పరమాత్ముడా నీవూ...
(The Divine in All Things)
సుర్యుడివి కావు అగ్ని పర్వతానివి కావు
అగ్గివి కావు మంటవు కావు
వెలుగువు కావు నిప్పు కణికవు కావు
వాటిలోని తేజమే నీవు
జలమువు కావు జల ప్రళయమూ కావు
జల ఊటవు కావు జల నిధివి కావు
చలమువు కావు సెల యేటి నీటివి కావు
నిజం దానిలోని జీవ కణమే నీవు
గలివి కావు సుడి గలివి కావు
సంధ్య వాయువు కావు వడి గలివి కావు
పైరు గలివి కావు ఉష్ణ వాయువివి గాకు
ఫ్యాన్ గలివి కావు ఏసీ వాయువు కావు
నిజం వాటిలోని ప్రాణ వాయువే నీవు
భు మివి కావు దాని మీద బురదవివి కావు
ధూళివివి కావు ఇసుక రేణువివి కావు
కొండ వివి కావు రాతివి కావు
ఫేర్తైల్ ల్యాండ్ వి కావు స్లష్ వి కావు
నిజం దానిలోని సారా ని వే నీవు
కనిపించే ఆకాశానివి కావు
కనిపించని శున్యం కావు
తాకాలనిపించే దగ్గరి వివి కావు
చేరుకోలేని దూరానివికావు
విడ్త్ అండ్ డెప్త్ వి కావు
నిజం వాటి భూమికవే నీవు
రంగు వివి కావు రుచివివి కావు
వాసన స్పర్శవివి కావు
ధృష్టివివి కావు దానిలోనితేజము కావు
బిగినింగు టైము వివి కావు ఎండింగు స్పేసువి కావు
నిజం వాటిలోని ప్రాధాన పదార్ధానివే నీవు