నమ్మకమైన
పోషక సంరక్షకుడు
2 సమూ 7:4-5a.12-14a.16; రోమ 4:13.16-18; మత్త 1:16.18-21.24a
“విశ్వాసం మరియు క్రియలు కలిసి పనిచేశాయి. అతను చేసిన దాని
ద్వారా అతని విశ్వాసం పరిపూర్ణమైంది” (Divine
Office)
ఎవ్వరికి
ఎటువంటి ప్రత్యేక
కృపలు ఇవ్వబడినప్పటికీ వాటికి సంబంధించి ఒక సాధారణ నియమం ఉంది. ఎవరినైనా దైవానుగ్రహం
తన ప్రత్యేక కృపను పొందుకోవడానికి లేదా ఉన్నతమైన ప్రేశిత కార్యమును చేపట్టడానికి అనుగ్రహించి
ఎంచుకున్నప్పుడల్లా, దేవుడు ఆ పనిని నెరవేర్చడానికిగానూ అవసరమైనన్ని ఆత్మ
బహుమతులతో వారిని అలంకరిస్తాడు.
మన
ప్రభువు సాకుడు తండ్రి, పరోలోక భూలోక రాణి సంరక్షక భర్త, మరియు దేవదూతల స్థానాన్నిమించిన
సింహాసనాన్ని అధిష్టించినటువంటి పునీత జోజప్పగారి విషయంలో కూడా ఈ సాధారణ నియమం ప్రత్యేకంగా
ధృవీకరించబడింది. ఇటువంటి వరానుగ్రహితను మన శాశ్వత పరమ తండ్రి తన గొప్ప సంపదైనటువంటి
తన ఏకైక అద్వితీయ కుమారుడు మరియు కన్య మరియకు నమ్మకమైన సంరక్షకుడుగా
ఎన్నుకున్నాడు. దేవుడు ఆయనను "మంచి నమ్మకమైన సేవకుడా! మీ ప్రభువు ఆనందంలోకి
ప్రవేశించు" అన్న భూలోక అంతిమ క్షణ వర పిలుపు వరకు ఈ ప్రేశిత ధర్మాన్ని పూర్తి విశ్వాసంతో
కొనసాగించాడు యోసేపు.
క్రీస్తు
స్థాపిత సంఘంలో యోసేపు స్థానం ఏమిటి? ఆయన దేవాధి దేవునిచే ఎన్నుకోబడి
రక్షణ చరిత్రలో ఒక ప్రత్యేక పనిని నెరవేర్చడానికిగానూ ఏర్పాటు చేయబడిన కారణజన్ముడు
కాదా?
ఆయన సంరక్షణన క్రీస్తు
సముచితంగా గౌరవప్రదంగా లోకంలోనికి ప్రవేశపెట్టబడ్డాడు. అలాగునే పవిత్ర తిరుసభ కన్య
మరియ తల్లికి రుణపడి ఉంది. ఎందుకంటే ఆమె ద్వారా క్రీస్తును స్వీకరించడానికి తిరుసభ
అర్హమైనదిగా నిర్ణయించబడింది. కానీ ఆమె తర్వాత మనం నిస్సందేహంగా పునీత జోసెఫ్ వారికి
మాత్రమె ప్రత్యేక కృతజ్ఞతా గౌరవ వందనాన్ని
ఇవ్వడంలో రుణపడి ఉన్నామని మర్చిపోకూడదు.
మరో
గమనించదగ్గ విషయం ఏమిటంటే - పాత నిబంధనాల వాగ్ధాన పరిపూర్ణతా మార్గ ముఖతేజస్సు తన కుటుంబ
పర్యవేక్షణా విధానంలో ఆయన అనుసరించిన విధానమే! పాత నిబంధనలోని పితృస్వామ్యులు,
ప్రవక్తల గొప్ప ప్రవచనాల వాగ్దానాన్ని నెరవేర్చుటకు వచ్చే భగవంతుని మార్గ రక్షకునిగా
కన్పిస్తున్నాడు జోజప్పగారు. వాగ్దానంగా ప్రవక్తలకు అందించబడిన దైవిక వెలుగును ఆయన
తన చేతుల్లో పట్టుకొని లాలించాడు పాలక జోజప్ప గారు. అది ఎన్ని నోముల పంట!
అందుచేతనే
తన భూలోక శారీరక దినములలో కుమారునిగా తనకు ఇచ్చిన సాన్నిహిత్యం, శ్రద్ధాభక్తుల వల్ల తన సాకుడు తండ్రి యోసేపుకు ఉన్నతమైన గౌరవాన్ని బహుకరించడంలో
వెనుకంజ వేయలేడు క్రీస్తు ప్రభువు. కాబట్టి నజరేతులో తనకు సమకూర్చినవన్నీటికి
బదులుగా పరలోకంలో తన సాకుడు తండ్రికి పరిపూర్తిగా
బహుకరించాడని సుస్పష్టంగా మనం నమ్మాలి. చెప్పుకోవాలి.
పునీత జోసెఫ్
వారితో “నీ ప్రభువు ఆనందంలోకి ప్రవేశించు” అని ప్రభువు పలికిన మాటలు సముచితమైనట్లుగా
మనం ఇప్పుడు అర్ధంచేసుకోవచ్చు కదా! వాస్తవానికి, కడన ఒక భక్తుని శాశ్వత ఆనందంలోని
ఆనందం తన ఆత్మలోకి ప్రవేశిస్తుంది. కానీ ప్రత్యేకంగా ప్రభువు
జోసెఫ్ వారితో “ఆనందంలోకి ప్రవేశించు” అని చెపుతూ ఆహ్వానం పలికి ఉండి వుండవచ్చు
అని మనం నమ్ముతున్నాము. ఆ పదాలలో దాగి ఉన్న ఆధ్యాత్మిక పరమార్థాన్ని మన నుండి దాగి
ఉండాలనేది ఆయన మహిమ ఉద్దేశ్యం. ఈ పవిత్ర వ్యక్తి అంతర్గత ఆనందాన్ని మాత్రమే కలిగి
ఉన్నాడని కాకుండా, అది అతని చుట్టూ ఒక మహిమా కిరీటమై సర్వలోకాల్లో అతన్ని కొనియాడుతుందని కూడా తెలియజేస్తుంది.
పునీత
జోజప్ప గారా! మమ్ములను
జ్ఞాపకపరచుకొనండి. మా కోసం మీ సాకుడు
బిడ్డను వేడుకోండి. మీ అత్యంత పవిత్ర కన్య వధువు, మరియను మమ్మల్ని దయతో
చూడమని అడగండి. ఎందుకంటే
ఆమె – తన తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో శాశ్వతంగా జీవించి పరిపాలించే మహా తల్లి.
ఆమెన్.
“దేవుడు
నన్ను రాజుకు తండ్రిగాను,
అతని
ఇంటివారందరిపై ప్రభువుగాను నియమించాడు” (Divine
Office)
No comments:
Post a Comment