AletheiAnveshana

Saturday, 28 September 2024

రహస్య పూర్ణమైన దేవుని క్రియాత్మ: సంఖ్యా 11:25-29; యాకోబు 5:1-6; మార్కు 9:38-43,45,47-48 (26 B)

 

రహస్య పూర్ణమైన దేవుని క్రియాత్మ

సంఖ్యా 11:25-29; యాకోబు 5:1-6; మార్కు 9:38-43,45,47-48 (26 B)

"... మీరు దయ ద్వారా రక్షింపబడ్డారు, కానీ యేసు క్రీస్తు ద్వారా దేవుని చిత్తం ద్వారా" (దైవార్చన ప్రార్ధన DO)

 

కథోలిక శ్రీసభ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలుగా క్రీస్తుకు నమ్మకంగా ఉన్న అసలైన క్రైస్తవ చర్చి. ఇతర విశ్వాస సంఘాలలో కూడా క్రియాశీలి అయిన దేవుని ఆత్మను చూస్తున్నాము. యేసుక్రీస్తును నమ్మని వారు దేవుడు ఒక్కడే అని ప్రగాఢ విశ్వాసంతో నిండిన వ్యక్తులు ఆ దేవుని కోసం జీవిస్తూ ఆయన కొరకే సేవ చేస్తున్నామని నమ్మే చాలా మంది వ్యక్తులు - పేద, అనారోగ్య నిర్భాగ్యులకు సేవ చేయడంలో ఆ దేవుని ఆత్మ శక్తిని పొందుకుంటున్నారు. లూథరు మతస్తుడైన డైట్రిష్ బోయెన్‌హాఫర్,  హిందువైన మహాత్మా గాంధీ, యూదుడైన మార్టిన్ బుబెర్, బిల్లీ గ్రహం మరియు R.R. K. మూర్తి వంటి వివిధ ఆధ్యాత్మిక నాయకులను కుడా మనము చూస్తున్నాము. అలాగునే మాతృ తిరుసభ ఏడు దివ్య సంస్కారముల ఎడల భాగస్వామ్యం లేని సంఘాలలో కూడా దేవుని ఆత్మ  పరిపూర్ణంగా పనిచేయడం చూస్తున్నాము. వీరిలోని సర్వోన్నత దేవుని ఆత్మ యేసు స్థాపిత కథోలిక సంఘ బోధన వైపు మళ్ళిస్తుందని తిరుసభ నమ్ముతుంది. పరిశుద్ధ గ్రంధ పరంగా ఈ సత్యాన్ని ఎలా నమ్మగలం?


ఎల్దాదు మరియు మేదాదు దేవుని గుడారములో లేరు. మోషే కాలంలో దేవుని ఆత్మను పొందిన 70 మందితో వారు లేరు. అయినప్పటికీ, ఎల్దాదు మరియు మేదాదు ఆత్మను పొందుకున్నారు. అప్పుడు మోషేతో "వారిని ఆపు" అన్నాడు జాషువా. అందుకు మోషే, యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక” అని జవాబిచ్చాడు (సంఖ్యా 11:29). యేసు పరిచర్య రోజుల్లో,  శిష్య గణంలో లేని ఒక  వ్యక్తి యేసు నామంలో బాప్తిస్మం ఇవ్వడం శిష్యులకు ఈర్శ్య కలిగించింది. అతను పన్నెండు మందిలో ఒకడు కాదు. బహుశా అతను యేసు మాట్లాడటం విని, సువార్తను వ్యాప్తి చేయాలని కోరుకున్నాడెమో!  “అతన్ని ఆపండి” అని యోహాను యేసుతో వాపోయాడు. అందుకు యేసు "అతన్ని ఆపవద్దు ... మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షమే" (మార్కు 9:40) అని  జవాబిచ్చాడు.


తిరుసభ పితృ పాదుడు గ్రెగొరీ ఆఫ్ నిస్సా (క్రీ.శ. 330-395) ఇలా వ్రాశాడు, “దేవుడు తన సేవకులను అసాధ్యమైన వాటిని చేయమని ఎప్పుడూ అడగడు. తన అద్వితీయ ప్రేమ మరియు మంచితనం తన సేవకులకు సమృద్ధిగా అందుబాటులో ఉండేటట్లు చేశాడు. అందరిపై తన కృపను నీళ్లలా కుమ్మరిస్తాడు. ఏదైనా మంచి చేసే సామర్థ్యాన్ని దేవుడు తన ఇష్టానుసారంగా ప్రతి వ్యక్తికి సమకూరుస్తాడు."ఇతరులు చేసే సత్రియలను చూసి మనం సంతోషిస్తున్నామా లేక అసూయా పడుతున్నామా? తమ సాంగత్యం లేని వ్యక్తి ఏసుక్రీస్తు నామంలో మంచి పని చేస్తున్నాడంటూ వాపోయారు శిష్యులు. యేసు తన శిష్యుల అసూయ, అనుమానాలను గురించి మందలించాడు. మనకంటే ఎక్కువగా ప్రకాశిస్తున్నట్లు అనిపించే ఇతరుల మంచి పనులకు మనం బాధపడినప్పుడు మనం కూడా యేసు మందలించే తన శిష్యులాంటి వాళ్ళమేగా? భక్త పౌలుడు  “ప్రేమ దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును  (1 కొరింథీ 13:4,6) అని మనలను వారిస్తున్నాడు.


దేవుని ఆత్మయుగంలో జీవించడానికి మనం అనుగ్రహించబడ్డాము. అతను మంచి వ్యక్తులందరి హృదయాలలో పని చేయడం ద్వారా ప్రపంచాన్ని మారుస్తున్నాడు. అందువలన, “ఆధునిక ప్రపంచంలో తిరుసభ (“The Church in the Modern World”  వాటికన్ II) అనే తిరుసభ విశ్వ లేఖ  దేవుని ఆత్మకు  వినతులయ్యే  వారందరూ, తమ మనస్సాక్షిని అనుసరించే వారందరూ, వాస్తవానికి, యేసుక్రీస్తుచే రక్షించబడిన తిరుసభ సభ్యులు” అని ప్రకటించింది. ఎల్దాదు మరియు మేదాదు దేవుని గుడారమందు ఉండకపోవచ్చు,  యేసు నామంలో బాప్తిస్మం అనుగ్రహిస్తున్న వ్యక్తి శిష్యులలో ఒకరుగా  కాకపోవచ్చు, అయినప్పటికీ, దేవుని ఆత్మ వారిని బలపరిచింది. దీని నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాము? సంవత్సరాల తరబడి దేవాలయమునకు, సంఘమునకు దూరంగా ఉన్న వ్యక్తులు మళ్ళి దేవుణ్ణి కలుసుకొనే  శక్తిని ఆ ఆత్మ వారిని ప్రేరేపిస్తుంది. ఎందుకంటే దేవునకు దూరంగా ఉన్న కాలంలో నిరంతరం క్షమాపణ కోసం అర్దించే వారి హృదయ రహస్య గుహలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. అప్పుడు ఆత్మ వారికి జీవితంలోని అర్థాన్ని మరియు ఉద్దేశ్యాన్ని ఇస్తుంది. పునీత అగుస్తిను వలే "నేను నిన్ను ఆలస్యంగా ప్రేమించాను" అని వారు దుఃఖిస్తారు. దేవుడు తమను ప్రేమించడం ఎప్పటికీ ఆపలేడని తెలుసుకుంటారు. వారే భగవంతుని కృపకు వాహినిగా కూడా మారతారని గ్రహించుదాము.


“..మీలో ఈ మంచి పనిని ప్రారంభించిన దేవుడు, అది క్రీస్తు దినంలో పూర్తయ్యే వరకు కొనసాగిస్తాడు.” (దైవార్చన ప్రార్ధన Divine Office)

 

 

 

 

God’s Spirit Works Mysteriously: Num 11:25-29; Js 5:1-6; Mk 9:38-43,45,47-48 (26 B)

 


God’s Spirit Works Mysteriously


Num 11:25-29; Js 5:1-6; Mk 9:38-43,45,47-48 (26 B)

“…you are saved by grace, … but by the will of God through Jesus Christ” (Divine Office)

 

The Catholic Church is the original Christian Church that has been faithful to Christ for two thousand twenty-four years. But we also see how God works in other faiths too. Many determined faith-filled people who do not confess Jesus Christ, live for God, serve him in the poor, sick and destitute of all faiths. There are also various spiritual leaders such as Dietrich Boenhaffer, a Lutheran, Mahatma Gandhi, a Hindu, and Martin Buber, a Jew, Billy Graham, and R.R. K. Murthy in whom the Spirit of God works. The Spirit of God is still alive in the universal Church even the churches that do not share in the seven sacraments.


Eldad and Medad were not in the tent. They weren’t present with the 70 who received the Spirit of God in the days of Moses. Yet, Eldad and Medad received the Spirit. “Stop them,” Joshua said. Moses answered, “I wish that all the Lord’s people were prophets and that the Lord would put his Spirit on them!” (Num 11:29). During the ministry of Jesus, particular man baptized in the name of Jesus. He was not one of the Twelve. Perhaps he heard Jesus speak and wanted to spread the Gospel. And - “Stop him,” John said. Jesus replied, “Do not stop him…Whoever is not against us is for us” (Mk 9:40).


Gregory of Nyssa (330-395 AD) wrote, “God never asks his servants to do what is impossible. The love and goodness of his Godhead is revealed as richly available. It is poured out like water upon all. God furnishes each person according to his will the ability to do something good”. Do we rejoice in the good that others do? Jesus reprimands his disciples for their jealousy and suspicion. They were upset that someone who was not of their company was performing a good work in the name of Jesus. Are we like disciples when we get upset at the good deeds of others who seem to shine more than us? Paul says, “love is not jealous... but rejoices in the right” (1 Cor 13:4,6).


We are graced to live in the age of the Spirit of God. He transforms the world by working in the hearts of all good people. And thus, “The Church in the Modern World” (Vatican II), declared that all who are open to God, who are following their consciences, are themselves, in fact, members of the Church, saved by Jesus Christ. Eldad and Medad may not have been in the tent, and the one who was baptizing in the name of Jesus may not have been one of the disciples, but, still, the Spirit of God empowered them. What do we learn from this? The Spirit empowers people who had been away from the Church for years, inspiring them to return to the Church. Because the spirit of God works in them who continually ask forgiveness for the time they were away. Now the Spirit gives them meaning and purpose in life. Like Augustine they grieve, “Late have I loved thee” and learn that God never stop loving them.  They become the channel of the grace of God.


“..God, who began this good work in you, will carry it on until it is finished in the Day of Christ..” (Divine Office)

Saturday, 21 September 2024

Being Child-Like Ws 2:12,17-20; Js 3:16—4:3; Mk 9:30-37

 


Being Child-Like


Ws 2:12,17-20; Js 3:16—4:3; Mk 9:30-37

I have become everything in turn to men of every sort, so that …I might save them (DO)

 

Jesus made a dramatic gesture by embracing a child to show his disciples who really is the greatest in the kingdom of God. Children in the ancient world had no rights, position, or privileges of their own. What can a little child possibly teach us about greatness?


The disciples thought that being part of Jesus’ circle would bring them privilege and status. They wanted power. This is a self-centered ambition. James says, “you have an ambition that you cannot satisfy, so you fight to get your way by force”. James understands Jesus well in saying, “The wisdom that comes down from above.” This is God’s ambition.  It is the ambition to serve. Those who want to be first must make themselves servant of all. All our ambitions must be subservient to that God-inspired ambition. One must give priority to the most vulnerable in society, symbolized by the child, completely dependent on adults for one’s own wellbeing. Our ambition is to serve those who are not able to help themselves.


Jesus goes on assuring his disciples and us that in serving the most vulnerable we are in fact serving him. He identifies himself as powerless and he sets the ambition to serve him among the weakest members of society. The important thing is not to triumph, but to serve. Greatness is not in the intellect of the wise man, but in the naivety of the child. Thomas à Kempis says, “If you knew the whole Bible by heart, and all the teachings of the philosophers, how would this help you without the grace and love of God?”. By greeting the wise man, we satisfy our vanity. By serving the needy, we hug God, and we are purified by Him, and divinized.


God wants to fill us with his own glory. He opposes the proud hearted but gives grace to the humble (Lk 1; Js 4:6). If we want to be filled with God’s life and power, we need to empty ourselves of everything which stands in the way – pride, self-seeking glory, vanity, etc. God wants empty vessels so he can fill them with his own glory, power, and love (2 Cor 4:7). Are we ready to humble ourselves and to serve as Jesus did? At times humility might be seen as weakness. It is not weakness but it’s the highest spiritual grade we obtain.


St. Teresa of Calcutta said, “People are often unreasonable, irrational, and self-centered. Forgive them anyway. If you are kind, people may accuse you of selfish, ulterior motives. Be kind anyway. If you are successful, you will win some unfaithful friends and some genuine enemies. Succeed anyway. If you are honest and sincere people may deceive you. Be honest and sincere anyway. What you spend years creating, others could destroy overnight. Create anyway. If you find serenity and happiness, some may be jealous. Be happy anyway. The good you do today will often be forgotten. Do good anyway. Give the best you have, and it will never be enough. Give your best anyway. In the final analysis, it is between you and God. It was never between you and them anyway”.


“I do all this for the sake of the gospel, to take my part in proclaiming it” (DO)

 

 

 

పసి బిడ్డల మనస్సు వలే.......... జ్ఞాన 2:12,17-20; యాకోబు 3:16—4:3; మార్కు 9:30-37

 

పసి బిడ్డల మనస్సు వలే..........

జ్ఞాన 2:12,17-20; యాకోబు 3:16—4:3; మార్కు 9:30-37

“నేను అన్ని రకాల వారికి ప్రతిగా మారాను, తద్వారా నేను వారిని రక్షించగలను” (DO)

దేవుని రాజ్యంలో నిజంగా ఎవరు గొప్పవారో తన శిష్యులకు చూపించడానికి యేసు ఒక పిల్లవాడిని కౌగిలించుకుంటూ నాటకీయమైన ఒక సంజ్ఞను చేశాడు. ప్రాచీన ప్రపంచంలో పిల్లలకు వారికంటూ స్వంత హక్కులు, సంఘంలో ఒక స్థానం గానీ, అధికారాలు లేవు. అటువంటి చిన్న పిల్లవాడు తన గొప్పతనం గురించి మనకు ఏమి చెప్పగలడు? అటువంటప్పుడు ఈ సంజ్ఞకు అర్ధం ఏమిటి?

అపోస్తలులు యేసు శిష్యగణంలో భాగమై ఉండడం వల్ల తమకు ఆధిక్యత, హోదా, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని భావించారు. వారు అధికారం కోరుకున్నారు. ఇది స్వీయ-కేంద్రీకృత, స్వార్ధ ఆశయం. యాకోబు ఇలా అంటాడు, "మీరు సంతృప్తి చెందలేని ఆశయాన్ని కలిగి ఉన్నారు, కాబట్టి బలవంతంగా మీరు దానిని సాధించు కోవడానికి పోరాడుతున్నారు". యాకోబు యేసు బోధనను బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టే దానిని “పైనుండి దిగివచ్చే జ్ఞానం” అని సంబోధించాడు. ఇది భగవంతుని ఆశయం. సేవ చేయాలనే ఆశయం. అగ్ర స్థానంలో ఉండాలనుకునే వారు తమను తాము అందరికీ సేవకునిగా మలచుకోవాలి. మన ఆశయాలన్నీ ఆ భగవంతుని ప్రేరేపిత ఆశయానికి లోబడి ఉండాలి. సమాజంలో పెద్దలపై పూర్తిగా ఆధారపడే పిల్లలవలె సూచించబడే అత్యంత బలహీనమైన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. సమాజంలో తమకు సహాయం చేయలేని వారికి సేవ చేయడమే మన ఆశయంగా ఉండాలి.

నిజానికి మనం అత్యంత దుర్బలమైన వారికి సేవ చేయడంలో ఆయనకు సేవ చేస్తున్నామని యేసు తన శిష్యులకు మరియు మనకు భరోసా ఇస్తూనే ఉన్నాడు. యేసు తనను తాను ప్రాపంచిక అధికారిక  శక్తిహీనునిగా గుర్తించుకుంటాడు. ఆతనికి ప్రధానమైన విషయం లోక విజయం కాదు, సేవ చేయడం మాత్రమే. గొప్పతనం అనేది జ్ఞాని యొక్క తెలివి తనంలో ఉండేది కాదు. అది పిల్లల రుజువర్తన మనస్తత్వoలో ఉంటుంది. థామస్ కెంపిస్ ఇలా అంటాడు, “మీరు మొత్తం బైబిల్‌ను కంటితం చేయగలిగినా, తత్వవేత్తల బోధనలన్నింటినీ తెలుసుకన్నా, దేవుని దయ, ప్రేమ లేకుండా ఇది మీకు ఎలా సహాయపడుతుంది?” తెలివైన వ్యక్తితో పరిచయం కలిగి వుండడం ద్వారా మనం పరపతిని పొందుకుంటాము. నిరుపేదలకు సేవ చేయడం ద్వారా, మనం దేవుణ్ణి కౌగిలించుకుంటాము, మనం ఆయన ద్వారా శుద్ధి చేయబడతాము. దైవీకరింపబడతాము.

దేవుడు మనలను తన మహిమతో నింపాలని కోరుకుంటున్నాడు. అతను గర్విష్ఠులను వ్యతిరేకిస్తాడు కానీ వినయస్థులకు కృపను ఇస్తాడు (లూకా 1:52; యాకోబు 4:6). మనము దేవుని జీవము మరియు శక్తితో నింపబడాలంటే, అడ్డుగా ఉన్న అహంకారం, స్వయ కీర్తి మొదలైనవాటిని మనమే ఖాళీ చేసుకోవాలి. దేవుడు ఖాళీ హృదయాలను కోరుకుంటాడు కాబట్టి అతను వాటిని తన శక్తి ప్రేమ మరియు కీర్తితో నింపగలడు (2 కొరి 4:7). యేసు ఆశించినట్లు సేవ చేయడానికి మనల్ని మనం తగ్గించుకోవడానికి సిద్ధమా? కొన్నిసార్లు మన దయా వినయాలు బలహీనతగా పరిగణింపబడవచ్చు. ఇది బలహీనత కాదు కానీ అది మనం పొందుకొనే అత్యున్నత ఆధ్యాత్మిక శ్రేణి.

మదర్ థేరేసా ఇలా అన్నారు, “ప్రజలు తరచుగా అసమంజసంగా, అహేతుకంగా స్వార్థపూరితంగా ఉంటారు. వారిని ఎలాగైనా క్షమించండి. మీరు దయతో ఉంటే, ప్రజలు మిమ్మల్ని స్వార్థపూరితమైన, నిగూఢమైన ఉద్దేశ్యాలతో నిందించవచ్చు. అయినా దయగా ఉండండి. మీరు విజయవంతమైతే, మీరు కొంతమంది నమ్మకద్రోహ స్నేహితులను మరియు కొంతమంది నిజమైన శత్రువులను గెలుచుకుంటారు. అయినప్పటికీ విజయం సాధించండి. మీరు నిజాయితీగా ఉంటే, ప్రజలు మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఏమైనప్పటికీ నిజాయితీగా ఉండండి. మీరు సంవత్సరాల తరబడి సృష్టించే వాటిని ఇతరులు రాత్రిపూట నాశనం చేయగలరు. ఏమైనప్పటికీ సృష్టించండి. మీరు ప్రశాంత ఆనందాన్ని కనుగొంటే, కొందరు అసూయపడవచ్చు. ఎలాగైనా సంతోషంగా ఉండండి. ఈరోజు మీరు చేసిన మేలు తరచుగా మరువ బడుతుంది. అయినప్పటికీ మంచి చేయండి. మీ వద్ద ఉన్న ఉత్తమమైనదాన్ని ఇవ్వండి. అది ఎప్పటికీ సరిపోదు. ఏది ఏమైనా మీ బెస్ట్ ఇవ్వండి. చివరిగా, ఇది మీకు, దేవునికి మధ్య మాత్రమే వుంటుంది కానీ అది మీకు మిమ్ములను బాధించే వారికీ మధ్య ఎప్పుడూ వుండదు."

"నేను సువార్త కొరకు, దానిని ప్రకటించడంలో నా వంతు పాలుపంచుకోవడానికి ఇదంతా చేస్తున్నాను" (DO)

Saturday, 14 September 2024

Jesus is my Savior: Is 50:5-9a; Js 2:14-18; Mk 8:27-35 (B 24)

 

Jesus is my Savior

Is 50:5-9a; Js 2:14-18; Mk 8:27-35 (B 24)

“A sword of sorrows pierced her blameless heart” (DO)

 

Today’s gospel reading is the central turning point of the Gospel of Mark that presents Jesus as a healer, exorcist, wonderworker, displaying an “authority”. This throws the Pharisees into confusion. The meaning of his activities resulted in a host of conflicting interpretations. That’s why Jesus questioned his disciples: “Who do you say that I am?”  Peter by the grace of God professed that Jesus was truly the “Christ of God” – “the Son of the living God” (Mt 16:16). The Greek word “Christos” or “Messiah” in Hebrew literally means “the Anointed One” – to redeem the fallen human race (Lk 9:20, Acts 2:14-36).


Jesus perhaps wanted to learn how people define him and clarify his own identity. When John the Baptist asked, “Are you he who is to come or should we look for another”? (Mt 11:3; Lk 7:19), Jesus did not answer directly but pointed to the signs of his healing. This can be interpreted as messianic signs. Jesus, learning about the necessity of the Cross points to the Servant songs in Isaiah foretelling that the Messiah must be a man of sorrow: “I was not rebellious, I did not turn backward. I gave my back to those who struck me, and my cheeks to those who pulled out the beard; I did not hide my face from insult and spitting” (50:6)


Faithfulness to his mission cost him his life. When Jesus began to articulate this reality, Peter rebuked Jesus. Peter could not accept the otherness of Jesus. Peter was comfortable in telling Jesus who he was, but when Jesus began to reveal himself who he really was, he became distinctly uncomfortable. Today, Jesus tells us “No cross, no crown.” There can be no Easter without Good Friday. What is the “cross” that you and I must take up each day?


Like Jesus we are called to deny ourselves and take up the cross for the sake of others. Our every action has divine significance for others. Maybe we don’t wreck ourselves up by taking drugs or getting drunk! Why? Not just out of self-respect, which is important, but because there are others for whom our health is important. Young people refrain from sex outside of marriage not because of the Church law but they can give themselves totally to those persons they commit to for life. The married remain faithful as one of many ways of declaring their love for their spouse. And the consecrated remain faithful to their vows. Christianity is not self-centered love. A Christian is called to be “alter Christus”.


Can you and I answer now, who is Jesus for us? The Catechism reminds us that ‘the Church progresses on her pilgrimage amidst the persecutions of the world (temptations of the world) and the consolations of God’ (n. 769). This is the path to follow Christ and to make him known: “Whoever wishes to come after me... take up his cross and follow me” (Mk 8:34). May the Holy Spirit give each of us the gifts and strength to live the Gospel faithfully. God bless you. 


“For if he could die in body, could she not die with him in spirit?” (DO)

యేసు నా రక్షకుడు యెషయా 50:5-9a; యాకోబు 2:14-18; మార్కు 8:27-35 (B 24)

 

యేసు నా రక్షకుడు

యెషయా 50:5-9a; యాకోబు 2:14-18; మార్కు 8:27-35 (B 24)

దుఃఖపు ఖడ్గం ఆమె నిర్దోషి హృదయాన్ని దూసుకెళ్ళిoది (DO)

 

నేటి సువార్త పఠనం మార్కు సువార్తకు కేంద్ర బిందువుగా వుంది. యేసును ఒక పరమ వైద్యుడుగానూ, అద్భుత కార్యకర్తగానూ చూపిస్తూ, తన సర్వోన్నత అధికారాన్ని ప్రతిబింబింప చేస్తుంది మార్కు సువార్త. మార్కు చూపించే యేసు శైలి పరిసయ్యులను గందరగోళంలో పడవేసింది. యేసు కార్యకలాపాలలోని అర్థం అనేకుల విరుద్ధమైన వివరణలకు దారితీసింది. అందుకే యేసు తన శిష్యులను “నన్ను ఎవరని మీరు భావించుచున్నారు?అని అడిగాడు. దేవుని కృపను పొందుకున్నవాడై, “నీవు నిజంగా "దేవుని క్రీస్తువు" - "సజీవుడైన దేవుని కుమారుడవు" (మార్కు 16:16) అని పేతురు యేసుకు సమాధానం ఇచ్చాడు. గ్రీకు పదం "క్రిస్టోస్" లేదా హీబ్రూలో "మెస్సీయ" అంటే "అభిషిక్తుడు" – దిగజారిపోయిన మానవ జాతిని విమోచించడానికి పంపబడిన వాడు (లూకా 9:20, అపో. 2:14-36) అన్న అర్ధాన్ని చూపిస్తుంది.

ప్రజలు తనను గురించి ఏమని భావిస్తున్నారో, ఎలా నిర్వచిస్తున్నారో, ఏవిధమైన స్పష్టతను కలిగి ఉన్నారో అని తెలుసుకోవడానికి యేసు బహుశ: కోరుకొని ఉండవచ్చు. అందుకే ఇటువంటి ప్రశ్న శిష్యులను అడిగాడు యేసు. బాప్తిస్త యోహాను, "రాబోయేది నువ్వేనా లేక మేము మరొకరి కోసం వేచి వుండాలా"? అని అడిగినప్పుడు (మత్త 11:3; లూకా 7:19) యేసు సూటిగా సమాధానం చెప్పలేదు కానీ తన స్వస్థత సంకేతాలను మాత్రమె సూచించాడు. దీనిని మెస్సియా సంకేతాలుగా అర్థం చేసుకోవచ్చు! యేసు, తన శిలువ బాధల యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకొని ఉండడంవల్ల యెషయా గ్రంధంలోని బాధామయ సేవక వాక్యాలను గ్రహించ గలిగాడు. ఆ దీర్ఘదర్శి తనను గురించే ప్రవచనం పలికాడని గ్రహించాడు. దుఃఖ భరితుడైన మెస్సీయా గురించి ఈ విధంగా పలికాడు, నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెండ్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగముమీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొగమును దాచుకొనలేదు” (యెషయా 50:6).

లోక విడుదలకై తాను చేపట్టే రక్షణ కార్యం పట్ల తాను గట్టి విశ్వాసం కలిగి ఉండడం మరియు ఆ కార్యం తన లోక జీవితాన్ని కోరుకుంటుందని యేసు చెప్పడం ప్రారంభించినప్పుడు, పేతురు యేసును మందలించాడు. పేతురు యేసుని అన్యత్వమయిన  మానవ స్వభావాన్నిఅంగీకరించలేకపోయాడు. యేసుకు “నీవు క్రిస్తువు” అని చెప్పడంలో పేతురు ఎటువంటి అభ్యతరం చూపలేదు. కానీ తాను నిజంగా ఎవరో అని యేసు వెల్లడించడం ప్రారంభించినప్పుడు మాత్రం, పేతురు సుస్పష్టంగా అసౌకర్యానికి గురయ్యాడు. నేడు, మనకు "శిలువ లేకుండా, కిరీటం లేదు" అని యేసు చెప్తున్నాడు. గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ ఉండదుగా! అటువంటప్పుడు మనం ప్రతిరోజూ చేపట్టవలసిన "క్రాస్" ఏమిటి?

యేసువలె మనల్ని మనం తగ్గించుకొని ఇతరుల కొరకు శిలువను ఎత్తుకోవడానికి ఆతని చేత పిలువబడ్డాము. అలాగునే మన ప్రతీ దిన చర్య ఇతరులకు దైవీక ప్రాముఖ్యతను కలిగి ఉంటుoదని గ్రహించారా? మచ్చుకు... మనం డ్రగ్స్ తీసుకోవడం లేదా మద్య పానం ద్వారా మనల్ని మనం నాశనం చేసుకోము! ఎందుకు? కేవలం అది ఆత్మగౌరవం కోసం మాత్రమె కాదు. ఆత్మ గౌరవము కూడా ముఖ్యమే! కానీ మన ఆరోగ్యం అవసరమయిన ఇతరులు కూడా మనతో ఉన్నారని గ్రహించాలి. యువకులు వివాహానికి ముందు లైగింక సంబంధానికి దూరంగా ఉండాలన్నది తిరుసభ చట్టం వల్ల కాదు కానీ వారు జీవితాంతం ఎవరితోనైతే కట్టుబడి వుండాలనుకుoటున్నారో, ఆ జీవిత భాగస్వాములకు తమను తాము సంపూర్తిగా ఇచ్చుకోగలరన్నది దీవెనకరమైన నైతికత. వివాహితులు తమ జీవిత భాగస్వామి పట్ల తమ ప్రేమను వెల్లడి చేసే అనేక విధి విధానాలలో పాతివ్రత్యం అన్నది ప్రాముఖ్యత. విరక్తత్వ జీవితాన్ని వ్రతంగా మొదలు పెట్టిన వాళ్ళు దైవానికి పరిపుర్తిగా అంకితమవడం పరోమోన్నతం. అలా క్రైస్తవ మతం అనేది స్వీయ-కేంద్రీకృత ప్రేమ కాదనీ, దైవ-పరోపకార ప్రేమకు అంకితం అన్నదే రోజువారి జీవిత శిలువ. దానిని భరించగలిగినప్పుడే ఒక క్రైస్తవుడు "ఆల్తేర్ క్రీస్తుస్" లేదా “మరొక క్రీస్తు” గా పిలువబడతాడు.

ఇపుడు మీరు, నేను “యేసు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలమా? 'ప్రపంచం యొక్క హింసలు, లోక పూరిత ప్రలోభాలు, లోకాశ శోధనలు మరియు దేవుని ఓదార్పుల మధ్య తిరుసభ తాను ఎప్పుడూ పురోగమిస్తూనే వుంటుంది' (n. 769) అని తిరుసభ సత్యోపదేశం మనకు గుర్తుచేస్తుంది. ఆ మాదిరిన క్రీస్తును అనుసరించడానికి మరియు అతనిని వెల్లడి జేసేందుకు మనకున్న మార్గం: “నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని, తన సిలువను మోసికొని, నన్ను అనుసరింపవలయును"(మార్కు 8:34). మనలో ప్రతీ ఒక్కరo ఈ సువార్తను నమ్మకంగా జీవించడానికి పవిత్రాత్మ తన దీవెన బలాన్ని ఇస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు.

“అతను శరీరంలో చనిపోతే, ఆమె అతనితో పాటు ఆత్మతో చనిపోలేదా?” (DO)

Sunday, 8 September 2024

Be Opened to the Life-Giving Word: Is 35:4-7a; Js 2:1-5; Mk 7:31-37 (B 23)

 

Be Opened to the Life-Giving Word

Is 35:4-7a; Js 2:1-5; Mk 7:31-37 (B 23)

“Today the Virgin is born, tended and formed, and prepared for her role as Mother of God” (DO)

 

Today, the liturgy takes us to contemplate the healing of a deaf-mute man who had a speech impediment” (Mk 7:32). Jesus took him away from the crowd, put his finger into the man’s ears, touched his tongue and looking up to heaven in prayer said in Aramaic, “Ephphathah” meaning “Be opened.” And immediately his ears were opened, his tongue was released, and he spoke plainly (vv 33-35). The Aramaic word, Ephphatha, became part of the Rite of Baptism from the days of the primitive Church to our own times. In one of the rites of the baptism, the priest touching the baby’s ears and mouth and pray, “The Lord Jesus made the deaf hear and the dumb speak. May he soon touch your ears to receive his word, and your mouth to proclaim his faith to the praise and glory of God the Father.”

What is the significance of Jesus putting his fingers into the man’s ears? Gregory the Great, says, “The Spirit is called the finger of God. When the Lord puts his fingers into the ears of the deaf-mute, he was opening the soul of man to faith through the gifts of the Holy Spirit.”  Why did Jesus take the deaf man away from the crowd? To be healed of deafness to the word of God it is needed to distance oneself from the crowds around because the healing encounter with Jesus happens in one’s own heart. Our ears are to receive the Word of God. To do this we have to move away from the distracting crowd. We must have quiet time at least for twenty minutes. We need to focus on what the Lord is saying to us.

Mark wrote his gospel in the times of persecution. In such a situation speaking up for Christ was dangerous. It demanded life. The story of the deaf-mute is apparently aimed at those members of his community who could not bear witness to Jesus. Since they were deaf to the words of Jesus, they had a speech impediment in speaking about him. There is a parallel between the deaf-mute and Jesus’ followers. The deaf-mute can neither hear nor speak properly. The disciples who cannot listen to Jesus will develop an impediment in their proclamation too. They need healing.  Such healing cannot stop from proclaiming Jesus.

Do we realize that we have a speech impediment to the message of Jesus? As individuals and as church we need to come to Jesus for healing. And this can happen in this Eucharistic celebration. Healing is sometimes physical, psychological, but always spiritual too. There are times that we are down on ourselves. We are not happy with ourselves. Do we really have a right to be negative about someone whom the Lord loves? His love, his mercy, his compassion are beyond our understanding. “Ephphatha, be opened!” He heals us because he wants us to be the vehicles of his healing for others.

“The creature is newly prepared to be a divine dwelling place for the Creator” (DO)