AletheiAnveshana: August 2024

Saturday 31 August 2024

Expressions Manifest Conversion: Dt 4:1-2,6-8; Js 1:17-18,21b-22,27; Mk 7:1-8,14-15,21-23 (B22)

 

Expressions Manifest Conversion

Dt 4:1-2,6-8; Js 1:17-18,21b-22,27; Mk 7:1-8,14-15,21-23 (B22)

“God saw all he had made, and indeed it was very good. Alleluia.” (DO)

This Sunday, our lectionary returns to Mark’s Gospel after several Sundays in which we heard the Bread of Life discourse from the Gospel of John. Mark includes Gentile Christians in his audience who had no knowledge or experience of Deuteronomic and Levitical laws. Mark introduces Jewish practices to the gentile Christians to observe some of them. Mark presents Jesus criticizing the Pharisees for putting human tradition above God’s Law. The Law tied Israel to God. The observation of the law was religion. The word religion comes from the Latin word ligare meaning “tied to something” or someone.

The Pharisees used the law to attack others instead of as the way to honor God. People could not possibly follow all the statutes and thus would be condemned. Jesus quoted the prophets, “This people honor me with their lips, but their hearts are far from me” (Ezek 33:31; Is 29:13). What then is religion? How should people be tied to God? James answers this question (Js 1:27). Religion that is pure and undefiled before God is to care for vulnerable. Who, then, are the vulnerable in our society?

Orphans and widows in their affliction, the physically or mentally challenged, children being preyed upon by the porn industry, people who are struggling with their gender identity, people who are forced to leave their homelands to support their families, people who cannot work and are thus homeless, voiceless because marginalized due to deprivation are to be considered vulnerable. Do you and I recognize such a kind of vulnerable still around us? What sort of vulnerable do we have with us? Are we religious? Are we tied to God? We are tied to God!!

At the end of today’s gospel reading, Jesus speaks about the things that defile a person and religion and religious life. It also recognizes the things in the heart that lead closer to God. The virtues like truth, beauty, love and the determination to live for God are really gifts of grace planted within a person. They show their presence when one is generous, truthful, kind, empathetic, and wise. By treasuring these we treasure the presence of God. By treasuring it we cannot but serve his presence in others. Religion that is pure and undefiled is to care for those vulnerable.

The symbol of the Christian is the Cross. The cross is a reminder of the sacrificial gift and love. All that is required of us is to take a close look at our interior attitudes. In our desire to show that we are holy, we might also give much credence to externals, following customs and traditions. Yet, Jesus’ words challenge us. He reminds us that we do not make ourselves holy by our external actions. Rather, we become holy when we allow God’s Spirit to transform us. Our transparent actions should be an expression of the conversion of our heart to God.

“Listen, and understand these traditions which the Lord has given to you.” (DO)

భగవంతునిగా మార్చే వ్యక్తిత్వం: ద్వితీ 4:1-2,6-8; యాకోబు 1:17-18,21b-22,27; మార్కు 7:1-8,14-15,21-23 (B 22)

 

భగవంతునిగా మార్చే వ్యక్తిత్వం 

ద్వితీ  4:1-2,6-8; యాకోబు 1:17-18,21b-22,27; మార్కు 7:1-8,14-15,21-23 (B 22)

దేవుడు తాను చేసినదంతా చూశాడు, నిజానికి అది చాలా బాగుంది. అల్లెలూయా.” (DO) 

అర్చన కాలం ప్రకారం ఈ సంవత్సరం (బి) మార్కు సువార్తను ధ్యానం చేస్తున్నాము. కాని గత కొన్ని ఆదివారములుగా యోహాను సువార్త నుండి “జీవాహారం” గురించిన సువిశేష పఠనాలను తిరుసభ మనకు అందించిది. ఈ ఆదివారపు సువిశేషం నుండి మళ్లి మార్కు సువార్తవైపు తిరుసభ మనలను  నడిపించడం గమనిస్తున్నాము. ఈనాటి మార్కు సువిశేషంలో సువార్తీకుడు యూదుల ఆచారాలపై  ఎటువంటి జ్ఞానం, అనుభవం లేని అన్యులైన తన క్రైస్తవ సంఘస్తులకు ద్వితీయోపదేశ మరియు లేవీయకాండ చట్టాలను గురించి తెలియ చేస్తున్నాడు. అటువంటి చట్ట సంప్రదాయాలను పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రానికి మించి పాటిస్తున్నారనీ, పాటించమని వేధిస్తున్నారని యేసు విమర్శిస్తున్నట్లు మార్కు తెలియచేస్తున్నాడు. నిజానికి ఇశ్రాయేలీయులను దేవునితో ముడిపెట్టింది ధర్మశాస్త్రమే కదా!! మతం చట్టాన్ని పాటించాలి. రెలిజియన్ (మతం) అనే పదం లాటిన్ పదం లిగారే నుండి వచ్చింది. లిగారే అంటే "ఏదో ఒకదానితో లేదా ఎవరితోనైనా ముడిపడి ఉండడం" అని అర్థం.

చట్ట సంప్రదాయాల విషయంలో పరిసయ్యులు దేవుణ్ణి గౌరవించే మార్గంగా కాకుండా ఇతరులపై దాడి చేయడానికి మాత్రమే సంప్రదాయ చట్టాలను ఉపయోగించారు. ప్రజలు భారమైన శాసనాలను అనుసరించలేకపోయారు. అందువల్ల వారు పరిసయ్యుల చేత ఖండింపబడ్డారు. అందుకే యేసు, “ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గౌరవిస్తారు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి" (యెహే 33:31; యేష 29:13) అని హెచ్చరించాడు. అటువంటప్పుడు మతం అంటే ఏమిటి? ప్రజలు దేవునితో ఎలా ముడిపడి ఉండాలి? యాకోబు తన పత్రికలో ఈ ప్రశ్నకు, “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే” (యాకోబు 1:27) అని  సమాధానమిచ్చాడు. మన సమాజంలో అటువంటి బలహీనులు ఎవరు?

బాధలలో వున్న అనాథలు మరియు వితంతువులు; శారీరక, మానసిక వికలాంగులు; అశ్లీల చిత్ర   పరిశ్రమకు బలైపోతున్న పిల్లలు, యువత; లింగ గుర్తింపు కొరకు పోరాడుతున్న వ్యక్తు,లు; కుటుంబాలను పోషించుకోవడానికి తమ స్వస్థలాలను విడిచిపెట్టిన వలస బ్రతుకులు; చాలీచాలని వేతనాలకు గురైన  నిరాశ్రయులు; లేమి కారణంగా గొంతు విప్పలేని అభాగ్యులు; కనీస అవసరతలు గడవలేక అమ్ముడుబడ్డ నిట్టూర్పు బ్రతుకులు; సైబర్ క్రైంలో బలైపోతున్న అమాయకులవంటి వారు బలహినులుగా పరిగణించబడతారు. మీరు, నేను మన చుట్టూ ఉన్న అటువంటి దుర్బలత్వాన్ని గుర్తించగలమా? మనచుట్టూ ఎలాంటి దుర్బలత్వం కన్పిస్తుంది? మనం మతస్థులమా? మనం దేవుడితో ముడిపడి ఉన్నామా? నిజమే  మనం దేవుడితోనే ముడిపడి ఉన్నాం!!!

నేటి సువార్త పఠనం ముగింపులో, యేసు ఒక వ్యక్తిని మరియు మతాన్ని మరియు మతపరమైన జీవితాన్ని అపవిత్రం చేసేటటు వంటి విషయాల గురించి హెచ్చరించాడు. అలాగునే దేవుని దరికి చేర్చే  విషయాలను కూడా గుర్తు చేస్తున్నాడు. సత్యం, అందం, ప్రేమ మరియు భగవంతుని కోసం జీవించాలనే సంకల్ప తపన వంటి సద్గుణాలు నిజంగా ఒక వ్యక్తిలో నాటబడిన దేవుని దయా బహుమానాలే. ఒక వ్యక్తి, నిజాయితీగా, దయతో, సానుభూతితో ఉదారంగా ఉన్నప్పుడు వారు తమ మత ఉనికిని చూపుతారు. ఈ విలువలను నిధిగా కాపాడుకోవడం ద్వారా మనం భగవంతుని సన్నిధిని విలువైనదిగా పరిగణిస్తాము. దానిని విలువైనదిగా కాపాడుకోవడం ద్వారా మనం ఇతరులలో దేవుని ఉనికి సన్నిధిని చూడగలం. స్వచ్ఛమైన, నిష్కళంకమైన మతం, మత జీవితం అంటే బలహీనుల పట్ల శ్రద్ధ కలిగి వుండడమే కదా నిజమైన క్రైస్తవ్యం.

క్రైస్తవుల చిహ్నం శిలువ. సిలువ త్యాగం ప్రేమను గుర్తు చేస్తుంది. మన అంతర్గత వైఖరిని మనం నిశితంగా పరిశీలించడం మనకు చాలా అవసరం. మనం పవిత్రులమని చూపించుకోవాలనే మన కోరికలో, బాహ్యమైన ఆచార సంప్రదాయాలను అనుసరిస్తూ, వాటికి కూడా మనం విశ్వసనీయతను ఇవ్వవచ్చు!! అయినప్పటికీ, యేసు మాటలు మనకు సవాలుగా నిలుస్తున్నాయి. కేవలం మన బాహ్య చర్యల ద్వారా మాత్రమె మనల్ని మనం పవిత్రం చేసుకోలేమని కూడా ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. బదులుగా, దేవుని ఆత్మ మనలను మార్చడానికి అనుమతించినప్పుడు మాత్రమె మనం పవిత్రులం అవుతాము. మన ఆచార సంప్రదాయాలు, పారదర్శక చర్యలు మనతో జీవించే అభాగ్యులను మెరుగు పరుస్తూ మన హృదయాన్ని భగవంతునిగా మార్చడానికి వ్యక్తీకరణగా ఉండాలన్నది నేటి అర్చన సారాంశం.

ప్రభువు మీకు ఇచ్చిన ఈ సంప్రదాయాలను వినండి మరియు అర్థం చేసుకోండి." (DO)

 

Saturday 24 August 2024

విశ్వాసం అవగాహనను కోరుకుంటుంది: యెహోషువా 24:1-2a,15-17,18b; ఎఫేసి 5:21-32; యోహాను 6:60-69 (B 21)

 

విశ్వాసం అవగాహనను కోరుకుంటుంది

యెహోషువా  24:1-2a,15-17,18b; ఎఫేసి  5:21-32; యోహాను  6:60-69 (B 21)

ప్రభువు యొక్క సిలువ మనకు జీవ వృక్షంగా మారింది

యేసు “జీవాహారమును నేనే” అని పేర్కొన్నాడు. పరలోక తండ్రి వద్దకు మన ప్రయాణంలో మనల్ని నడిపించడానికి మరియు నిలబెట్టడానికి ఆధ్యాత్మిక ఆహారంగా దేవుడు మనకు ఇచ్చిన జీవాహారామే యేసు. ఆతని వాక్కు మరియు రక్త మాంసములు మనకు నిత్య జీవం. మనం యేసు మాటలను దైవంగా అంగీకరించాలి లేదా మోసగాడి వాదనగా తిరస్కరించాలి. ఒక్కొక్క సారి ఆతని మాటలు కఠినంగా వుంటాయి. ఇది “కఠినమైన మాట” అని అపొస్తలులు కూడా ఒప్పుకున్నారు. యేసు మాటలు కష్టతరంగా వున్నాయి అని అర్థం చేసుకోవడం కష్టం కాదు గాని, అంగీకరించడం చాలా కష్టం. యేసు తన శిష్యులతో కూడా ఈ సమస్యను నొక్కిచెప్పాడు. ఎందుకంటే పరిశుద్ధునిగా మరియు ఏకైక అద్వితీయ కుమారునిగా అతను తండ్రి నుండి పంపబడినట్లు తన పట్ల వారి విశ్వాసాన్ని మరియు విధేయతను పరీక్షించాలనుకున్నాడు. యేసు తన శిష్యులకు నిత్యజీవముతోపాటు దేవునిలో పరిపూర్ణ ఐక్యతా ప్రసాద ఆశీర్వాదాన్ని కూడా వాగ్దానం చేశాడు. “కఠినమైన సూక్తులను” అర్ధం చేసుకొని  విశ్వసించి  అనుసరించడానికి ఆహ్వానాన్ని మరియు దయను ఇచ్చేది తన పరలోకపు తండ్రి అని యేసు తన శిష్యులకు హామీ ఇస్తున్నాడు.

తన మాటలు "ఆత్మ మరియు జీవము" (యోహాను 6:63) ను కలిగి ఉన్నాయని యేసు తన శిష్యులతో చెప్పాడు.  తన ఆత్మ స్వర్గపు తండ్రిది. తన మాటలు తన తండ్రివి కాబట్టి ఆతని మాటలు జీవానికి కర్త. మరియు తనను శ్వాసించే విశ్వాసులలో అదే తండ్రి ఆత్మ నెలకొని వుంటుంది. విశ్వాసపు బహుమానం ద్వారా పేతురు నిజంగా యేసు ఎవరో అని ఆత్మీయ ప్రత్యక్షతను పొందగలిగాడు. యేసు దిగజారిపోయిన మానవ జాతిని విమోచించి, వారిని దేవునితో సమాధానపరచ గలిగే రక్షకుడనని గ్రహించ ప్రేరణ పొందుకోగలిగాడు.

అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండే కొన్ని కఠినమైన యేసు సూక్తులను తన మాటపై విశ్వాసం మరియు నమ్మకం పెంచుకోవడానికి దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడు? విశ్వాసం అనేది దేవుడు తన మాట వినేవారికి మరియు తనపై నమ్మకం ఉంచేవారికి ఉచితంగా ఇచ్చే ఒక బహుమతి. విశ్వాసం అనేది దేవుని ఎడల ఒకరి వ్యక్తిగత ప్రతిస్పందన. విశ్వాసం గుడ్డిదా లేదా అజ్ఞానమా అని కాదు. ఇది దేవుని సత్య వాక్యం మరియు విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. నిజమైన విశ్వాసం అనేది మార్మిక  మరియు ఆధ్యాత్మిక మాటల ఎడల అవగాహనను కోరుకుంటుంది. సెయింట్ అగస్టీన్ ఇలా వ్రాసాడు, నేను అర్థం చేసుకునే క్రియా క్రమంలో నమ్ముతాను మరియు నమ్మడం మాత్రమె ఉత్తమం అని నేను అర్థం చేసుకున్నాను." ప్రభువైన యేసు తన అనుచరులందరికీ తన జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని మరియు ఆత్మను అందజేస్తాడు. దేవుని గురించి మన జ్ఞానం మరియు అవగాహనలో వృద్ధి చెందడానికి సహాయం చేస్తాడు.

దేవుని నుండి వచ్చే సత్యాన్ని మరియు జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మన హృదయం మరియు మనస్సు యొక్క కళ్లను ప్రకాశవంతం చేసేటటు వంటిది పరిశుద్ధాత్మ పని అని అపొస్తలుడైన పౌలుడు  మనకు చెప్తున్నాడు (ఎఫే 1:17-18). మన వ్యక్తిగత జీవితాలలో దేవుని పనిని  అర్థం చేసుకోవడానికి మరియు అనుభవించడానికి విశ్వాసమే కీలకం. అపొస్తలుడైన పౌలుడు "మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది" (రోమా 5:5) అని కూడా విశిదం చేస్తున్నాడు.

మనము యేసు మాటలను వింటూ, ఆతని సూచనలకు విధేయత చూపుతున్నప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించడంలో వృద్ధి చెందుతాము. మనం దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోగలుగుతాము. పేతురు వలే, “నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు” అని సాక్ష్యమివ్వ గలిగి మన జీవితాన్ని మార్చగలిగే శక్తి ఉన్నవాడని యేసయ్యను మనము నమ్ముతున్నామా? మన ప్రభువుగా, విమోచకునిగా, బోధకునిగా మరియు వైద్యునిగా మనము తెలుసుకోవడం, ప్రేమించడం మరియు సేవించడంలో మన విశ్వాసాన్ని పెంచమని ప్రభువైన యేసును అడుగుదాం. ఆతని ఆత్మతో మనలను నిలబెట్టగలడు.

 

"నీవే, ప్రభూ, నా రక్షణ మరియు నా మహిమ: నీవు నా తల పైకెత్తువాడవు"

Faith seeks Understanding: Jos 24:1-2a,15-17,18b; Ep 5:21-32; Jn 6:60-69 (B 21)

 

Faith seeks Understanding

Jos 24:1-2a,15-17,18b; Ep 5:21-32; Jn 6:60-69 (B 21)

The cross of the Lord is become the tree of life for us 

Jesus claimed to be the bread of heaven, the very life of God given to us as spiritual food to sustain us on our journey to the Father in heaven. We must either accept his word as divine or reject it as the claim of an imposter. Even the apostles admitted that this was a “hard saying”. This expression meant that it was not just hard to understand, but hard to accept. Jesus pressed the issue with his beloved disciples because he wanted to test their faith and loyalty to him as the Holy One sent from the Father. Jesus promised his disciples nothing less than the full blessing of eternal life and union with God. Jesus assures his disciples that it is his heavenly Father who gives the invitation and the grace to believe and follow even in the “hard sayings”.

Jesus told his disciples that his words were “spirit and life” (Jn 6:63) and his words came from the heavenly Father who is the author of life and the One who breathes his Spirit into those who believe in him. Through the gift of faith Peter was able to receive spiritual revelation of who Jesus truly is. He is to redeem a fallen human race and reconcile them with God.

How does God help us grow in faith and trust in his word, even the hard sayings which are difficult to understand? Faith is a gift which God freely gives to those who listen to his word and who put their trust in him. Faith is a personal response to God’s revelation of himself. Faith is neither blind nor ignorant. It is based on the truth and reliability of God’s word. True faith seeks understanding. Saint Augustine of Hippo said, “I believe in order to understand, and I understand the better to believe.” The Lord Jesus offers all his followers his life-giving word and Spirit to help us grow in our knowledge and understanding of God.

Paul the Apostle tells us that it is the work of the Holy Spirit who enlightens the eyes of our heart and mind to understand the truth and wisdom which comes from God (Ep 1:17-18). Faith is the key to understanding and experiencing God’s action and work in our personal lives. Paul the Apostle tells us that “God’s love has been poured into our hearts through the Holy Spirit which has been given to us” (Rom 5:5). We can know God personally, and we grow in recognizing his voice as we listen to his word and obey his instruction. Do we believe, as Peter did, that Jesus has the words of everlasting life and the power to change and transform your life? Ask the Lord Jesus to increase your faith that you may grow in knowing, loving, and serving him as our Lord and redeemer, teacher and healer.

 

“You, Lord, are my salvation and my glory: you lift up my head”