన అధికారాశయాన్ని కోల్పోయారు. ప్రభువు యొక్క శిలువ మరియు సహవాస అభిరుచిని ఘనంగా తెలుసుకున్నారు.


కుటుంబంలో, సమాజంలో, చర్చిలో, ప్రపంచంలో మనం ఒకరికొకరo పరిచారకులుగానూ, అందరికీ ఎలా సేవకులుగా జీవించగలం? ప్రభువుకు మరియు ఆయన ప్రజలకు సేవ చేయడంలో మన ప్రతిభను పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతగానో ఉంది. అందుకు మనం ఉత్తమంగా ఏమి చేయగలం? మనందరికీ చాలా విభిన్నమైన దైవీక తలంతులు ఉన్నాయి. ఖైదీలను దయ, కరుణ మరియు న్యాయంతో పరామర్శించే వరాలను కొందరు కలిగి ఉన్నారు. మరికొందరు జబ్బుపడిన వారి పట్ల సానుభూతిని కలిగి ఉంటారు. మరికొందరు పేదల పట్ల ఉదార ​​హృదయాన్ని కలిగి ఉంటారు. మరికొందరు తమ పిల్లలకు మాత్రమే కాదు, వారి జీవిత పరిస్థితుల ద్వారా అనాథలైన వారికి గొప్ప తల్లిదండ్రులుగా వుండే  పరిశుద్ధాత్మ వరాలను కలిగి ఉంటారు. మనందరికీ చాలా టాలెంట్స్ ఉంటాయి. యేసు రాజ్యంలో నిరుపేదలకు సేవ చేయడానికి మాత్రమె మనకు తన ప్రతిభను ఇచ్చాడు.


తన పనిని చేయడంలో మనకున్న వైఫల్యాలను, పరిమితులను, భయాలను, మనపై మనకు విశ్వాసం కోల్పోయిన సమయాలు ఉన్నప్పటికీ యేసు అర్థం చేసుకుంటాడు. "ప్రేమ యొక్క ఫలం సేవ మరియు శాంతి" అని చెప్పిన మథర్ థెరిసా వలె యేసును ఇతరులలో గ్రహించి తన ఉనికిని సేవించడానికి ప్రేమ మరియు దృఢ నిశ్చయం వంటి ప్రతిభను ఉపయోగించుకోవాలి. మనం మన జీవితాలను వినయపూర్వకమైన సేవలో మరియు ఒకరికొకరు ప్రేమలో ఉంచడం ద్వారా దేవుని పాలనను పంచుకుంటాము.


అతను దుమ్ము నుండి పేదలను లేపుతాడు మరియు బూడిద కుప్ప నుండి పేదలను లేపుతాడు” (అర్చనకాల ప్రార్ధన)

 

 

Saturday, 19 October 2024

To serve is to reign with Christ : Is 53:10-11; Heb 4:14-16; Mk 10:35-45 (B 29)


To serve is to reign with Christ


Is 53:10-11; Heb 4:14-16; Mk 10:35-45 (B 29)

“I know the plans I have in mind for you – plans for peace, not disaster... ” (DO)

 

There is an unquenchable thirst for recognition and fame, power and authority in every person. It is not exceptional in the lives of the disciples of Jesus thirsting for power, position, and authority. James and John, the sons of Zebedee, urged their mother to strike a deal with Jesus. The ambitious disciples wanted the highest position in the kingdom of Jesus. But Jesus reversed the world’s understanding of power, authority, and position, that is, the order of master and servant, lord and subject, first and last., etc. Jesus wedded authority with submission, position with disposition, and domination with humility.


Our Lord on several occasions rebuked the pride, vain-glory, and strife for pre-eminence which broke forth again and again. He did it by symbolic acts like setting a little child and exhorting them to be childlike spirit; washing feet and bidding them follow his example of condescension and humility. So, it would not grant them their request for prominence in his kingdom. He gave them the understanding that the bestowment of honors is governed by great moral laws and that will be the result of their operation in the heart and in society.


The two disciples who asked for power were promised the cup of sorrow instead and the baptism of suffering upon the cross of Calvary. They had some foretaste of their portion when they saw their Master in his humiliation and death. In the course of time, it enlarged their experience. James fell victim to the sword of the persecutor. John lived a long life of witness. Both were faithful to their Master, Christ unto death. Both lost all taint of earthly ambitions and followed the fellowship of their Lord’s cross and passion.


How can we live as ministers of one another, as servants of all in the family, in the Church, in the world?  All of us are endowed with lots of different gifts. We have a responsibility to develop our gifted talents in service to the Lord and his people. What can we do best? Some can care for “imprisoned” with mercy, compassion and justice. Others have a great deal of empathy for the sick. Others have a generous heart for the poor. Others are great parents not just to their own children but to those orphaned by the circumstances of their lives. We all have many talents. Talents are given to us to serve the needy in the kingdom. 


The Lord understands our failures, our limitations, our fear and the times that we lack confidence in ourselves to do his work. Yet he sees us using his talents like love and determination to seek him out in others and serve his presence as Saint Teresa of Calcutta did and said, “The fruit of love is service and peace”. And we share God’s reign by laying down our lives in humble service and love for one another.


“He raises the poor from the dust and lifts the needy from the ash-heap...” (DO)

Saturday, 12 October 2024

యేసుయందు మాత్రమె రక్షణ: సామెతలు 7:7-11; హెబ్రీ 4:12-13; మార్కు 10:17-30 (B 28)

 

యేసుయందు మాత్రమె రక్షణ

సామెతలు 7:7-11; హెబ్రీ 4:12-13; మార్కు 10:17-30 (B 28)

".. నన్ను వెంబడించoది, ప్రతిఫలంగా వంద రెట్లు పొందుతారు మరియు శాశ్వత జీవితాన్ని పొందుతారు"

 

తన చిన్ననాటి నుండి అన్ని చట్టాలను ఆచరిస్తున్న ఒక సంపన్న యువకుడు, నిత్యజీవం పొందుకోవడానికి ఇంకా ఏమి చేయాలి అని యేసును అడిగాడు. అందుకు యేసు సంపదతో తనకున్న అనుబంధాన్ని విడిచిపెట్టి కొంత సంపదను పేదలతో పంచుకొని తనను అనుసరించమని యేసు అతనికి సూచించాడు. యేసు ప్రతిపాదన అతనికి నచ్చలేదు. అతను యేసును విడిచిపెట్టాడు. సంపద విషయంలో యేసు ఎందుకు జాగ్రత్తలు నేర్పుతున్నాడు?

 

యేసు సంపదకు, సంపన్నులకు వ్యతిరేకం కాదు. అతనికి ధనవంతులైన చాలా మంది స్నేహితులు కూడా ఉన్నారు. సంపదను సరైన రీతిలో వినియోగించుకోవాలని ఆయన మనకు బోధిస్తున్నాడు. మరియు వంచకుడై ధనము సంపాదించినవానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు ఉత్తమం" (సామె 28:6; కీర్తన 37:16); “ధనవంతులు కావడానికి మిమ్మల్ని మీరు అలసిపోనివ్వక తెలివిగా ఉండు” (సామె 23:4) అని యేసు పాత నిబంధన జ్ఞానాన్ని పునరుద్ఘాటించాడు. సంపదను కలిగి ఉండటం పాపం కాదు. కానీ ఒకరి స్వంత భద్రత లేదా రక్షణ అన్నది సంపదపై నమ్మకాన్ని తప్పుగా ఆలోచన కలిగి ఉండడం వలన జీవితం యొక్క ఉద్దేశ్యం మరియు దాని పరమార్ధం నుండి మనలను దూరం చేయవచ్చు. సంపద మనల్ని తప్పుత్రోవలో స్వతంత్రులను చేయగలదు. లావోడిసియా సంఘం సంపద పట్ల తాను కలిగియున్న దృక్పథం మరియు తప్పుడు భద్రతను గురించి హెచ్చరింపబడింది. "నేను ధనవంతుడిని, నేను అభివృద్ధి చెందాను మరియు నాకు ఏమీ అవసరం లేదు" అన్న భ్రమ ఆలోచనవల్లనే ఆ సంఘం హెచ్చరికకు గురి అయినది. సువార్తలోని ఒక ధనవంతుడు ఇలా అనుకున్నాడు, “ నా ఆత్మమా! నీకు చాలా సంవత్సరాలకు సరిపడు అనేక సంపదలు ఉన్నాయి. నిశ్చింతగా వుండుము. తినుము. త్రాగుము. సుఖించుము” (లూకా 12:19). అందుకు యేసు, “ఈ లోకమంతటినీ సంపాదించి, ఆత్మను పోగొట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?” అని ప్రశ్నించాడు (మత్త 16:26).

 

పరలోక రాజ్య నిధి కోసం “అందరినీ త్యజించు” అని యేసు తన శిష్యులకు ఎందుకు చెప్పాడు? సంపదకు, కోరికలతో పెనవేసుకుపోయిన హృదయానికి ప్రత్యేక సంబంధం ఉంది. ప్రభువే మనకున్న గొప్ప సంపద. అదే గొప్ప ఆనందం. “అన్నింటిని త్యజించండి” అనే యేసు బోధ మన అనురాగ  అనుబంధాలు, తప్పుడు స్నేహాలు, తప్పుడు ప్రభావాలు, విరామం లేని ఉద్యోగాలు, అనవసరమైన వినోదాలు, కపట జీవన శైలి వంటి అనేక విభిన్న విషయాలను విడిచిపెట్టడాన్ని సూచిస్తుంది. ఆ బోధ మొదట దేవుణ్ణి ప్రేమించే స్థానంలో నిలబడుతుంది.

 

శిష్యులు యేసుతో, “మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి” అని అంటే “అందుకు  ప్రతిఫలమేమిటి? అన్న అర్ధమేగా!! ఆ ప్రతి ఫలo గొప్పది. భయం నుండి విముక్తి, పాపం యెడల నిరాశక్తి, స్వార్థం మరియు అహంకారం, ఒంటరితనం నుండి విముక్తి వంటి తన రాజ్యపు అమూల్యమైన సంపదలను యేసు వారికి వాగ్దానం చేశాడు. ఇది మనం కొనలేని బహుమతి. మన హృదయంలోని లోతైన కోరికలను ఆయన మాత్రమే నిజంగా తీర్చగలడు. యేసులో నెలకొని యున్న నిజమైన ఆనందాన్ని వెదకనివ్వకుండా చేసే దేనితోనైనా లేదా ఎవరితోనైనా విడిపోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా?

 

తన రక్షణను మరియు భద్రతను అతనిలో నిలుపమని  యేసు యువకునికి పిలుపు నిచ్చాడు. అదే పిలుపునును మనకు కుడా ఇస్తున్నాడు. మనం యేసుతో మన వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటే, మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. అప్పుడే ఆతనిలో నేలకోనియున్న సమస్త పరలోక సంపదను మనలో సంపూర్తిగా నింపగలడు. "ఆత్మలో పేదలగువారు  ధన్యులు. స్వర్గరాజ్యం వారిది" (మత్త 5:3).

"క్రీస్తు యొక్క శాంతి ... అన్ని అవగాహనలను అధిగమిస్తుంది. మరియు మీ మనస్సులను హృదయాలను ఆతనిలో నిలుపుతుంది" (దైవార్చన ప్రార్ధన)

 

Security in Jesus

Wis 7:7-11; Heb 4:12-13; Mk 10:17-30 (B 28)

“..come after me, will receive a hundredfold in return and will possess eternal life” (Divine Office)

 

 A wealthy young man observing all the laws from his childhood asked Jesus what he would need still to inherit eternal life. Jesus recommended him to give up his attachment to the wealth and share some wealth with the poor and follow him. He did not like Jesus’ proposal. He left Jesus. Why Jesus was so cautious about wealth?

 

Jesus was not opposed to wealth per se, nor to the wealthy. He had many friends who were wealthy. He teaches us to utilize wealth in a correct way. And he reiterates of the Old Testament wisdom, “Better is a poor man who walks in his integrity than a rich man who is perverse in his ways” (Prov 28:6; Ps 37:16); “Do not wear yourself out to get rich; be wise enough to desist” (Prov 23:4). Having wealth itself is not a sin. But misplacing one’s own security and trust in wealth could lead one away from the very purpose and meaning of life. Wealth can make us falsely independent. The church at Laodicea was warned about their attitude towards wealth and a false sense of security: “For you say, I am rich, I have prospered, and I need nothing”. The rich man in the Gospel said, “Soul, you have many goods laid up for many years; take your ease; eat, drink, and be merry” (Lk 12:19). Jesus answered, “What is the use gaining the whole world and losing the soul?” (Mt 16:26).

 

Why does Jesus tell his disciples to “sell all” for the treasure of his kingdom? Treasure has a special connection to the heart, the place of desire and longing. The Lord himself is the greatest treasure we can have. That is the greatest joy. Jesus’ expression “sell all” could mean many different things such as letting go of attachments, false friendships, false influences, restless jobs, unnecessary entertainments, hypocritic style of life that might stand in the place of loving God first. We are invited to “sell” these things to gain Jesus.

 

The disciples said to Jesus, “We have given up everything and followed you” meaning to say what would be the reward?  Jesus promises them the priceless treasures of his kingdom such as freedom from fear, gripping power of sin, selfishness and pride, freedom from loneliness. This is the reward which we cannot buy. He alone can truly satisfy the deepest longing and desires of our heart. Are we willing to part with anything that might keep us from seeking true joy with Jesus?

 

Jesus called young man to place his hope and security in him. He gives us the same call. If we wish to enter into a personal relationship with him, we must empty ourselves so that Jesus can fill us with his treasure. “Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven” (Mt 5:3).

 

“The peace of Christ … surpasses all understanding and keep your minds and hearts in him” (Divine Office)

Saturday, 5 October 2024

విడదీయరాని దైవీక దాంపత్య బంధం: ఆది 2:18-24; హెబ్రీ 2:9-11; మార్కు 10:2-16

 

విడదీయరాని దైవీక దాంపత్య బంధం  

ఆది 2:18-24; హెబ్రీ 2:9-11; మార్కు 10:2-16

నా కుమారుడా, నా మాటలను గమనించు. నేను చెప్పేది శ్రద్ధగా వినండి” (దైవర్చన ప్రార్ధన DO)

 

గత మూడు ఆదివారాలుగా, యేసు మరియు అతని శిష్యుల మధ్య జరిగిన సంభాషణల గురించి మార్కు సువార్తనుండి మనం విన్నాము. నేటి సువార్త పఠనంలో, విడాకుల చట్టబద్ధత గురించి పరిసయ్యులు యేసును పరీక్షించడం వింటున్నాము. నిర్దిష్ట పరిస్థితులలో, మోషె చట్టం విడాకులను అనుమతించింది (ద్వితీ 24:1-5). ఈ చట్టం భర్త తన భార్యకు విడాకులు ఇవ్వడానికి అనుమతిస్తుంది. కానీ భార్య తన భర్తకు విడాకులు ఇవ్వలేదు. యేసు సృష్టి గ్రంధాన్ని ఉటంకిస్తూ దేవుని అసలు ఉద్దేశంలో ఉద్దేశ్యం మరియు అర్థాన్నివిశిడం చేశాడు. యేసు బోధ కుటుంబ ప్రాముఖ్యతను నొక్కిచెప్పే విధంగావుంది. అది అతని కాలంలోని సాంస్కృతిక నిబంధనల సంస్కరించే విధంగా ఉంటుంది.


స్త్రీలు మరియు పురుషులు వివాహంలో కలిసి ఉండాలన్నది దేవుని ఉద్దేశం. పెళ్లి లక్ష్యం పిల్లల పెంపకం. ఈ బాధ్యత వివాహపు జీవితంలో కలిగిన కొన్ని ప్రయోజనాలలో ఒకటి. తిరుసభ సత్యోపదేశం  దివ్య సంస్కారం వివాహంను ఏవిధంగా నిర్వచించిది? " ఒక పురుషుడు మరియు స్త్రీ మధ్య జీవితకాల ఒడంబడిక. ఇది దంపతుల శ్రేయస్సు కొరకు మరియు పిల్లల సంతానోత్పత్తి, వారి విద్య కోసం ఆదేశించబడిందే ఈ దివ్య సంస్కారము" (ఆర్టికల్ 1601). బిడ్డలను పొందుకొని వారిని దేవుని భయభక్తులతో పెంపొందించడం ద్వారా, తల్లిదండ్రులు దేవుని సృష్టిలో సహ-సృష్టికర్తలుగా దీవింప బడతారు. వివాహం ఒక దివ్యసంస్కారం. దివ్య సత్ప్రసాద సంస్కారము వలే ఇతర దివ్య సంస్కారములలో కూడా యేసు ఉనికి ఏవిధంగా వుందని మనం విశ్వసిస్తున్నామో  వివాహ దివ్య సంస్కారములో కుడా యేసు సాన్నిధ్యం వుంది. దివ్య సంస్కారములో దేవుని సాన్నిధ్యం నెలకొని వుంటుంది. భార్యాభర్తలు త్యాగపూరిత జీవితాన్ని జీవించినప్పుడు యేసు తన ప్రేమను వారి ప్రేమకు ఐక్య పరుస్తాడు. అందువల్లనే ఆతని సాన్నిధ్యం వారి దాంపత్య జీవితంలో నెలకొని వుందని మనము విస్వసిస్తున్నాము. ఇందుకు ఈ దంపతులు భగవంతుని కృపకు సహకరిస్తూ నిరంతర సద్భావన జీవిత నడవడి కలిగి వుండడం చాలా అవసరం. తనలో భాగమైన మరొకరితో దాంపత్య జీవితంలో జీవించడం అంటే చాలా కఠినమైనదే! యేసు కొరకుజీవించే త్యాగ జీవితంలో దాంపత్య శిలువ జీవితం చాలా క్లిష్టమైనప్పటికి దీవేనకరమినదే ఎందుకంటే ప్రేమ అనేది ఒకరి స్నేహితుని కోసం జీవితాన్ని అర్పించడం. అందుచేతనే వారు దేవుని రాజ్యానికి సాక్ష్యమిస్తున్నారు.


"ఇష్-షాహ్" అనే హీబ్రూ పదానికి తెలుగు భాషలో స్త్రీ అని అర్థం వస్తుంది. అయితే దాని నిగూఢ అర్ధం   'జీవిత భాగస్వామి' లేదా ‘సహ ధర్మ చారిణి’. జీవితంలోని అన్ని రంగాలలో స్త్రీ తన సహ పురుషునితో సరి సమానంగా వుంటూ తనకు తోడ్పడాలని ఈ వచనం సూచిస్తుంది. అందుకనే “నా ఎముకలలో  ఎముక, 'నా మాంసంలో మాంసం” అనే పరిశుద్ధ వాక్యం ఈ సత్యాన్ని ధృవీకరిస్తుంది. అలాగునే యేసు వివాహ జీవితం మరియు బ్రహ్మచర్య జీవితం అనేవి స్వర్గరాజ్యం చేరుకొనేందుకు ఏర్పాటు చేయబడిన శ్రేష్ఠమైన ప్రయాణ మార్గాలని యేసు విశిద పరిచాడు (మార్కు 19:11-12 ). వివాహం మరియు బ్రహ్మచర్యం రెండూ పవిత్ర జీవితాన్ని గడపడానికి భగవంతుని పిలుపు. భ్రహ్మ చర్య వ్రతం గురించి మరొకసారి ధ్యానం చెద్దాం. అయితే మన జీవితాలు మన స్వంతం కాదు. కానీ అవి దేవునికి చెందినవి. రెండవ వాటికను మహాసభ దాంపత్య జీవితం గురించి మనకు ఇలా గుర్తుచేస్తుంది: “ఈ భార్యాభర్తల పవిత్ర బంధం అనేది, వారి సంతానం మరియు సమాజం యొక్క మంచిని దృష్టిలో ఉంచుకుని, మానవ సంకల్పంపై ఆధారపడి ఉండదు. దేవుడే వివాహానికి రచయిత. అతను దానిని వివిధ మచి వస్తువులతో,  ఉద్దేశ్యాలతో, లక్ష్యాలతో ఏర్పాటు చేశాడు.  ఇవన్నీ మానవ జాతి సర్వోన్నత ప్రగతి మరియు దాని పరంపరకు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి" (గౌదియం ఎత్  స్పెస్. 48).


యెహోవా ఇలా అంటున్నాడు, “మూడు కార్యములు నాకు ఇష్టము. దేవునికిని నరులకుగూడ ఇవి ప్రీతి కలిగించును. సోదరులు ఐకమత్యముగా జీవించుటయు, ఇరుగుపొరుగువారు స్నేహముగా జీవించుటయు, భార్యాభర్తలు పొందికగా జీవించుటయు (సిరాపు. యేసు. జ్ఞాన  25:1). వివాహ  దాంపత్య సంస్కారమును కొనియాడే వారందరి నిమిత్తమై ఈ రోజు మనం భగవంతుని ఆశీర్వాదం కొరకు ప్రార్ధించుదాము. భార్యాభర్తల పొందిక జీవితంలో కలిగియున్న భగవంతుని సాన్నిధ్యానికి సాక్ష్యమివ్వగలిగే  ధైర్యం మరియు బలం మీకు కలగాలి. ఆమెన్.


“ప్రభువు తనను ప్రేమించే వారందరినీ సురక్షితంగా కాపాడుతాడు" (దైవార్చన ప్రార్ధన DO)

Indispensable Union with God: Gen 2:18-24; Hb 2:9-11; Mk 10:2-16

 

Indispensable Union with God

Gen 2:18-24; Hb 2:9-11; Mk 10:2-16

 “My son, pay attention to my words. Listen carefully to what I say” (Divine Office)


For the past three Sundays, we have been hearing Mark’s reports of conversations between Jesus and his disciples. In today’s Gospel reading, we heard the pharisees putting Jesus to test about the lawfulness of divorce. Under specific conditions, the Law of Moses allowed divorce (Dt 24:1-5). This law permits a husband to divorce his wife and not a wife divorces her husband. Jesus quoting the Book of Genesis brings the purpose and meaning in God’s original intention in establishing system of marriages. Jesus’ teaching is more restrictive distinguishing from the cultural norms of his time emphasizing the importance of family.


God intended women and men to be joined together in marriage. The purpose of marriage is raising of children. It is one of some purposes. How does the CCC define the sacrament of marriage? It defines as “a lifelong covenant between a man and a woman that is ordered toward the good of the couple and the procreation and education of children” (A.no.1601). By welcoming children and fostering their relationship with God, parents become co-creators. Marriage is a sacrament. A sacrament is a sign and real presence of God as we believe in the presence of Jesus in the Eucharist and other sacraments. In the sacrament of marriage, Jesus is present uniting his love to the love of the husband and wife when they live sacrificially. It requires a constant effort of goodwill cooperating with the grace of God. Living in married love with another means dying to self in many little ways, because love is a kind of laying down a life for one’s friend. They bear witness to the Kingdom of God.


The Hebrew word ish-shah” means woman in English, the better meaning ‘indispensable partner’. The term suggests that the woman is to stand alongside the man as his equal in all the aspects of life. It affirms the Biblical saying ‘bone of my bones’, ‘flesh of my flesh.’ Jesus sets the high ideal of the married state as well as state of celibate life for the sake of the kingdom of heaven (Mt 19:11-12). Both the sacraments of marriage and celibacy are a call from God to live a holy life. Our lives are not our own, but they belong to God. The Second Vatican Council reminds us: “This sacred bond, with a view to the good of both the spouses and their offspring, and of society, does not depend on human will. God himself is the author of marriage, who has endowed it with various goods and ends, all of which are of enormous importance for the continuity of the human race” (Gaudium et Spes, n. 48).


Yahweh says, “In three things I was beautified and stood up beautiful both before God and men: the unity of brethren, the love of neighbors, a man and a wife that agree together” (Sir 25:1). We ask God’s blessing today upon all who celebrate the sacrament of matrimony. May you have the courage and strength to give witness to the presence of God in the union of husband and wife. 


“The Lord keeps safe all who love him” (Divine Office).