AletheiAnveshana: విడదీయరాని దైవీక దాంపత్య బంధం: ఆది 2:18-24; హెబ్రీ 2:9-11; మార్కు 10:2-16

Saturday, 5 October 2024

విడదీయరాని దైవీక దాంపత్య బంధం: ఆది 2:18-24; హెబ్రీ 2:9-11; మార్కు 10:2-16

 

విడదీయరాని దైవీక దాంపత్య బంధం  

ఆది 2:18-24; హెబ్రీ 2:9-11; మార్కు 10:2-16

నా కుమారుడా, నా మాటలను గమనించు. నేను చెప్పేది శ్రద్ధగా వినండి” (దైవర్చన ప్రార్ధన DO)

 

గత మూడు ఆదివారాలుగా, యేసు మరియు అతని శిష్యుల మధ్య జరిగిన సంభాషణల గురించి మార్కు సువార్తనుండి మనం విన్నాము. నేటి సువార్త పఠనంలో, విడాకుల చట్టబద్ధత గురించి పరిసయ్యులు యేసును పరీక్షించడం వింటున్నాము. నిర్దిష్ట పరిస్థితులలో, మోషె చట్టం విడాకులను అనుమతించింది (ద్వితీ 24:1-5). ఈ చట్టం భర్త తన భార్యకు విడాకులు ఇవ్వడానికి అనుమతిస్తుంది. కానీ భార్య తన భర్తకు విడాకులు ఇవ్వలేదు. యేసు సృష్టి గ్రంధాన్ని ఉటంకిస్తూ దేవుని అసలు ఉద్దేశంలో ఉద్దేశ్యం మరియు అర్థాన్నివిశిడం చేశాడు. యేసు బోధ కుటుంబ ప్రాముఖ్యతను నొక్కిచెప్పే విధంగావుంది. అది అతని కాలంలోని సాంస్కృతిక నిబంధనల సంస్కరించే విధంగా ఉంటుంది.


స్త్రీలు మరియు పురుషులు వివాహంలో కలిసి ఉండాలన్నది దేవుని ఉద్దేశం. పెళ్లి లక్ష్యం పిల్లల పెంపకం. ఈ బాధ్యత వివాహపు జీవితంలో కలిగిన కొన్ని ప్రయోజనాలలో ఒకటి. తిరుసభ సత్యోపదేశం  దివ్య సంస్కారం వివాహంను ఏవిధంగా నిర్వచించిది? " ఒక పురుషుడు మరియు స్త్రీ మధ్య జీవితకాల ఒడంబడిక. ఇది దంపతుల శ్రేయస్సు కొరకు మరియు పిల్లల సంతానోత్పత్తి, వారి విద్య కోసం ఆదేశించబడిందే ఈ దివ్య సంస్కారము" (ఆర్టికల్ 1601). బిడ్డలను పొందుకొని వారిని దేవుని భయభక్తులతో పెంపొందించడం ద్వారా, తల్లిదండ్రులు దేవుని సృష్టిలో సహ-సృష్టికర్తలుగా దీవింప బడతారు. వివాహం ఒక దివ్యసంస్కారం. దివ్య సత్ప్రసాద సంస్కారము వలే ఇతర దివ్య సంస్కారములలో కూడా యేసు ఉనికి ఏవిధంగా వుందని మనం విశ్వసిస్తున్నామో  వివాహ దివ్య సంస్కారములో కుడా యేసు సాన్నిధ్యం వుంది. దివ్య సంస్కారములో దేవుని సాన్నిధ్యం నెలకొని వుంటుంది. భార్యాభర్తలు త్యాగపూరిత జీవితాన్ని జీవించినప్పుడు యేసు తన ప్రేమను వారి ప్రేమకు ఐక్య పరుస్తాడు. అందువల్లనే ఆతని సాన్నిధ్యం వారి దాంపత్య జీవితంలో నెలకొని వుందని మనము విస్వసిస్తున్నాము. ఇందుకు ఈ దంపతులు భగవంతుని కృపకు సహకరిస్తూ నిరంతర సద్భావన జీవిత నడవడి కలిగి వుండడం చాలా అవసరం. తనలో భాగమైన మరొకరితో దాంపత్య జీవితంలో జీవించడం అంటే చాలా కఠినమైనదే! యేసు కొరకుజీవించే త్యాగ జీవితంలో దాంపత్య శిలువ జీవితం చాలా క్లిష్టమైనప్పటికి దీవేనకరమినదే ఎందుకంటే ప్రేమ అనేది ఒకరి స్నేహితుని కోసం జీవితాన్ని అర్పించడం. అందుచేతనే వారు దేవుని రాజ్యానికి సాక్ష్యమిస్తున్నారు.


"ఇష్-షాహ్" అనే హీబ్రూ పదానికి తెలుగు భాషలో స్త్రీ అని అర్థం వస్తుంది. అయితే దాని నిగూఢ అర్ధం   'జీవిత భాగస్వామి' లేదా ‘సహ ధర్మ చారిణి’. జీవితంలోని అన్ని రంగాలలో స్త్రీ తన సహ పురుషునితో సరి సమానంగా వుంటూ తనకు తోడ్పడాలని ఈ వచనం సూచిస్తుంది. అందుకనే “నా ఎముకలలో  ఎముక, 'నా మాంసంలో మాంసం” అనే పరిశుద్ధ వాక్యం ఈ సత్యాన్ని ధృవీకరిస్తుంది. అలాగునే యేసు వివాహ జీవితం మరియు బ్రహ్మచర్య జీవితం అనేవి స్వర్గరాజ్యం చేరుకొనేందుకు ఏర్పాటు చేయబడిన శ్రేష్ఠమైన ప్రయాణ మార్గాలని యేసు విశిద పరిచాడు (మార్కు 19:11-12 ). వివాహం మరియు బ్రహ్మచర్యం రెండూ పవిత్ర జీవితాన్ని గడపడానికి భగవంతుని పిలుపు. భ్రహ్మ చర్య వ్రతం గురించి మరొకసారి ధ్యానం చెద్దాం. అయితే మన జీవితాలు మన స్వంతం కాదు. కానీ అవి దేవునికి చెందినవి. రెండవ వాటికను మహాసభ దాంపత్య జీవితం గురించి మనకు ఇలా గుర్తుచేస్తుంది: “ఈ భార్యాభర్తల పవిత్ర బంధం అనేది, వారి సంతానం మరియు సమాజం యొక్క మంచిని దృష్టిలో ఉంచుకుని, మానవ సంకల్పంపై ఆధారపడి ఉండదు. దేవుడే వివాహానికి రచయిత. అతను దానిని వివిధ మచి వస్తువులతో,  ఉద్దేశ్యాలతో, లక్ష్యాలతో ఏర్పాటు చేశాడు.  ఇవన్నీ మానవ జాతి సర్వోన్నత ప్రగతి మరియు దాని పరంపరకు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి" (గౌదియం ఎత్  స్పెస్. 48).


యెహోవా ఇలా అంటున్నాడు, “మూడు కార్యములు నాకు ఇష్టము. దేవునికిని నరులకుగూడ ఇవి ప్రీతి కలిగించును. సోదరులు ఐకమత్యముగా జీవించుటయు, ఇరుగుపొరుగువారు స్నేహముగా జీవించుటయు, భార్యాభర్తలు పొందికగా జీవించుటయు (సిరాపు. యేసు. జ్ఞాన  25:1). వివాహ  దాంపత్య సంస్కారమును కొనియాడే వారందరి నిమిత్తమై ఈ రోజు మనం భగవంతుని ఆశీర్వాదం కొరకు ప్రార్ధించుదాము. భార్యాభర్తల పొందిక జీవితంలో కలిగియున్న భగవంతుని సాన్నిధ్యానికి సాక్ష్యమివ్వగలిగే  ధైర్యం మరియు బలం మీకు కలగాలి. ఆమెన్.


“ప్రభువు తనను ప్రేమించే వారందరినీ సురక్షితంగా కాపాడుతాడు" (దైవార్చన ప్రార్ధన DO)

1 comment: