అప్రమత్తంగా ఉండండి మరియు ప్రార్థించండి
యిర్మియా 33:14-16; 1
థెస్స 3:12—4:2; లూకా 21:25-28,34-36 (ఆగమాన 1/సి)
“చెడు చేయడం మానేయండి,
మంచి చేయడం నేర్చుకోండి, న్యాయం కోరండి” (Divine Office)
ఈరోజు ఆగమాన కాల మొదటి ఆదివారం. ఇది కొత్త అర్చనకాల సంవత్సర 2025 మొదటి ఆదివారం. “ఆగమనం” అనే పదం ఆగ్లంలో "అడ్వెంట్".
ఈ పదం “అద్ వెనీరే” అనే లతీను పదాల నుండి వచ్చింది. "అద్ వెనీరే" అంటే
"వస్తున్న" లేదా "అద్ వెంతుస్" అంటే "రాక" అని
అర్ధం. ఈ పదాన్ని కేవలం ఒక ప్రముఖ వ్యక్తి “రాక” కు మాత్రమె వాడబడింది. ఇక్కడ మన
ప్రాముఖ్యత క్రీస్తు రెండవ రాకడ కదా! ఆగమాన కాలంలో నాలుగు ఆదివారాలు ఉంటాయి. ఈ కాలంలో, మనల్ని తీర్పు తీర్చడానికి మహిమతో వచ్చే ప్రభువు చివరి
రాకడను మరియు యేసు జననంలో ప్రభువు అవతారాన్ని ధ్యానిస్తాము. ఆగమాన కాల ముఖ్య ఇతివృత్తాలు – అప్రమత్తతో వేచి
ఉండటం మరియు సిద్దపాటు కలిగి యుండడం. ఈ కొత్త అర్చన సంవత్సరంలో (లెక్షనరీ సైకిల్ - సి) తిరుసభ లూకా సువార్త పై దృష్టి సారిస్తుంది.
యేసు రెండవ రాకడ కొరకు మొదటి క్రైస్తవ సంఘాలు ఎలా గుర్తించి
ఎదురు చుసాయో మనం మన మునుపటి ఆదివార ధ్యానాలలో నేర్చుకున్నాము. అకస్మాత్తుగా ఉచ్చులా
వచ్చిపడే క్రీస్తు రాకడను భక్త పౌలుడు
గుర్తించి ఎదురుచూశాడు. అందుకే పవిత్రమైన జీవితాన్ని గడపమని ఆయన మనకు సలహా
ఇస్తున్నాడు (1 థెస్. 3:12). పవిత్రమైన జీవితం అనేది కేవలం
మన ప్రేమ మన స్నేహితులకు మాత్రమే పరిమితం కాకూడదని, ఆయన స్వరూపంలోనూ, పోలికలో సృష్టింప బడిన దేవుని బిడ్డలైన మన
శత్రువుల పట్ల కూడా ఉండాలని మనకు
గుర్తుచేస్తుంది.
రెండవదిగా, యేసు మనలను “ఎల్లప్పుడూ మెళకువగా ఉండండి మరియు
ప్రార్థించండి (లూకా 21:34) అని హెచ్చరిస్తున్నాడు. మనకు
తెలియని లేదా మనం గుర్తించలేని భయంకర పరిస్థితులలో మనం చిక్కుకు పోవడం ఆయనకు ఇష్టం
లేదు. అందుకే అతను , "ఎల్లప్పుడూ అప్రమత్తంగా
ఉండండి మరియు అన్ని సమయాలలో ప్రార్థించండి..." అని హెచ్చరిస్తున్నాడు (లూకా 21:36).
ఈ అప్రమత్తత మన ప్రేమకు, సేవకు సరైన కొలమానంగా వుంటుంది.
కొన్నిసార్లు అవును, కొన్నిసార్లు కాదు అనే నిర్ణయాలలో ఈ
ప్రేమ-విశ్వసనీయత నిలబడదు. మనం ఎప్పటికీ ఇక్కడ శాశ్విత వారము కాదు (లూకా 21:26).
యేసు ఆఖరి రాకడ తధ్యం. అతను తన ప్రపంచానికి
తిరిగి సృష్టిస్తాడు. పేదలు, శక్తిలేని
వారిపై కలిగిన దోపిడీని అంతం చేస్తాడు.
లోకంలోని వస్తువులను తమ దేవుళ్లుగా మార్చుకున్న వారిని ఆయన శిక్షిస్తాడు. తన నుండి
తమను తాము దాచుకునే వారికి ఆయన తన ఉనికిని తెలియజేస్తాడు. ద్వేషం, అన్ని రకాల దుర్వినియోగం, విచ్ఛిన్నమైన సంబంధాలు మరియు మానవ బాధల పట్ల ఉదాసీనత, అనేవి లోకంలోని చీకటి కాలపు భాగం. ఆయన రాకడ లోక చీకటి సమయం ముగింపజేస్తుంది. క్రీస్తు కాంతి విజయాన్ని సాధిస్తుంది.
ఆగమాన కాలం వెలుగును తీసుకొస్తుంది. చీకటి అనేది మన
జీవితాల్లో ఎక్కడ పట్టుకుందని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని ఈ ఆగమానకాలం కోరుతుంది. ప్రపంచాన్ని ద్వేషం నుండి ప్రేమగా
మార్చడం క్రైస్తవుల పని. బహుశః మనం నా కోసం, మీ కోసం, చీకటి
వారముగా కాకుండా వెలుగు వ్యక్తులుగా మారాలి. బహుశః, మన జీవితంలో క్రైస్తవ మతాన్ని ప్రసరింపజేయలేనటువంటి
దేనినైనా విస్మరించడం ద్వారా మనం
క్రిస్మస్ బహుమతిని ఇవ్వాలి లేదా అందుకోవాలి. పునీత పౌలుడు ఇలా అంటున్నాడు, “సోదర సహోదరీలారా: మీ హృదయాలను దృఢపరచుకోవడానికి, మన తండ్రి అయిన దేవుని యెదుట పవిత్రతలో నిర్దోషులుగా ఉండేలా, మీ పట్ల మేము కలిగియున్నట్లే మీరును ఒకరిపట్ల ఒకరు మరియు అందరి పట్ల ప్రేమను
పెంచుకుని, సమృద్ధిగా ఉండేలా ప్రభువు చేస్తాడు. మన
ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కూడ వస్తాడు." ఆమెన్.
"సజీవులకు మరియు చనిపోయినవారికి తీర్పు తీర్చడానికి అతను
మహిమతో మళ్ళీ వస్తాడు, అతని రాజ్యానికి అంతం ఉండదు" (Divine Office)
No comments:
Post a Comment