విమోచకుడు
నెహే 8:2-4a,5-6,8-10;
1 కొరింథీ 12:12-30;
లూకా 1:1-4; 4:14-21 ( 3 సి)
"..
ప్రతీ అర్చన వేడుక, యాజకుడు క్రీస్తు శరీర క్రియ. ఇది క్రీస్తు
సంఘం" ( Divine Office)
లూకా సువార్తకుడు
తన సువార్త ప్రారంభ వచనాలలో సువార
ఉద్దేశ్యాన్ని చాలా చక్కగా స్థాపించాడు. అతని గ్రంథస్త శైలి మెరుగుపెట్టిన గ్రీకు
మరియు రోమను సాహిత్యానికి విలక్షణమైనది. లూకా తన సువార్తను “థియోఫిలస్”
(లూకా 1:3) అనే పేరుగల వ్యక్తికి వ్రాసి ఉండవచ్చు!
ఈ “థియోఫిలస్”
అనే వ్యక్తీ చరిత్రలో వున్నవాడా అనేది పరిశుద్ధ వేద పండితుల్లో నిలిచిపోయిన చాలా
పెద్ద ప్రశ్న! నిజానికి గ్రీకు పదం “థియోఫిలస్” అంటే “దేవుని ప్రియమైనవాడు” అని
అర్ధం. దీని అర్థం బట్టి చూస్తే ఆ “థియోఫిలస్” ఎవరో కాదు - అది “దేవుని ప్రియమైన
వాడ”యిన నువ్వు నేను అని మన గ్రహింపుకు తెలుస్తుంది. కాబట్టి లూకా సువార్తికుడు
దేవుణ్ణి ప్రేమించే మరియు ప్రేమించ ఆశ పడే వారందరికీ తన సువార్తను వ్రాస్తున్నాడు.
నజరేయుడైన యేసును గురించిన "సత్యాన్ని తెలుసుకోవాలని" తన పాఠకులను (లూకా
1:4) కోరుకున్నాడు లూకా. యేసు తన బహిరంగ పరిచర్యను
ప్రారంభించినప్పుడు అతని వయస్సు దాదాపు 30
సంవత్సరాలు అని లూకా మనకు చెప్తున్నాడు (లూకా 3:23). యేసు యోర్దాను
నదిలో బాప్తిస్మం స్వీకరించిన వెంటనే (లూకా 3:21-22) సైతానుచే
శోదించబడటానికి ఆత్మచేత (లూకా 4:1) అరణ్యంలోకి నడిపించబడినాడు
(లూకా 4:1). ఆధ్యాత్మిక పరీక్షా కాలం ముగింపులో, యెషయా ప్రవక్త ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు తన బహిరంగ
పరిచర్యను గలిలయలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు కూడా లూకా మనకు తెలియజేస్తున్నాడు
(యేష 9:1,2).
మెస్సీయ "శుభవార్త"ను బోధిస్తాడనీ, అణచివేయబడిన
వారందరికీ స్వస్థత మరియు స్వేచ్ఛను తీసుకోస్తాడని యెషయా ప్రవచించాడు (Is 61:1-2). తదనుగుణంగా, దేవుడు
పంపిన మెస్సీయ తన “వ్యక్తి” లో నెరవేర్చిన ఆతని వాగ్దానాలపై వారి నిరీక్షణను
మేల్కొల్పాడు. దేవుని ఆత్మ అనేది యేసును నడిపించే ప్రేరణగానూ, పేదల వద్దకు పంపించడం, అతని
జీవితమంతా అవసరమైన, అణచివేయబడిన, అవమానించబడిన వారి వైపు మళ్లించడం. హిబ్రూ
భాషన వీరందరిని ఒక్క మాటలో చెప్పాలంటే “అనావిం” అని చెప్పాలి. నేడు ఈ “అనావిం” మన
మధ్యన చాలనే వున్నారు. "సువార్త" అనే పదానికి అక్షరాలా
"శుభవార్త" అని అర్థం. ఈ రోజు దానిని అంగీకరించే వారందరికి స్వేచ్ఛను మరియు మార్పు తీసుకురావడానికి ఇది
సర్వశక్తిమంతమై, దయగలిగిన జీవాన్ని
ఇచ్చే శక్తిగా ఉంది.
"పేదలకు సువార్త బోధించబడినప్పుడు (లూకా 4,18),
అది క్రీస్తు ఉనికికి సంకేతం"గా వుంటుంది
(CCC 2443) అని మాతృ
శ్రీసభ అర్థం చేసుకుంటుంది. తిరుసభ తాడిత పీడిత జనుల వైపు కొమ్ము కాస్తుంది. 'పేదల ఎంపిక' (ఆప్షన్ ఫర్ ది పువర్) అనే అంశాన్ని
ద్వితీయ వాటికను మహా సభ కనుగొనలేదు. ఇది దేవుని ఎంపిక.
అతను దానిని యేసు “భూలోక శరీర రోజుల్లో” తన జీవితమంతా శ్వాసించాడు. నవ నవ్య వృద్ధి సాంకేతిక
సమాజంలో దారిద్రియ రేఖన ఇంకా అణగారియున్న జనులను, సమాజంనుండి
మినహాయింపబడిన వారిని రక్షించడానికి, వారికి మన సంఘీభావం తెలియచేయకపోతే, యేసుక్రీస్తువలె జీవించడం లేదా ఆతనిని ప్రకటించడం అనేది అసలు సాధ్యమే కాదు. మన పోరు
వారి పక్షాన లేకపోతె మనం ఏం సువార్తను ప్రకటిస్తున్నాము? మనం ఏ యేసును అనుసరిస్తున్నాము? ఈరోజు వివిధ రకాలైన వివక్షను ఎదుర్కొనేవారు,
సమాజ పొలిమేర చూపులతో చూడబడి బాధపడేవారు యేసు విమోచకుడని అర్థం చేసుకొన శక్తిని
వారికి ఇవ్వ లేకపోతే మనం ఏ ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తున్నాము? ఎటువంటి క్రీస్తు సంస్కరణలను వెలుగులోకి
తెస్తున్నాము?
పునీత పౌలుడు ఇలా అంటాడు, "అవయవములు అనేకములైనను శరీరమొక్కటే. శరీరము ఏలాగున అనేకమైన అవయవములను కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను
ఒక్కశరీరమై యున్నదో...శరీరంలోని ఏదైనా అవయవం ‘నాకు నీ అవసరం లేదు’ అని మరొకరితో చెప్పగలదా, ... ఒక అవయవం బాధపడితే, అందరూ కలిసి బాధపడతారు. ఒక సభ్యుడు గౌరవించబడినట్లయితే, అందరూ సంతోషిస్తారు” (1 కొరింథీ 12:20-23). ప్రభువైన యేసు నేడు మనలో ప్రతి ఒక్కరితో ఇలాగునే మాట్లాడుతున్నాడు.
అతను మనకు స్వస్థత, పునరుద్ధరణ, క్షమాపణ మరియు పాపం, నిరాశ, నిస్సహాయత,
విధ్వంసం, వివిధ రకాలైన అణచివేతల నుండి విముక్తిని తెస్తాడు. ప్రభువు తనను
విశ్వసించి, తన
కృపకు వాహినిగా మారడానికి ప్రయత్నించే మనందరిపై తన ఆత్మను కుమ్మరించడాన్ని ఎప్పటికి
తిరస్కరించడు. సువార్త ఆనందాన్ని నమ్మకమైన విశ్వాసంతో, సంతోషకరమైన నిరీక్షణతో ఋజువర్తన ప్రేమతో ప్రతిరోజూ జీవించే
స్వేచ్ఛను పునరుద్ధరించమని ప్రభువైన యేసును అడుగుదాం.
“ప్రభూ, నీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం, అల్లెలూయా” (Divine Office)
No comments:
Post a Comment