“భయపడకుము, మరియ నీవు దేవుని కృపను పొందుకున్నావు”
ఓ కన్యకా! నీ ధన్యతతో ప్రకృతి అంతా ధన్యత పొందింది! (Divine Office)
పునీత అన్సేల్మి
మహిమోపేత స్త్రీ! ఆకాశ నక్షత్రాలు, భూమి నదులు, పగలు రాత్రి – మానవ శక్తికి లోబడి తన స్వాధీనంలో ఉన్న
ప్రతిదీ - తాము కోల్పోయిన అందాన్ని నీ ద్వారా తిరిగి పొందుకోవడంతో వివరించలేనంత నూతన
కృపను పొందుకొని ఉన్నాయని సంతోషించు!! సర్వసృష్టి అందులోని సర్వ జీవులు మరియు సృష్టింపబడిన మానవులు దేవుని స్తుతికి
పనికిరావన్న విధంగా చనిపోయాయి. లోకం తన విధికి విరుద్ధంగానూ, విగ్రహాలకు సేవ చేసే మనుష్యుల క్రియల ద్వారా చెడిపోయి
కలుషితమైంది. కానీ ఇప్పుడు ఈ లోకం దేవుణ్ణి విశ్వసించే మనుష్యులచే నియంత్రించబడి, రూపాంతరం చెంది పోగొట్టుకున్న ఆశోభను తిరిగి పొందుకుంటున్నందుకు సృష్టి సంతోషిస్తుంది. సృష్టి అంతా
తిరిగి జీవం పోసుకుంది.
విశ్వమంతా అనిర్వచనీయమైన నూతన ప్రేమతో ఆనందిస్తుంది. కంటికి
కనిపించని తన సృష్టికర్త దేవుని ఉనికిని అనుభూతి చెందడమే కాకుండా అతనిని కనులారా చూస్తుంది.
విశ్వమంతా పవిత్ర పరచబడింది. ఈ గొప్ప ఆశీర్వాదాలు కన్య మరియ గర్భ ఆశీర్వాద
ఫలం నుండే పుట్టుకొచ్చాయి. నీకు ఇవ్వబడిన కృపా సంపూర్ణత ద్వారా, చనిపోయిన జీవ రాశులన్నీ తమ తమ స్వేచ్చానుసారంగా సంతోషిస్తున్నాయి. పరలోకంలో ఉన్నవారు కూడా
క్రొత్తతనమును పొందుకున్నందుకు సంతోషిస్తున్నారు. నీ కన్యత్వ గర్భానికి
మహిమాన్వితమైన ఫలంగా ఉన్న అద్వితీయ కుమారుడు, తన ప్రాణాన్ని ఫణంగా పెట్టె కాలం ముందునాటికి మరణించిన వారి
ఆత్మలు బందిఖానా నుండి విముక్తి పొందినందుకు సంతోషిస్తున్నారు. దేవదూతలు తమ
ఛిద్రమైన స్థల పునరుద్ధరణకు సంతోషిసున్నారు.
పరిపూర్ణ అనుగ్రహంతో పొంగిపొర్లుతున్న స్త్రీ! నీ
సమృద్ధి వరం నుండి సమస్త సృష్టి కొత్త జీవితాన్ని పొందుతుంది. సమస్త జీవుల కంటే మిన్నగా ఆశీర్వదింపబడిన కన్యకా!
నీ
ఆశీర్వాదం ద్వారా సమస్త సృష్టి
ఆశీర్వదించబడింది. సృష్టికర్త చేత సృష్టింపబడిన సృష్టి మాత్రమే కాకుండా, నీ ధన్యత వలన అదే సమస్త సృష్టి చేత సృష్టికర్త కూడా ఆశీర్వదించబడ్డాడు.
దేవుడు తాను
ప్రేమించే తన అద్వితీయ కుమారుణ్ణి మరియకు ఇచ్చాడు. మరియ ద్వారా దేవుడు తనను తాను ఒక కుమారునిగా మలచుకున్నాడు.
సృష్టికి భిన్నంగా కాకుండా ఏక స్వభావంలో దేవుని కుమారునిగానూ మరియు మరియ కుమారునిగా మలచుకున్నాడు.
విశ్వమంతా భగవంతునిచే సృష్టించబడితే అదే దేవుడు మరియ నుండి జన్మించాడు. దేవుడు
అన్నిటినీ సృష్టించాడు. మరియ దేవునికి జన్మనిచ్చింది. అన్నిటినీ
సృష్టించిన దేవుడు మరియ ద్వారా తన రూపాన్ని ఇచ్చి అతను తన స్వంత సృష్టిని చేసుకున్నాడు.
శూన్యం నుండి అన్నిటినీ సృష్టించగలిగిన దేవుడు మరియ లేకుండా తన శిధిలమైన సృష్టిని
పునర్నిర్మించలేక పోయాడు.
అప్పుడు
దేవుడు సృష్టించబడిన లోకానికి తండ్రి అయితే తిరిగి పునఃరుద్దరించబడిన
సృష్టికి మరియ తల్లి. దేవుడు అన్నిటికీ జీవం పోసిన తండ్రి అయితే మరియ తల్లి ద్వారా అన్నింటికీ కొత్త జీవితాన్ని ఇచ్చాడు ఆ
దేవుడు. ఎందుకంటే దేవుడు కుమారుణ్ణి పుట్టించాడు. అతని ద్వారా సమస్తాన్ని పునఃరుద్దరించాడు. మరియ అతనిని విశ్వ రక్షకునిగా జన్మనిచ్చింది.
దేవుని కుమారుడు లేకుండా ఏ జీవి లేదా పదార్ధమునకు అస్తిత్వం లేదు. మరియ కుమారుడు లేకుండా ఏదీ విమోచించబడదు. నిజంగా ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు. ప్రకృతి అంతా మళ్ళి తనకు తానుగా దేవునకే రుణ పడియున్నట్లు మీకునూ రుణపడి ఉండాలని ప్రభువు అనుగ్రహించాడు.
"ఈ రోజు నుండి అన్ని తరాలు నన్ను ధన్యురాలని అని పిలుస్తారు;* అతని ప్రేమ నాకు గొప్పది". (Divine Office)
No comments:
Post a Comment