AletheiAnveshana: నీతి సూర్యుడు : ఆది 15:5-12,17-18; ఫిలి 3:17-4:1; లూకా 9:28b-36 (తపః కాలము 2 / C)

Saturday, 15 March 2025

నీతి సూర్యుడు : ఆది 15:5-12,17-18; ఫిలి 3:17-4:1; లూకా 9:28b-36 (తపః కాలము 2 / C)

 

నీతి సూర్యుడు

ఆది 15:5-12,17-18; ఫిలి 3:17-4:1; లూకా 9:28b-36 (తపః కాలము  2 / C)

"ప్రభువు ఎడారిలో వారిని నడిపించడానికి మేఘ స్తంభంవలే వారి ముందు వెళ్ళాడు" (Divine Office)

తపస్సు కాల రెండవ ఆదివారమున మనము యేసు దివ్య రూపధారణ గురించి వింటున్నాము. యేసు రూపాంతరం అతని పాస్క రహస్యాన్ని ప్రవచిస్తుంది. సువార్తికుడు లూకా దీనిని యేసు నిర్గమంగా వర్ణించాడు. యేసు శ్రమలు, మరణం మరియు పునరుత్థానాన్ని ఈజిప్టు నుండి విడిపింపబడి ఎడారిలో ప్రయాణించిన ఇశ్రాయేలీయుల నిర్గమంతో అనుసంధానిస్తున్నాడు. అందుచేతనే  "ఆయన యెరూషలేములో సాధించబోయే నిర్గమ" (లూకా 9:31) అని లూకా వ్రాస్తున్నాడు. ఇశ్రాయేలు చరిత్ర హృదయంలో నిర్వహించబడే దేవుని ప్రణాళికను వ్యక్తపరిచే సంకేతం. యేసు రూపాంతర సంఘటనలో తన సన్నిహిత ప్రార్థన జీవితాన్ని మరియు తన మహిమను గురించి,  "యేసు (...) ప్రార్థన చేయడానికి పర్వతం పైకి వెళ్ళాడు" (లూకా 9:28) మరియు ప్రార్ధనా సమయంలో ఆయన దివ్య రూప ధారణ పొందుకున్నాడని (లూకా 9:29) వ్రాస్తూ తన ప్రార్థన జీవితాన్ని బలంగా నొక్కి చెప్పేది సువార్తికుడు లూకా మాత్రమె. దీక్షా కాలం అనేది ఆధ్యాత్మిక పంట కాలం. ప్రార్థన కోసం ఒక ప్రత్యేక సమయాన్ని సృష్టించడానికి మనకు ఒక చక్కటి అవకాశాన్ని కల్పించేది ఈ వరాల కాలమే. ప్రార్థన ద్వారా మాత్రమే మనం రూపాంతరం చెందగలము. అలాగునే లోకాన్ని కూడా మనం రూపాంతరం చెందించగలము. ప్రార్థన ద్వారా మనం  అనేక సంక్లిష్ట సంబంధాలను రూపాంతరం చెందించవచ్చు. ప్రార్థనా జీవితం వివాహాబంధాలను, కుటుంబాలను, వ్యవహారాలను, సమాజాలను, చివరకు విరక్తత్వ అంకిత జీవితాలను సహితం రూపాంతరం చెందించగలదు.

దేవుడు తన మహిమను మనతో పంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడు! యేసు పర్వతంపై రూపాంతరం చెందినప్పుడు తన ముఖం తేజోవంతంగా మారిపోయింది మరియు ఆయన దుస్తులు తెల్లగా మారాయి (మార్కు 9:2,3). ప్రభువైన యేసు తన మహిమను మనం చూడాలని మాత్రమే కాకుండా, తన మహిమను మనతో పంచుకోవాలని కూడా కోరుకుంటున్నాడు. నన్ను అనుసరించండి. నా మాటలను పాటించండి. నేను మీ కోసం ఎంచుకున్న మార్గాన్ని తీసుకోండి.  మీరు నా తండ్రి రాజ్యపు ఆశీర్వాదాలను పొందుతారు. ఇలా పాటించినట్లయితే మీ పేరు పరలోకంలో వ్రాయబడుతుందని తండ్రి మహిమకు యేసు మనకు మార్గాన్ని చూపుతున్నాడు.

మనం ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నందున దేవుని మహిమను మరియు దాని కార్యమును మనం ఎంతగా కోల్పోతున్నాము! మన మనస్సులను దేవుని విషయాల పట్ల నిద్రపోయేలా చేసే అనేక విషయాలు ఉన్నాయి:  మానసిక బద్ధకం, జారత్వం మరియు క్రమ బద్ధత లేని జీవితం. అవి మనలను దైవీక  విషయాలను ఆలోచించనివ్వకుండా, మన సందేహాలను మరియు ప్రశ్నలను ఎదుర్కోననివ్వకుండా చేస్తుంది. సుఖ జీవితం క్రీస్తు సవాలుతో కూడిన డిమాండ్లను పరిగణించకుండా మనలను అడ్డుకుంటుంది. నీ కొరకై అసూయా పరుడైన పక్షపాత  ప్రభువు నీ కోసం కలిగి ఉన్న కొత్తప్రణాళికను చూడనివ్వకుండా అంధులుగా చేస్తుంది. దేవుని మహిమ కోసం మనం దానిని పొందే౦త వరకు మన విచారం కూడా ఒక అడ్డంకిగానే మిగిలిపోతుంది.

పితృ పాదుడు మరియు పరిశుద్ధ గ్రంధ పండితుడు ఓరిజిను (క్రీ.శ. 185-254) ఇలా వ్రాశాడు, “మనం రూపాంతరం చెందినప్పుడు, మనం ఇకపై చీకటి లేదా రాత్రి బిడ్డలుగా ఉండము. పగటి కుమారులు అవుతాము మరియు యేసు నీతి సూర్యుడిగా మారినట్లే నిత్యం నిజాయితీగా నడుస్తాము. ఆజ్ఞలను పాటించడం లేదా కష్టాలను భరించడం విషయానికి వస్తే, తండ్రి పలికిన మాటలు ఎల్లప్పుడూ మన చెవుల్లో  “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను సంతోషిస్తున్నాను; ఈయన మాట వినండి” అని ప్రతిధ్వనించాలి.

 

మీ హృదయాలను కఠినపరచుకోకండి” (Divine Office)

No comments:

Post a Comment