యేసుయందు మాత్రమె రక్షణ
సామెతలు 7:7-11; హెబ్రీ 4:12-13; మార్కు
10:17-30 (B 28)
".. నన్ను
వెంబడించoది, ప్రతిఫలంగా వంద రెట్లు పొందుతారు మరియు శాశ్వత జీవితాన్ని
పొందుతారు"
తన చిన్ననాటి నుండి అన్ని చట్టాలను ఆచరిస్తున్న ఒక సంపన్న
యువకుడు, నిత్యజీవం పొందుకోవడానికి ఇంకా ఏమి చేయాలి అని
యేసును అడిగాడు. అందుకు యేసు సంపదతో తనకున్న అనుబంధాన్ని విడిచిపెట్టి కొంత సంపదను
పేదలతో పంచుకొని తనను అనుసరించమని యేసు అతనికి సూచించాడు. యేసు ప్రతిపాదన అతనికి
నచ్చలేదు. అతను యేసును విడిచిపెట్టాడు. సంపద విషయంలో యేసు ఎందుకు జాగ్రత్తలు నేర్పుతున్నాడు?
యేసు సంపదకు, సంపన్నులకు వ్యతిరేకం కాదు. అతనికి ధనవంతులైన చాలా మంది
స్నేహితులు కూడా ఉన్నారు. సంపదను సరైన రీతిలో వినియోగించుకోవాలని ఆయన మనకు బోధిస్తున్నాడు.
మరియు “వంచకుడై ధనము సంపాదించినవానికంటె యథార్థముగా ప్రవర్తించు
దరిద్రుడు ఉత్తమం" (సామె 28:6; కీర్తన 37:16); “ధనవంతులు కావడానికి మిమ్మల్ని మీరు అలసిపోనివ్వక తెలివిగా
ఉండు” (సామె 23:4) అని యేసు పాత నిబంధన
జ్ఞానాన్ని పునరుద్ఘాటించాడు. సంపదను కలిగి ఉండటం పాపం కాదు. కానీ ఒకరి స్వంత భద్రత లేదా
రక్షణ అన్నది సంపదపై నమ్మకాన్ని తప్పుగా ఆలోచన కలిగి ఉండడం వలన జీవితం యొక్క
ఉద్దేశ్యం మరియు దాని పరమార్ధం నుండి మనలను దూరం చేయవచ్చు. సంపద మనల్ని తప్పుత్రోవలో
స్వతంత్రులను చేయగలదు. లావోడిసియా సంఘం సంపద పట్ల తాను కలిగియున్న దృక్పథం మరియు
తప్పుడు భద్రతను గురించి హెచ్చరింపబడింది. "నేను ధనవంతుడిని, నేను అభివృద్ధి చెందాను మరియు నాకు ఏమీ అవసరం లేదు"
అన్న భ్రమ ఆలోచనవల్లనే ఆ సంఘం హెచ్చరికకు గురి అయినది. సువార్తలోని ఒక ధనవంతుడు
ఇలా అనుకున్నాడు, “ఓ నా ఆత్మమా!
నీకు చాలా సంవత్సరాలకు సరిపడు అనేక సంపదలు
ఉన్నాయి.
నిశ్చింతగా వుండుము. తినుము. త్రాగుము. సుఖించుము” (లూకా 12:19).
అందుకు యేసు, “ఈ లోకమంతటినీ సంపాదించి, ఆత్మను పోగొట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?” అని ప్రశ్నించాడు (మత్త 16:26).
పరలోక రాజ్య నిధి కోసం “అందరినీ త్యజించు” అని యేసు తన
శిష్యులకు ఎందుకు చెప్పాడు? సంపదకు, కోరికలతో పెనవేసుకుపోయిన హృదయానికి ప్రత్యేక సంబంధం ఉంది.
ప్రభువే మనకున్న గొప్ప సంపద. అదే గొప్ప ఆనందం. “అన్నింటిని త్యజించండి” అనే యేసు బోధ
మన అనురాగ అనుబంధాలు, తప్పుడు స్నేహాలు, తప్పుడు ప్రభావాలు, విరామం లేని ఉద్యోగాలు, అనవసరమైన వినోదాలు, కపట జీవన శైలి వంటి అనేక విభిన్న విషయాలను విడిచిపెట్టడాన్ని
సూచిస్తుంది. ఆ బోధ మొదట దేవుణ్ణి ప్రేమించే స్థానంలో నిలబడుతుంది.
శిష్యులు యేసుతో, “మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి” అని అంటే
“అందుకు ప్రతిఫలమేమిటి? అన్న అర్ధమేగా!! ఆ
ప్రతి ఫలo గొప్పది. భయం
నుండి విముక్తి, పాపం యెడల నిరాశక్తి, స్వార్థం మరియు అహంకారం, ఒంటరితనం నుండి విముక్తి వంటి తన రాజ్యపు అమూల్యమైన సంపదలను
యేసు వారికి వాగ్దానం చేశాడు. ఇది మనం కొనలేని బహుమతి. మన హృదయంలోని లోతైన
కోరికలను ఆయన మాత్రమే నిజంగా తీర్చగలడు. యేసులో నెలకొని యున్న నిజమైన ఆనందాన్ని
వెదకనివ్వకుండా చేసే దేనితోనైనా లేదా ఎవరితోనైనా విడిపోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా?
తన రక్షణను మరియు భద్రతను అతనిలో నిలుపమని యేసు యువకునికి పిలుపు నిచ్చాడు. అదే పిలుపునును
మనకు కుడా ఇస్తున్నాడు. మనం యేసుతో మన వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటే, మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. అప్పుడే ఆతనిలో నేలకోనియున్న
సమస్త పరలోక సంపదను మనలో సంపూర్తిగా నింపగలడు. "ఆత్మలో పేదలగువారు ధన్యులు. స్వర్గరాజ్యం వారిది" (మత్త 5:3).
"క్రీస్తు యొక్క శాంతి ... అన్ని అవగాహనలను
అధిగమిస్తుంది. మరియు మీ మనస్సులను హృదయాలను ఆతనిలో నిలుపుతుంది" (దైవార్చన ప్రార్ధన)
No comments:
Post a Comment