సంతోషకరమైన ఆదివారం
జేఫానియ 3:14-18a; ఫిలిప్పి
4:4-7; లూకా 3:10-18 (ఆగమానం
C 2)
“ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుదును ఆనందించుడి”
బాప్తిస్మ యోహాను బోధ వినడానికి వేలాది మంది ఎందుకు వచ్చారు? క్రీస్తు జననమునకు ముందు ప్రవక్త ప్రవచించి
సూచకాలను ప్రదర్శించి వందల సంవత్సరాలు అయింది. ప్రవక్తల ద్వారా చేయబడిన పాత ఒడంబడిక వాగ్దానం ఇశ్రాయేలు
ప్రజలను వారి పాపాలు మరియు అణచివేత నుండి రక్షించి వారిని సంతోషంతో
నింపడానికి మెస్సీయ రాబోతున్నాడన్న బాప్తిస్మ యోహాను తన ఆకస్మిక ప్రకటనతో సుదీర్ఘ
నిశ్శబ్దాన్ని ఛేదించాడు (జెఫ 3:17).
ప్రజలను ఆధ్యాత్మిక నిద్ర నుండి మేల్కొలిపి దేవుని ఆజ్ఞలను
పాటింపచేస్తూ దేవుని స్వరాన్ని ఆలకించేందుకు వారిని వెనక్కి మరల్చడమే బాప్తిస్మ
యోహాను పరిచర్య. ఆధ్యాత్మిక పునరుద్ధరణ కోసం ఆతని వద్దకు వచ్చిన రెండు సమూహాలను
లూకా సువార్తికుడు ప్రత్యేకంగా పేర్కొన్నాడు. వారు రోమను ప్రభుత్వ శాంతి పరిరక్షక
దళాలకు చెందినవారు. ఒకరు పన్ను వసూలు చేసేవారు. రెండవ వారు యూదు సైనికులు. ఈ రెండు
సమూహాలు ఆధ్యాత్మికంగా అనర్హులుగానూ అపవిత్రమైనవారుగా పరిగణించబడి బహిష్కృతులుగా పరిగణించబడ్డారు.
జోర్డాను నదిలో బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను వారిని స్వాగతించాడు.
బాప్తిస్మ యోహాను పునరుద్ధరణ, పశ్చాత్తాప సందేశం మూడు
విషయాలను సూచించింది. మొదటిగా, దేవుని ప్రతి అనుచరుడు తన సంపదను జీవితంలో ఏమీ
లేని వారితో పంచుకోవాలి. కారణం యోహాను తన పొరుగువారిని తనలాగే ప్రేమించడం ఒక ముఖ్య
బాధ్యత అని గుర్తించాడు (లేవీ 19:18). రెండవదిగా, గౌరవ మర్యాదల పవిత్ర కర్తవ్యాన్ని సూచించాడు. ప్రజలనుండి బలవంతంగా
సంపదను దోచుకొనే వారి అధికారాన్ని లేదా శక్తిని దుర్వినియోగం చేయవద్దని అతను
సైనికులను మరియు పన్ను వసూలు చేసేవారిని ఆదేశించాడు. వారి వృత్తిని వదిలివేయకుండా నిజాయితీగా గౌరవప్రదమైన సైనికులుగా ఉండమని బోధించాడు. మూడవదిగా, కలిగి ఉన్నదానితో సంతృప్తి చెందాలని మరియు ఇతరులకు
చెందినవాటిని కోరుకోకుండా ఉండమని తన శ్రోతలను ఉద్బోధించాడు. ప్రేమ, ధర్మమార్గంలో నడవాలని ప్రజలకు పిలుపునిచ్చాడు.
మెస్సీయ వచ్చినప్పుడు తాను "పరిశుద్ధాత్మతో మరియు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడని బాప్తిస్మ యోహాను తన ముఖ్యమైన"శుభవార్త”ను
అందించాడు. పరిశుద్ద గ్రంధ కాలంలో “అగ్ని” అన్నది దేవునితోనూ, ప్రపంచంలోని అతని చర్యలతోనూ మరియు
అతని ప్రజల జీవితాలతో ముడిపడి ఉండేది. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు దహించబడని
మండుతున్న పొదవంటి అగ్నిని ఉపయోగించడం ద్వారా దేవుడు తన ఉనికిని వ్యక్తపరిచాడు
(నిర్గమ 3:2). అలాగునే దేవుని మహిమ (యెహే 1:4, 13) అనీ, ఆయన
రక్షిత ఉనికి (2 రాజు. 6:17) అనీ, ఆయన పవిత్రత (ద్వితీ. 4:24) అనీ, ఆయన
నీతియుక్తమైన తీర్పు (జెక 13:9) నకు ప్రతీకగా కూడా అగ్ని ప్రతిమ ఉపయోగించబడింది. మరియు పాపానికి వ్యతిరేకంగా అతని కోప (యేష 66:15-16) నిదర్శనమునకు కూడా ఉపయోగించ బడింది.
పాపం నుండి మనలను శుభ్రపరచడానికి, పవిత్రపరచడానికి వున్న
పవిత్రాత్మ అగ్ని సాదృశ్యం క్రొత్త నిబంధనలోకూడా ఉపయోగించబడింది (మత్త 3:11; అపో. కా. 2:3). దేవుని
అగ్నిలా వున్న పవిత్రాత్మ మనలను పాపం నుండి శుద్ధి చేస్తూ దేవుని పట్ల ఆతని వాక్కు పట్ల భక్తిపూర్వక
భయాన్ని మనలో ప్రేరేపిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ పవిత్రత పట్ల మనకున్న ఆసక్తిని
మరియు ప్రభువు మళ్లీ వచ్చినప్పుడు ఆయనను కలుసుకునే ఆనందాన్ని మనలో పెంచుతుంది.
క్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనలోని చెడులన్నింటినీ కాల్చివేసి, మన విమోచకుడైన ఆతనిని స్వీకరించడంలో ఆనందంగా ఉంచడానికి అతని
పనులను మనలో నింపుతుంది.
“నేను అరణ్యంలో ఏడుస్తున్న వాని స్వరాన్ని: ప్రభువు కోసం
మార్గాన్ని సిద్ధం చేయండి”.
No comments:
Post a Comment