AletheiAnveshana: ఈశా సర్వేశ … జయహో విజయేశ్వర

Tuesday, 5 March 2024

ఈశా సర్వేశ … జయహో విజయేశ్వర

 

ఈశా సర్వేశ … జయహో విజయేశ్వర

 

ఈశా సర్వేశ నిత్యనివాస విశ్వవిశేష విన్యాస

దుష్టశిక్ష శిష్టరక్ష అనాధరక్ష విశ్వసంరక్ష

 
మరణాక్రంధన ఖండిత విశిష్ట శ్రేష్ట కాంక్షిత
ఎఱ్ఱ సాగర గర్జన జల శాసన శక్తి ప్రసాద
రధ రౌద్రావేశ ఫరో శ్రేణి సంహార
విధేయ ప్రజా రక్ష క్షీరమధు ధరణి ప్రధాత
నిర్జనెడారి వలస కాంక్ష భాను తెర శీతల మేఘ
నిశి రాత్రి దీపస్థంభ విరాజిత ప్రసన్న
మన్నాభోజన శిలాజల కాంక్ష ప్రియ జన  సంరక్ష
దశాజ్ఞ నిర్దేశ నీతి ప్రియ ప్రయోజి శాశ్విత
అవివేకాంధ అవిధేయ చేతన కారక
 
శ్వేతవర్ణ దేహ దారుఢ్య విశిష్టవర నరకన్యా తనయ
కొయ్యి శ్లీవ ధారే అవిధేయ ఫల మృత్యు సంహార
పాప ఫల మృత్యు విచ్చిన్న విజేత రక్ష
గొల్గోత శిఖర హీన శ్లీవధారి దుండుగ వరపర ప్రాప్త
అభినేత్రి కరుణా కారుణ్య నేత్ర శిఖరాగ్రి
భువి పర పాతాళ మండల స్థితి లయ కారక
 
ఏలి ఏలి ఏలి లామా సభాక్తాని నివేదనా మౌని
తెలెస్తాయ్ శబ్ద మౌన ముఖ సృష్టి జీవ విముక్త
పితృ పితామహా ప్రవక్త జ్ఞాని జ్ఞానేశ్వర కాంక్ష  
భక్త విధేయ ముక్తగణకోటి శ్రేయా వాంఛ
 
 విలవిల విలవిల విరాజిత సృష్టి విలాప ముఖ హృది ఘోషే
నయనయ నయనయ నయనాధి సూర్య కాంతి హీనే    
మిళమిళ  మిళమిళ  మిళమయ గ్రహ తారకా మిళ  శోభ మూగే  
నవనవ నవనవ నవాధి చంద్ర కాంత శూన్యే
ఝణుఝణు  ఝణుఝణు ఝణు ధరణి విచ్చిదే
భళభళ భళభళ సాగర కెరట ఉగ్ర రూపే
ఝంఝం ఝంఝం ఝంఝన్య ఝనీలావేశ వాయు ప్రాణ హీనే
 
జగన్నేక పుత్ర శాశ్వితాబలిరక్ష దైవేక తనయే   
జయజయ జయజయ జయం సర్వసృష్టి రక్షకే
సర్వభూతాత్మకె సర్వవిభూతాత్మకే సర్వ ప్రాణాత్మకే
సర్వక్రియాత్మకే సర్వచింతాత్మకే సర్వశ్రేయాత్మకే
సర్వసంపన్నాత్మకే సర్వమంగళాత్మకే సర్వజ్ఞానాత్మకే
సర్వప్రేమాత్మకే సర్వకృపాత్మకే సర్వ జ్యోతి సృజనాత్మకే
సర్వం సర్వ స్త్రోత్రం స్తోత్రాత్మ స్తోత్రం జయహో జయ విజయేశ్వర

No comments:

Post a Comment