విశ్వాసం అవగాహనను కోరుకుంటుంది
యెహోషువా
24:1-2a,15-17,18b; ఎఫేసి 5:21-32; యోహాను 6:60-69 (B 21)
ప్రభువు
యొక్క సిలువ మనకు జీవ వృక్షంగా మారింది
యేసు “జీవాహారమును నేనే” అని
పేర్కొన్నాడు. పరలోక తండ్రి వద్దకు మన ప్రయాణంలో మనల్ని నడిపించడానికి
మరియు నిలబెట్టడానికి ఆధ్యాత్మిక ఆహారంగా దేవుడు మనకు ఇచ్చిన జీవాహారామే యేసు. ఆతని
వాక్కు మరియు రక్త మాంసములు మనకు నిత్య జీవం. మనం యేసు మాటలను దైవంగా అంగీకరించాలి
లేదా మోసగాడి వాదనగా తిరస్కరించాలి. ఒక్కొక్క సారి ఆతని మాటలు కఠినంగా వుంటాయి. ఇది
“కఠినమైన మాట” అని అపొస్తలులు కూడా ఒప్పుకున్నారు. యేసు మాటలు కష్టతరంగా వున్నాయి
అని అర్థం చేసుకోవడం కష్టం కాదు గాని, అంగీకరించడం చాలా కష్టం. యేసు తన శిష్యులతో కూడా ఈ సమస్యను
నొక్కిచెప్పాడు.
ఎందుకంటే పరిశుద్ధునిగా మరియు ఏకైక అద్వితీయ
కుమారునిగా అతను తండ్రి నుండి పంపబడినట్లు తన పట్ల వారి విశ్వాసాన్ని మరియు
విధేయతను పరీక్షించాలనుకున్నాడు. యేసు తన శిష్యులకు నిత్యజీవముతోపాటు దేవునిలో పరిపూర్ణ
ఐక్యతా ప్రసాద ఆశీర్వాదాన్ని కూడా వాగ్దానం చేశాడు. “కఠినమైన సూక్తులను” అర్ధం
చేసుకొని విశ్వసించి అనుసరించడానికి ఆహ్వానాన్ని మరియు దయను ఇచ్చేది
తన పరలోకపు తండ్రి అని యేసు తన శిష్యులకు హామీ ఇస్తున్నాడు.
తన మాటలు "ఆత్మ మరియు
జీవము" (యోహాను 6:63) ను కలిగి ఉన్నాయని యేసు తన శిష్యులతో చెప్పాడు. తన ఆత్మ స్వర్గపు తండ్రిది. తన మాటలు తన
తండ్రివి కాబట్టి ఆతని మాటలు జీవానికి కర్త. మరియు తనను శ్వాసించే విశ్వాసులలో అదే
తండ్రి ఆత్మ నెలకొని వుంటుంది. విశ్వాసపు బహుమానం ద్వారా పేతురు నిజంగా యేసు ఎవరో అని
ఆత్మీయ ప్రత్యక్షతను పొందగలిగాడు. యేసు దిగజారిపోయిన మానవ జాతిని విమోచించి, వారిని దేవునితో సమాధానపరచ గలిగే రక్షకుడనని గ్రహించ ప్రేరణ
పొందుకోగలిగాడు.
అర్థం చేసుకోవడానికి కష్టంగా
ఉండే కొన్ని కఠినమైన యేసు సూక్తులను తన మాటపై విశ్వాసం మరియు నమ్మకం పెంచుకోవడానికి
దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడు? విశ్వాసం
అనేది దేవుడు తన మాట వినేవారికి మరియు తనపై నమ్మకం ఉంచేవారికి ఉచితంగా ఇచ్చే ఒక బహుమతి.
విశ్వాసం అనేది దేవుని ఎడల ఒకరి వ్యక్తిగత ప్రతిస్పందన. విశ్వాసం గుడ్డిదా లేదా
అజ్ఞానమా అని కాదు. ఇది దేవుని సత్య వాక్యం మరియు విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది.
నిజమైన విశ్వాసం అనేది మార్మిక మరియు
ఆధ్యాత్మిక మాటల ఎడల అవగాహనను కోరుకుంటుంది. సెయింట్ అగస్టీన్ ఇలా వ్రాసాడు, “నేను అర్థం చేసుకునే క్రియా క్రమంలో నమ్ముతాను మరియు నమ్మడం
మాత్రమె ఉత్తమం అని నేను అర్థం చేసుకున్నాను." ప్రభువైన యేసు తన
అనుచరులందరికీ తన జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని మరియు ఆత్మను అందజేస్తాడు. దేవుని
గురించి మన జ్ఞానం మరియు అవగాహనలో వృద్ధి చెందడానికి సహాయం చేస్తాడు.
దేవుని నుండి వచ్చే
సత్యాన్ని మరియు జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మన హృదయం మరియు మనస్సు యొక్క
కళ్లను ప్రకాశవంతం చేసేటటు వంటిది పరిశుద్ధాత్మ పని అని అపొస్తలుడైన పౌలుడు మనకు చెప్తున్నాడు (ఎఫే 1:17-18).
మన వ్యక్తిగత జీవితాలలో దేవుని పనిని అర్థం చేసుకోవడానికి మరియు అనుభవించడానికి
విశ్వాసమే కీలకం. అపొస్తలుడైన పౌలుడు "మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ
ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది" (రోమా 5:5) అని కూడా విశిదం చేస్తున్నాడు.
మనము యేసు మాటలను వింటూ, ఆతని సూచనలకు విధేయత చూపుతున్నప్పుడు ఆయన స్వరాన్ని
గుర్తించడంలో వృద్ధి చెందుతాము. మనం దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోగలుగుతాము. పేతురు
వలే, “నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు” అని సాక్ష్యమివ్వ
గలిగి మన జీవితాన్ని మార్చగలిగే శక్తి ఉన్నవాడని యేసయ్యను మనము నమ్ముతున్నామా? మన ప్రభువుగా, విమోచకునిగా, బోధకునిగా మరియు వైద్యునిగా మనము తెలుసుకోవడం, ప్రేమించడం మరియు సేవించడంలో మన విశ్వాసాన్ని పెంచమని
ప్రభువైన యేసును అడుగుదాం. ఆతని ఆత్మతో మనలను నిలబెట్టగలడు.
"నీవే, ప్రభూ, నా రక్షణ మరియు నా మహిమ: నీవు నా తల పైకెత్తువాడవు"
Beautiful message pastor garu
ReplyDeleteVery nice message father
ReplyDeleteVery nice msg father garu
ReplyDeleteManchi msg chesaru father garu
Delete