మన దేవుడు వచ్చి మనలను రక్షిస్తాడు
బారూకు 5:1-9;
ఫిలిప్పి 1:4-6,8-11;
లూకా 3:1-6 (ఆగమన C 2)
“ఇదిగో, గొఱ్ఱెపిల్ల. చాలా
కాలంగా ఎదురుచూస్తున్నది. క్షమాపణతో స్వర్గం నుండి క్రిందికి వచ్చింది” (Divine Office)
ఈ వారం మరియు తదుపరి వారం సువార్త పఠనాలు యేసు రాకడ
గురించిన బాప్తిస్మ యోహాను ఎడారి ప్రసగాలను ప్రస్తావిస్తున్నాయి. బాప్తిస్మ యోహాను
బహుముఖ ప్రవక్తల సంప్రదాయంలో మనకు కనిపిస్తాడు. ఇజ్రాయెలు ప్రజలకు పశ్చాత్తాపం మరియు సంస్కరణను బోధించాడు.
పశ్చాత్తాపం చెందిన వాళ్ళ పాప క్షమాపణ కోసం
బాప్తిస్మము ఇస్తూ, యేసు మోక్ష మార్గాన్ని అతను సిద్ధం చేశాడు. నేడు, దేవుడు తన జీవ వాక్యాన్ని బాప్తిస్మ యోహాను ద్వారా మనకు తెలియ
చేస్తున్నాడు. మన జోర్దాను నది నేటి దివ్య పుజాబలి సంస్కారము కావచ్చు. ఇది పోపు
ఫ్రాన్సిసు చేసిన ఒక ట్వీట్ కుడా కావచ్చు! తన ట్వీట్లో
"క్రైస్తవ సాక్ష్యపు కంటెంటు అనేది ఒక వ్యాస రచన కాదు. దాని కంటే మిన్న అయినది యేసు-వ్యక్తి. పునరుత్థానమైన
క్రీస్తు, సజీవుడు అందరి ఏకైక రక్షకుడు" అని మనకు గుర్తు చేస్తున్నాడు.
క్రీస్తు ఒక వ్యాస రచన కానందున దేవుడు మన
జీవిత కథలోకి ప్రవేశించాడు. యేసు క్రీస్తు అంటే ఒక ఆధ్యాత్మిక అభ్యాసం, దాతృత్వం మరియు కరుణ.
పూరించడానికి మనలో మనకు అనేక లోయలు ఉన్నాయి. నునుపు చేయడానికి మనలో అనేక కరకు తావులు ఉన్నాయి. అలాగునే
తొలగించడానికి అనేక గర్వ పర్వతాలు ఉన్నాయి. మనం దేవుని దయపై ఆధారపడినట్లయితే, వాటిని సరిచేయడానికి అవసరమైన మార్గాలలో లోటు ఉండదు! మన
ప్రభువు దాపున మనం నివసించినట్లయితే ఆతని కొరకు మనం ఒక బారుకు ప్రవక్త లాగున, ఒక బాప్తిస్మ యోహాను లాగున ఉండగలుగుతాము. ఆయన సాక్షులుగా
ఉండడానికి మనం పిలువబడ్డాము. శరీరానికి ఆత్మ ఎలా దీపంగా ఉంటుందో, లోకానికి క్రైస్తవులు కూడా అలాగునే వుంటారు. ఒక వేద
పండితుడు, “మనం జీవిస్తున్న లోకాన్ని మన హృదయంతో ప్రేమించాలి. సృష్టిని దాని
మూలకాలను, ప్రతీ ఆకును, ప్రతీ
కాంతి పుంజంను, జంతువులను, మొక్కలను సంపూర్ణంగా ప్రేమించాలి. వాటిని ప్రేమిస్తున్నప్పుడు, వాటి దైవిక రహస్యాన్ని మనం అర్థం చేసుకోగలము. దీనిని అర్థం
చేసుకున్న తర్వాత మాత్రమె మనం విశ్వవ్యాప్తంగా మొత్తం ప్రపంచాన్ని ప్రేమించగలుగుతాము”
అని అంటాడు.
పునీత బాప్తిస్మ యోహాను పిలుపు "అతని మార్గాలను
సరిదిద్దండి" అనేది కొత్తదేమీ కాదు. అనేక శతాబ్దాల క్రితమే బరూకు ప్రవక్త
కూడా: “ఇశ్రాయేలీయులు దేవుని మహిమలో సురక్షితంగా పురోగమించేలా ప్రతీ ఎత్తైన
పర్వతాన్ని మరియు పురాతనమైన కొండలను తగ్గించాలని, లోయలు సమతలంగా ఉండేలా లోయలను నింపాలని దేవుడు ఆజ్ఞాపించాడు”
(బారుకు 5:7) అని ఇలాగే ప్రవచించాడు. ఈ ప్రవక్తలు మనకు అదే హెచ్చరికను
ఇస్తున్నారు. ఇశ్రాయేలీయులు దేవుని వాక్కును విన్నారు.
యెహోవా సీయోను బందీలను తిరిగి వచ్చేలా చేశాడు. అహంకారపు కొండలు మరియు వెచ్చదనం
లేని లోయల వంటి అడ్డంకులను మనం తిరస్కరించినట్లయితే, ఆనంద బాష్పాలతో: “యెహోవా మనకు గొప్ప పనులు చేసాడు; ఓహ్, మేము ఎంత సంతోషంగా ఉన్నాము!” (కీర్తన 126:3) అని పాడుతాము.
ప్రభువైన యేసు మనలను పాపపు బానిసత్వం నుండి విడిపించాడు.
మనలను సంపూర్ణం చేశాడు. మన శరీరం, మనస్సు మరియు ఆత్మలో స్వస్థతను తీసుకురావడానికి
సిద్ధంగా ఉన్నాడు. ఆయన దయ మనకు పాపపు శక్తి నుండి, హానికరమైన కోరికల నుండి, వ్యసనాల బంధం నుండి విముక్తిని కలుగ చేస్తాడు. స్వస్థపరిచే
యేసు శక్తి నుండి మనల్ని దూరం చేయగలిగే ఎలాంటి పర్వత లోయలు వున్నాయి?
“దాహం ఉన్నవారలారా, నీళ్ల
దగ్గరికి రండి: ప్రభువు దొరికినప్పుడు ఆయనను వెదకండి. అల్లెలూయా.” (Divine Office)
No comments:
Post a Comment