AletheiAnveshana: మట్టి మట్టిని నిందించుకుంటుంది సృష్టికర్త కాదు: యెష 43:16-21; ఫిలి 3:8-14; యోహా 8:1-11 (Lent 5/ C)

Saturday, 5 April 2025

మట్టి మట్టిని నిందించుకుంటుంది సృష్టికర్త కాదు: యెష 43:16-21; ఫిలి 3:8-14; యోహా 8:1-11 (Lent 5/ C)



మట్టి మట్టిని నిందించుకుంటుంది సృష్టికర్త కాదు

యెష 43:16-21; ఫిలి 3:8-14; యోహా 8:1-11 (Lent 5/ C)

లోక పాపమును తీసివేయువాడు దేవుని గొర్రెపిల్ల” (Divine Office) 

మాతృ శ్రీసభ ఈ ఐదవ లెంట్ ఆదివారమున దేవుని దయా క్షమాపణ గురించిన పాఠాలను ఇంకా అందిస్తూనే ఉంది. వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని వేద శాస్త్రులు మరియు పరిసయ్యులు యేసు వద్దకు తీసుకువచ్చారు. వ్యభిచారంలో పట్టుబడిన ముగ్గురు స్త్రీలను గురించి మనం సువార్తలలో చూస్తున్నాము. కానీ పరిశుద్ధ సంప్రదాయం ముగ్గురు స్త్రీలలో ఏ స్త్రీ గురించి నేటి సువార్త పేర్కొంటు౦దో విశ్లేషించలేకపోతుంది. యేసుపై ప్రతీకారం విషయంలో పరిసయ్యులు మరియు ధర్మ శాస్త్రులు యేసును "పరీక్షించాలని" ప్రయత్నిస్తున్నట్లు సువార్తికుడు యోహాను వ్రాస్తున్నాడు (యోహాను 8:6). వారు తోరా (పాత నిబంధన మొదటి అయిదు పుస్తకాలు) లో నిర్దేశించిన విధంగా వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్ళతో కొట్టడం ద్వారా మరణశిక్షను అమలు చేయడానికి ప్రయత్నించారు (లేవీ. 20:10; ద్వితీ. 22:22). వారు ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని యేసును తన అనుచరుల దృష్టిలో అప్రతిష్టపాలు చేయడానికి కూడా ప్రయత్నించారు. ఇందుకునీవు ఏం చెప్తావు?” అని యేసును ప్రశ్నిస్తే అందుకు  అవును అని గాని  లేదా కాదు అని గాని  సమాధానం చెప్పకుండా, తన వ్రేలితో నేలపై వ్రాయడం మొదలు పెట్టాడు.

యేసు నేలపై ఏమని వ్రాసి ఉండవచ్చు? గ్రీకు పదం “గ్రాఫీన్” అంటే "వ్రాయు" అనే ప్రామాణిక గ్రీకు పదాన్ని సువార్త ఇక్కడ ఉపయోగించలేదు. కానీ “ఖండించడం” అనే అర్థం వచ్చే సమ్మేళన పదం  “కటా-గ్రాఫీన్” ను  ఉపయోగిస్తుంది. బహుశః  అతను మానవాళికి వ్యతిరేకంగా వున్న కొన్ని సాధారణ పాపాల జాబితాను నేలపై వ్రాస్తూ ఉండవచ్చు (యోబు 13:26). తిరుసభ  చరిత్రకారుడు యూసేబియుస్ -  గొప్ప గొప్ప వ్యక్తులు తెలివైనవి అని భావించే వాటిని గురించి ఊహించే స్వేచ్ఛను కలిగి ఉన్నారని ఎడెస్సా రాజు అబ్గారస్‌కు వ్రాసిన లేఖలో ప్రస్తావిసాడు. ఏదైనా నిర్ణయాత్మక పనిని చేయడానికి జ్ఞానులు  ఆలోచిస్తున్నప్పుడు అది భారవంతమైనప్పుడు దానిని చెప్పడం  కంటే వ్రాయడం చాలా ఉన్నతం అని గ్రోటియస్ పండితుడు చెప్పాడు. జెరోము మరియు అంబ్రోసు వంటి తిరుసభ పితృపాదులు  ఈ దుష్టుల పేర్లు దుమ్ములో వ్రాయబడాలి. మట్టి మట్టిని నిందించుకుంటుంది కానీ తీర్పు నాది" అని  యేసు వ్రాసి యుండవచ్చు అని భావించారు. నిందించడానికైనా లేదా ఖండించడానికైనా తొందర పడకూడదని యేసు మనకు బోధిస్తున్నాడు. ప్రభువు ఈ విషయాన్ని వారి వారి మనస్సాక్షికి వదిలివేస్తున్నాడు. ఏమైనప్పటికీ, పాపం లేని వ్యక్తి మొదటి రాయి వేయాలనే అతని సవాలుకు ఎటువంటి స్పందన తన ప్రత్యర్ధులనుండి రాలేదు. యేసు తన కారుణ్య దయన ఆ స్త్రీని ఖండించనూలేదు లేదా ఆమె చేసినదానికి క్షమించనూలేదు. ఇక పాపం చేయకు” అని ఆమెకు సలహా ఇచ్చినప్పటికీ,  అది ఆమెకు క్షమాపణ మరియు హెచ్చరికగా ముద్రవేసింది.

నేటి మానవ సమాజం స్త్రీల చావైన పాపాన్ని మాత్రమె ఎత్తి చూపిస్తుంది. ఇది విషాదం. కానీ వ్యభిచారి పురుషుడిని గురించి ఈ సమాజం ఎందుకు మాట్లాడదు? స్త్రీ ఖండించబడుతుంది. పురుషుడు స్వేచ్ఛగా విచ్చలవిడిగా తిరుగుతాడు. పురుషులు భయపడలేని లోకంలోని కొన్ని ప్రాంతలల్లో మహిళలు స్వేచ్ఛగా తిరగలేక పోవడం మనం ఇప్పటికీ చూస్తున్నాము. వారిపై జరిగే అత్యాచారం, శారీరక వేధింపులు, అవమానాలు ఊహాత్మకమైనవి కావు. బహుశః అవి అత్యంత లోతుగా పాతుకుపోయిన హింసాత్మక బాధను కలిగించే విధంగా ఏర్పడుతున్నాయి. ఎలాంటి  మతపరమైన వేడుకలలోనైనా లేదా సామాజిక మనస్సాక్షిని పెంచే పనిలోనైనా మహిళల బాధలు మరింత బలంగా, మరింత నిర్దిష్టంగా ప్రతిధ్వనించాల్సిన అవసరం లేదా? మరింత ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదా? అన్నింటికంటే మించి, దుర్వినియోగాలను ఖండించడానికి, ప్రతి అణచివేతకు గురైన స్త్రీకి తెలివైన ప్రభావవంతమైన రక్షణను అందించడానికి మనం దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదా?

నేటి సువార్త ద్వారా మనం తీర్పు చెప్పాలంటే, ఏడు ఘోరమైన పాపాలలో అత్యంత దారుణమైనది కామం కాదు, అహంకారం అని అనిపిస్తుంది. పరిసయ్యుల గర్వ స్వనీతి వైఖరి  దేవుని దయ కోసం అర్ధించవలసిన అవసరం లేదని వారిని ప్రభావితం  చేసింది. ప్రమాదంలో ఉన్న స్త్రీలాగే, మనం మన పాపాలను అంగీకరించి, ఇతరులను ఖండించడం కంటే దయ కోసం ప్రార్థించాలి. మన ఆదర్శాలలో మనం విఫలమైనప్పుడు కూడా, దేవుని దయ పాపికి విస్తరిస్తుందని మనం విశ్వసిస్తున్నాము. ఎందుకంటే మన పాపాలు కూడా మన పట్ల దేవుని శాశ్వత ప్రేమకు ఎటువంటి తేడాను కలిగించవు. పాపులుగా, మనమందరం ఇతరుల పాపాలను తీర్పు తీర్చడానికి అనర్హులం. మన అతిక్రమణలకు దేవునిచే దోషిగా నిర్ధారించబడతాము. అయినప్పటికీ, పాపం లేని మన న్యాయమూర్తి యేసు, పాపులకు తన దయా క్షమాపణను అందిస్తున్నాడు. యేసు కరుణ ద్వారా విమోచించబడిన మనం ఇకపై పాపం చేయకుండా దేవుని ప్రేమా శాంతిలో జీవించమని ఆహ్వానిస్తుంది మన తిరుసభ.

ప్రభువు శిలువ మనకు జీవవృక్షంగా మారింది” ( Divine Office)

 

No comments:

Post a Comment