దేవుని వలలో చిక్కిన వారు ధన్యులు
6:1-2a,3-8; 1
కొరింథీ 15:1-11; లూకా
5:1-11 (5 C)
“నేను
ఎవని పంపెదను? మా
నిమిత్తము ఎవడు పోవును? చిత్తగించుము. నేనున్నాను”
గెన్నేసరెతు సరస్సులో
యేసు శిష్యుల చేపల వేట సారాంశం సారూప్య సువార్తలలో చెప్పబడింది. అయితే లూకా మాత్రమే పేతురును ఒక నమ్మదగ్గ శిష్యునిగానూ
పాపిగానూ చూపించే సన్నివేశాన్ని చిత్రించాడు. అసాధారణమైనన్ని చేపలను వలలో పట్టుకున్నప్పుడు పేతురు తన బలహీనతవు అయోగ్యతను గుర్తించిన్నట్లు లూకా వ్యక్త పరిచాడు. ఆ భావాన్ని “ప్రభూ, నన్ను
విడిచిపెట్టు, ఎందుకంటే నేను పాపాత్ముడిని" (లూకా 5:8) అన్న మాటల్లో చూపించాడు. క్షమాపణా గుణశైలిని మరియు అంగీకార మనస్తత్వానికి
అద్దం పట్టే సందేశాన్ని పాపులు బాగా అర్థం చేసుకుంటారననీ, అందువల్లనే యేసు తన
సహవాసంలో పాపులను, అసమర్ధులను, అయోగ్యులను శిష్యులుగా స్వీకరించాడని లూకా తన
సువార్తలో బయలు పరుస్తున్నాడు.
లియోన్స్ అను ప్రాంతపు పునీత ఇరేనియుడు పాపమునకున్న
గుణాన్ని, దాని బోధనాపరమైన అంశాన్ని కనుగొన్నాడు. పాపపు స్వభావం దాని బలహీనతను
గురించి తెలిసిన వారు తమ స్థితిని పురుగులాంటి జీవిగానూ మరియు ఆ జీవి కంటే సర్వ సృష్టికర్త
మాత్రమె గొప్పవాడుగా గుర్తించగలరని తన బోధనలో చెప్పాడు. దేవుని ఉద్దేశ్యం ధర్మం
లేదా యోగ్యతపై ఆధారపడి ఉండదు! పొరుగువారికి తన ప్రేమపూర్వక సేవలో
పాలుపంచుకోవడానికి మనల్ని పిలిచే ముందు మనం యోగ్యులమా అని లేదా మన అర్హతను గుణించి
గణించడు. దాని కోసం ఎదురు చూడడు యేసు! అది నిజమే! మన అనర్హత గుర్తింపు క్రీస్తు మన ద్వారా పనిచేయడానికి ఒక
ప్రారంభాన్ని సృష్టిస్తుంది. పేతురువలే మనం కూడా యేసుతో కలిసి పనిచేయడానికి పిలువబడితే, ఈ లోక తుఫాను జలాల కెరటాల మధ్య గాయపడి వైద్యం చేసేవారిగా మనం
బోధించే వాటిని ఆచరించడానికి కూడా ప్రయత్నిస్తాము. సువార్త ప్రబోధనా ఫలాలను అందించే ఒక మంచి సముద్ర వేట కోసం ప్రవాహాలకు
వ్యతిరేకంగా ఈదడానికి ప్రయత్ని౦చ గలుగుతాము.
మనము కూడా దేవుని వలలో చిక్కుకోబడాలి. లోపాలతో కూడిన జీవితం, అంగీకార మనస్తత్వం, నిరీక్షణ వాగ్దానాన్ని ఆ యేసు వలలో మాత్రమె చూడగలము.
మత్తయి మరియు యోహాను సువార్తలు పేతురు వలలో వివిధ రకాల చేపలు పడినట్లు వివరిస్తున్నాయి. అలాగునే, నేడు
యేసు వల కంటే, వివిధ వినియోగదారులు (కన్స్యూమర్) మరియు వారి కృత్రిమ
అవసరాల వలలు మనలను సులభంగా ఆకర్షిస్తున్నాయి. మానవ మరియు ఆధ్యాత్మిక విలువలకు
విఘాతం కలిగించే విధంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థ, దాని బాహ్య భూటకపు ప్రలోభంపై ప్రత్యేక దృష్టి సారించే
అవినీతి విజయం గురించి ఏమని ఆలోచించాలి? అలాగే, డ్రగ్స్ మరియు ఆల్కహాల్ సంస్కృతుల వల, మరియు జీవితపు అర్ధాన్ని కోల్పోతున్న వారి నిరాశ, ఆత్మహత్యల వల సంగతి ఏమిటి! పాపులను వెదకి వారిని క్షేమంగా పరలోక
ఇంటికి చేర్చడానికి వచ్చిన యేసు మనస్సు మనకు గుర్తుకు రావాలి కదా? అతనికి వంద
గొర్రెలు ఉంటే, ఒకటి తప్పుదారి పట్టినట్లయితే, అతను తొంభైతొమ్మిది౦టిని విడిచిపెట్టి తప్పిపోయిన దాని వెంట
వెళ్ళేవాడు గదా! పరిశుద్ధ పోపు గారు ప్రకటించిన జూబ్లీ సంవత్సరానికి ఈ సందేశం
ప్రధానమైనది కదా!!!
పాపిని వాని పాపమును మన వలతో పట్టుకోవడానికి మన బలం
సరిపోదు. మనలను ఎన్నటికీ ఒంటరిగా విడిచిపెట్టని దేవుని వాక్యాన్ని విశ్వసించూదాం.
పేతురు , “బోధకుడా! మేము
రాత్రంతా కష్టపడి ఏమీ పట్టుకోలేదు, కానీ
మీ ఆజ్ఞ ప్రకారం నేను వలలు దించుతాను" (లూకా 5:5) అని అన్నాడు. నిజమే మన విర్క్తత్వ మరియు జీవితాంత ప్రకటన కష్టార్జితం
సరిపోదేమో!! దయగల గుణదల లూర్దు మాత మనకు తన నిత్య సహాయాన్ని మన పరిచర్యలో
అందిస్తుంది. కానాలో జరిగిన వివాహ వేడుకలో మరియ తల్లి మాటలు “ఆయన మీకు ఏది చెబితే
అది చేయండి!” (యోహాను 2:5) అన్న ప్రోతాహిక మాటలు పేతురి ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. మనము
జీవించే, బోధించే సువార్త ప్రకటనానందానికి సాక్ష్యమిచ్చే విధానంగా మరయు
మనలో క్రీస్తు వెలుగును పాపాత్ముడు చూడాలనే ప్రభు చిత్తం కోరుకున్న విధంగా నమ్మకంగా
వుందాం.
“ప్రభువు శిలువ మనకు జీవ వృక్షంగా మారింది” (Divine Office)
No comments:
Post a Comment