AletheiAnveshana: పవిత్ర కుటుంబం 1 సమూ 1:20-22, 24-281; యోహాను 3:1-2, 21-24; లూకా 2:41-52 (పవిత్ర కుటుంబం సి)

Saturday, 28 December 2024

పవిత్ర కుటుంబం 1 సమూ 1:20-22, 24-281; యోహాను 3:1-2, 21-24; లూకా 2:41-52 (పవిత్ర కుటుంబం సి)

 

పవిత్ర కుటుంబం

1 సమూ 1:20-22, 24-281; యోహాను 3:1-2, 21-24; లూకా 2:41-52 (పవిత్ర కుటుంబం సి)

యేసు వారితో పాటు నజరేతుకు వెళ్లి వారి విధేయాతన జీవించాడు

 

రక్షకుని జననోత్సవం తరువాత ఆదివారం రోజున మనము పవిత్ర కుటుంబాన్నికొనియాడుతున్నాము. యేసు మరియ యోసేపుల కుటుంబం పవిత్ర కుటుంబం. మనము వారిని పవిత్ర కుటుంబం అని పిలిచినప్పటికీ, వారికి ఎప్పుడూ సమస్యలు లేవని తలంచ కూడదు. ఒక సాధారణ కుటుంబం సమస్యలను ఎదుర్కన్నట్లే ఈ పవిత్ర కుటుంబం కూడా చాలా సమస్యలను చవిచూసింది. యేసును అనుసరించే ప్రతి అనుచరునకు మోయడానికి ఒక శిలువను కలిగి ఉన్నట్లే, ప్రతీ కుటుంబం వారి జీవితంలో సిలువను అనుభవించవలసి వున్నది. ప్రతీ కుటుంబం సానుకూల ప్రతికూల విచిత్ర లక్షణాలు కలిగిన వ్యక్తులతో రూపొందించబడింది.


ఒక్కొక్క వ్యక్తిత్వపు ప్రతికూలతలు ఒక్కొక్కసారి వారి కుటుంబాన్ని చ్చిన్నా భిన్నం చేస్తున్నప్పటికీ అవి  దేవుని వైపు నడిపించే అవకాశాలుగా మారతాయి. అందుచేతనే భక్త పౌలుడు కొలస్సీయులను ఉద్దేశించి, " కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి (కొలస్సి 3:12-14). శారీరకంగా బలహీనమైనా, మానసికంగా బలహీనమైనా, నైతికంగా బలహీనమైనా, కుటుంబంలోని అత్యంత బలహీన సభ్యుడి పట్ల మనకున్న కనికరం, దేవునితో ఐక్యంగా ఎదగడానికి మన సాధనంగా మారుతుంది. మనం ఒకరి చమత్కారాలను అర్ధం చేసుకొని అంగికరింప  చేసే ప్రయత్నాలే పుణ్యం.


సిరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంధం ఇలామనకు గుర్తుచేస్తుంది, బిడ్డల కన్న తండ్రిని ప్రభువు గౌరవించెను. తల్లికి బిడ్డల మీద హక్కును ప్రభువు కల్పించెను” (సిరా. పు. యేసు. 3:2). కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉత్తమ తల్లిదండ్రులు కానందుకు తమను తాము తగ్గించుకుంటారు. సాధ్యమైనంతవరకు  ఉత్తమమైన  తల్లి దండ్రులుగా ఉండటం అనేది మీరు ప్రయత్నించే ఆదర్శం. కానీ దానిని మీరు చేరుకోలేనంత వాస్తవం అయితే మాత్రం కాదు. సాధ్యమైనంతవరకు నేను ఉత్తమమైన గురువుగా జివించడం అనేది నేను ప్రయత్నించే ఒక ఆదర్శం. కానీ దాని పరిపూర్ణతకు నేను ఎప్పటికీ చేరుకోలేనంత  వాస్తవం అయితే మాత్రం కాదు. సంసారికమైనా లేదా విరక్తతత్వ జీవితమైన సరే మనమందరం ఆ పరిపూర్ణజీవితం  చేరుకొనేందుకు దేవునిపై నమ్మకం ఉంచాలి.


శోధనాత్మక పరీక్షల్లో లేదా శిలువ శ్రమ లన్నింటిలో నజరేతు పవిత్ర కుటుంబాన్ని ఏది నిలబెట్టింది? కష్టకాలంలో కుటుంబాన్ని నిలబెట్టేది ప్రేమ, విశ్వాసం మరియు అంగీకారం. కుటుంబాలు సంతోషంగా వుండాలంటే వారి మధ్య ప్రేమ మరియు గౌరవం అత్యంత విలువైనవి. ఈరోజు మన కుటుంబాల్లో ఆ లక్షణాలు వెల్లివిరియాలని ప్రార్థిస్తున్నాం. ఈ రోజుల్లో కుటుంబ జీవితానికి పెద్ద ముప్పు ఏమిటంటే, మనం కలిసి తగినంత సమయం గడపలేకపోవడం. మనము కలసి పని చేయలేకపోవడం. మన భోజన సమయంలో మన సంఘీభావానికి మనలను దూరం చేసేది మన ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు లేదా టీవీ మాధ్యమాలు. వీటిని చూడటంలోమనము చాలా శ్రద్ధగా ఉన్నాము.  ఒకరితో ఒకరం మాట్లాడుకోవడానికి మనకు సమయం లేదు.


నేడు, మనమందరం క్రీస్తు జ్ఞానాన్ని మన కుటుంబాలకు తీసుకురావడానికి వెతకాలి. తిరుసభ పితృపాదులలో ఒకరైన ఓరిజిను, నేటి సువార్తను గురించి వ్యాఖ్యానిస్తూ, ఎవరైతే క్రీస్తు కోసం వెతుకుతున్నారో, ఆయనను కనుగొనడంలో విజయం సాధించలేని వారిలాగా అజాగ్రత్తగా ఆయనను వెతకకూడదు” అని అన్నారు. మరియ యోసేపులు చేసినట్లుగా మనం కూడా గొప్ప శ్రద్ధతోనూ మరియు ఆవేదనతో ఆయన కోసం మనలో మనం వెతకాలి. అలాగునే మన కుటుంబంలోనూ వెతకాలి.


యేసు వయస్కుడవుతున్నప్పుడు, అతను దేవుని జ్ఞానంలోనూ మరియు మనుష్యుల అబిమనంలో అభివృద్ధి చెందాడు”

 

 

No comments:

Post a Comment