AletheiAnveshana: ఇవ్వడంలో మనం అందుకుంటాం: 1 రాజులు 17:10-16; హెబ్రీ 9:24-28; మార్కు 12:38-44 (32 B)

Friday, 8 November 2024

ఇవ్వడంలో మనం అందుకుంటాం: 1 రాజులు 17:10-16; హెబ్రీ 9:24-28; మార్కు 12:38-44 (32 B)

 

ఇవ్వడంలో మనం అందుకుంటాం

1 రాజులు 17:10-16; హెబ్రీ 9:24-28; మార్కు 12:38-44 (32 B)

"న్యాయం కోసం ఆకలితో మరియు దాహంతో ఉన్నవారు ధన్యులు, ఎందుకంటే వారు సంతృప్తి చెందుతారు" (Divine Office)

పురాతన కాలంలో వితంతువులు తమను చూసుకోవడానికి, తమకు ఎదిగిన కుమారులు లేకుంటే అనిశ్చిత పరిస్థితిలో వుండేవారు. మనము మొదటి పఠనంలో జెరపతు విధవరాలి కఠిన పరిస్థితిని విన్నాము. ఆమెకు కలిగిన కొంచెం ఆహారాన్ని తాను తన కుమారుడు భుజించకుండా తన అతిధి అయిన ప్రవక్త ఏలియాకు వడ్డించింది. దేవుడు ఆమె దాతృత్వానికి ప్రతిఫలమిచ్చాడు. మరో వితంతువు ఎలీషాదగ్గరకు వచ్చి, “నా ఇద్దరు పిల్లలను బానిసలుగా తీసుకెళ్లడానికి రుణదాతలు వేధిస్తున్నారు” అని మొరపెట్టుకుంది. ఆమెను ఆదుకొనేవాడే లేడు. నిజాయితీలేని న్యాయమూర్తుల దయచేతుల్లో ఆమె నలిగిపోయింది. నిర్గమ కాండం మరియు లెవీకాండ గ్రంధాలు వితంతువులకు న్యాయాన్ని చేకూర్చని ఎవరినైనా వదలక శపిస్తున్నాయి. వితంతువులను వేధించే వారి  భూమి పాపానికి గురవుతుందని ప్రవక్తలు కూడా దూయబట్టారు. 

రూతు ఆమె చేసుకున్నపుణ్యానికి దేవుడు ఆమెకు ఒక చక్కటి ప్రతిఫలమిచ్చాడు. ఆమె తన అత్తగారు నయోమితో, “నువ్వు ఎక్కడికి వెళ్లితే నేను అక్కడకు వస్తాను. నువ్వు ఎక్కడ వుంటే నేనూ అక్కడే ఉంటాను.  మీ ప్రజలు నా ప్రజలుగా ఉంటారు. మీ దేవుడు, నా దేవుడు.” అని చెప్పి తన దేశాన్ని బంధువులను విడిచిపెట్టి అత్తను తల్లిగా స్వీకరించి భర్తలేని జీవితాన్ని అత్తగారి దేవునికి సమర్పణ చేసుకుంది. అందుకు ఆమెకు దేవుడిచ్చిన బహుమతి ఏమిటంటే తన మునిమనవళ్లలో ఒకరు దావీదుడు రాజయ్యాడు. మరొక వారసుడు యేసు క్రీస్తు. సజ్జనులు అన్యులైనప్పటికి భగవంతుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టడని మనం నేర్చుకుందాం. 

వితంతువుల ఇళ్లను మింగేసే శాస్త్రులపై యేసు దాడి చేశాడు. ఒక వితంతువు ధార్మికతను శాస్త్రులకు గుణ పాఠవంగా నేర్పాడు. తన పేదరికం నుండి ఆమెకు కలిగిన మొత్తం జీవనోపాధిని భగవంతునకు ఇచ్చేసుకుందని  యేసు చెప్పాడు. ఆమె దాతృత్వాన్ని యేసు ప్రశంసించాడు. ఈ వితంతువులు పేదవారే కానీ విశ్వాసంలో అధిక ధనవంతులు. తరచుగా ధనవంతుల కంటే పేదలైన వాళ్ళే చాలా ఉదారంగా ఉంటారు.  దేవుని వాక్య పరిచర్యకు మరియు సువార్తీకులకు సహకరించే వారిలో ఎక్కువుగా మనకు కన్పించేది ఇటువంటి పేద వితంతువులే! అసలు ప్రజలు  ఎలా పేదలుగా మారారు?  తెలివిగల వ్యక్తులు వారిని సద్వినియోగం చేసుకోవడానికి మార్గాలను వెతకి వెతకి  కనుగొన్నారా?  లేక వారి వారి కాలంలోని అసమాన సామాజిక ఆర్థిక వ్యవస్థకు వారు బలైపోయారా? నిరుపేదల నుండి అసంఘిక సమాజం తమ స్వార్ధ ప్రయోజనాలను  పొందుకో గలగడం ఎలా జరిగింది?

సమాజం యొక్క పాపపు నిర్మాణాలను గురించి మాతృ తిరుసభ ద్వితీయ వాటికను మహాసభ   ద్వారా చాలానే ఉద్ఘాటించింది. పోప్ ఫ్రాన్సిస్ గారు పేదల పట్ల శ్రద్ధ వహించేలా తిరుసభను  నడిపించాలన్న నిశ్చయాన్ని సినడాలిటి ద్వారా మనం గ్రహించాం. సంపద చెడ్డదెమీ కాదు. అది లేకుండా అభివృద్ధి లేనేలేదు. తప్పు మరియు పాపం ఏమిటంటే సంపదను సంపాదించడానికి అనుచితమైన మార్గాలను ఉపయోగించడం. మన చుట్టూ ఉన్న పేదలను పట్టించుకోకుండా సంపదను వృధా చేయడం తప్పు మరియు పాపం. ఆలయ ఖజానాకు తనకు కలిగిన కొంచెమైనటువంటి అంతటనూ ఇచ్చివేసిన వితంతువును చూసి యేసు ఆశ్చర్యపోయాడు. సమాజాన్ని పట్టించుకునే వారుంటే ఆయన సంతోషిస్తాడు. బలహీనమైన సభ్యుల పట్ల మనకున్న శ్రద్ధ సమాజ బలం కొలవబడుతుంది.

నిజమైన ఇవ్వడం అనేది హృదయం నుండి రావాలని యేసు బోధించాడు. పగతో లేదా ప్రదర్శన కోసం ఇచ్చిన బహుమతి దాని విలువను కోల్పోతుంది. కానీ ప్రేమతో, దాతృత్వం మరియు త్యాగ స్ఫూర్తితో ఇచ్చిన బహుమతి అమూల్యమైనది. బహుమతిగా మొత్తం లేదా పరిమాణంగా ఇచ్చే వ్యక్తికి ఎంత ఖర్చయినా పట్టింపు ఉండదు. మనం అందించేది చాలా చిన్నదిగా కనిపించవచ్చు లేదా పెద్ద విలువైనదేమీ కాక పోవచ్చు కానీ మన దగ్గర ఉన్న ధనం/ తలంతులను భగవంతునికి సమర్పించి నట్లయితే, అవి ఎంత చిన్నవిగా అనిపించినా, దేవుడు వాటిని మన లెక్కకు మించినవిగా  చేయగలడు!!!

అయితే మనం అతనికి ఎలా తిరిగి చెల్లించాలి? ఆయన మనకిచ్చినదానికి తగిన ఫలాన్ని మనం ఎలా భరించగలం?” (Divine Office)

No comments:

Post a Comment