AletheiAnveshana: సేవ చేయడం అంటే క్రీస్తుతో పాటు పరిపాలించడం: యెషయ 53:10-11; హెబ్రీ 4:14-16; మార్కు 10:35-45 (B 29)

Saturday, 26 October 2024

సేవ చేయడం అంటే క్రీస్తుతో పాటు పరిపాలించడం: యెషయ 53:10-11; హెబ్రీ 4:14-16; మార్కు 10:35-45 (B 29)

 

సేవ చేయడం అంటే క్రీస్తుతో పాటు పరిపాలించడం

యెషయ 53:10-11; హెబ్రీ 4:14-16; మార్కు 10:35-45 (B 29)

నేను మీ కోసం ఉద్దేశించిన ప్రణాళికలు నాకు తెలుసు - శాంతి కోసం ప్రణాళికలు, విపత్తు కాదు” (ఆర్చనకాల ప్రార్ధన)

 

కీర్తి కాంక్ష, అధికార దాహం, ఆత్మ సంక్షోబం లేదా గుర్తింపు కోసం కొందరిలో తక్కువుగాను, మరికొందరిలో అతి ఎక్కువుగాను కట్టలు తెంచుకొని ఉంటుంది. ఈ స్వార్ధ వ్యక్తిత్వం ఎదుటివారిని కించ పరచడమో లేక బలితీసుకోవడమో చేస్తుంది. సంఘంలో ఇది ఒక సాధారణమైన జాడ్యంగా మారిపోయింది. అధికార దాహం యేసు శిష్యుల్లో కొంతమందిని విడిచి పెట్టలేదు. జెబెదీ కుమారులైన యాకోబు మరియు యోహానులు, యేసుతో ఒప్పందం కుదుర్చుకోమని తమ తల్లిని కోరారు. ప్రతిష్టాత్మకమైన ఆశిష్యులు యేసు రాజ్యంలో అత్యున్నత స్థానాన్ని కోరుకున్నారు. కానీ యేసు మాత్రం అందుకు భిన్నంగా శక్తి, అధికారం ప్రఖ్యాత స్థానముల గురించిన ప్రపంచ అవగాహనను తిప్పికొట్టాడు. యజమాని, రాజు, డాలు, ప్రథమం అనేవాటి ప్రముఖ వరుస స్థానాలను సేవకుడు, కింకరుడు, కొడవలి, కడ అనేవాటితో బంధంవేసి విప్లవాత్మక సేవా తత్పరతను నేర్పినవాడు యేసు.  అధికారాన్ని వినయంతోను, ఆధిపత్యాన్ని సమర్పణ త్యాగ  వైఖరితో బంధం చేయగలిగాడు.


మన ప్రభువు అనేక సందర్భాల్లో వ్యర్థమైన అహంకారం, కీర్తి మరియు వైభవం కొరకు తారసపడే  కలహాలను గురించి చాల సమయాల్లో మందలించాడు. ఒక చిన్న పిల్లవాడిని చూపిస్తూ పిల్లల  మనస్సును పోలి ఉండమని ప్రోత్సహించడం వంటి ప్రతీకాత్మక చర్యల ద్వారా బోధించాడు యేసు. శిష్యుల పాదాలను కడగడం వంటి వినయ విధేయాత్మకు ఉదాహరణను చూపిస్తున్నాడు యేసు. అందువల్లనే తన రాజ్యంలో అధికార దాహం తీర్చుకోవడానికి అవకాశం లేదని యేసు తన శిష్యుల   అభ్యర్థనను ఆమోదించలేదు. గౌరవ మర్యాదలు అనేవి ఒకరి నైతిక చట్టాల బద్దత వల్లనే నిర్వహించబడతాయి. ఒకరి జీవితాన్ని లేదా సమాజాన్ని మలచ గలదే నైతిక చట్టాలే అని తన శిష్యులకు  అవగాహన కల్పించాడు.

ప్రధమాసనాలను కోరుకున్న ఇద్దరు శిష్యులకు కల్వరి శిలువపై బాధామయ సేవకుని మరణం  శ్రమల బాప్టిజంనువాగ్దానం చేసింది. వారు తమ యజమానుని అవమాన మరమరణాలను చూసినప్పుడు పరలోక రాజ్యభాగస్వామ్యానికి కొంత ముందస్తు రుచిని కలిగించింది. కాలక్రమంలో అదే వారి అనుభవాన్ని విస్తృతం చేసింది. వేద శ్రమల్లో కత్తికి జేమ్స్ బలయ్యాడు. జాన్ చాలా కాలం సాక్షిగా జీవించాడు. ఇద్దరూ తమ గురువు క్రీస్తుకు కొరకు వారి మరణం వరకు సాక్ష్యులుగా జీవించారు. ఇద్దరూ ప్రాపంచిక సంబంధమైన అధికారాశయాన్ని కోల్పోయారు. ప్రభువు యొక్క శిలువ మరియు సహవాస అభిరుచిని ఘనంగా తెలుసుకున్నారు.


కుటుంబంలో, సమాజంలో, చర్చిలో, ప్రపంచంలో మనం ఒకరికొకరo పరిచారకులుగానూ, అందరికీ ఎలా సేవకులుగా జీవించగలం? ప్రభువుకు మరియు ఆయన ప్రజలకు సేవ చేయడంలో మన ప్రతిభను పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతగానో ఉంది. అందుకు మనం ఉత్తమంగా ఏమి చేయగలం? మనందరికీ చాలా విభిన్నమైన దైవీక తలంతులు ఉన్నాయి. ఖైదీలను దయ, కరుణ మరియు న్యాయంతో పరామర్శించే వరాలను కొందరు కలిగి ఉన్నారు. మరికొందరు జబ్బుపడిన వారి పట్ల సానుభూతిని కలిగి ఉంటారు. మరికొందరు పేదల పట్ల ఉదార ​​హృదయాన్ని కలిగి ఉంటారు. మరికొందరు తమ పిల్లలకు మాత్రమే కాదు, వారి జీవిత పరిస్థితుల ద్వారా అనాథలైన వారికి గొప్ప తల్లిదండ్రులుగా వుండే  పరిశుద్ధాత్మ వరాలను కలిగి ఉంటారు. మనందరికీ చాలా టాలెంట్స్ ఉంటాయి. యేసు రాజ్యంలో నిరుపేదలకు సేవ చేయడానికి మాత్రమె మనకు తన ప్రతిభను ఇచ్చాడు.


తన పనిని చేయడంలో మనకున్న వైఫల్యాలను, పరిమితులను, భయాలను, మనపై మనకు విశ్వాసం కోల్పోయిన సమయాలు ఉన్నప్పటికీ యేసు అర్థం చేసుకుంటాడు. "ప్రేమ యొక్క ఫలం సేవ మరియు శాంతి" అని చెప్పిన మథర్ థెరిసా వలె యేసును ఇతరులలో గ్రహించి తన ఉనికిని సేవించడానికి ప్రేమ మరియు దృఢ నిశ్చయం వంటి ప్రతిభను ఉపయోగించుకోవాలి. మనం మన జీవితాలను వినయపూర్వకమైన సేవలో మరియు ఒకరికొకరు ప్రేమలో ఉంచడం ద్వారా దేవుని పాలనను పంచుకుంటాము.


అతను దుమ్ము నుండి పేదలను లేపుతాడు మరియు బూడిద కుప్ప నుండి పేదలను లేపుతాడు” (అర్చనకాల ప్రార్ధన)

 

 

No comments:

Post a Comment