అద్భుత శిలువ నాథుని ప్రార్థన
గుః ఏలినవారా దయచూపండి
గుః క్రీస్తువా దయచూపండి
గుః ఏలినవారా దయచూపండి
క్రీస్తువా మా ప్రార్ధన విననవదరించండి.
క్రీస్తువామా ప్రార్ధన ప్రకారము దయచేయండి
పరలోకమందుండెడు పితయైన సర్వేశ్వరా... మా మీద దయగానుండండి
లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వరా... మా మీద దయగానుండండి
జీవ ప్రధాతయగు పవిత్రాత్మ సర్వేశ్వరా... మా మీద దయగానుండండి
నిజదేవుడును, నిజమానవుడునైన
అద్భుత శిలువ నాథుడా...మా మీద దయగానుండండి
లోకమును రక్షింప మానవ జన్మమెత్తిన అద్భుత శిలువ నాథుడా...
ఆదిదంపతుల శాపమును తొలగింప మానవరూపమెత్తిన అద్భుత శిలువ
నాథుడా...
తండ్రి దేవుని చిత్తమును పాటింప భువికరుదెంచిన అద్భుత శిలువ
నాథుడా...
శిలువ మరణము వరకు తండ్రిని విధేయించిన అద్భుత శిలువ
నాథుడా...
దేవుని వాక్కు అయిన అద్భుత శిలువ నాథుడా...
జగములకు ముందున్న అద్భుత శిలువ నాథుడా...
మాకై ఉదయించిన లోక రక్షక అద్భుత శిలువ నాథుడా...
సర్వమానవాళి పాపములను తొలగించ శిలువను మోసిన అద్భుత శిలువ
నాథుడా...
మానవ గమ్యస్థానమును చూపించిన అద్భుత శిలువ నాథుడా...
ప్రవక్తల ప్రవచనములకు మూలాధారమైన అద్భుత శిలువ నాథుడా...
భూలోక రాజుల పరిపాలనకు సూచికమైన అద్భుత శిలువ నాథుడా...
త్రిలోకములను ఏకము చెయ్యుటకు ముప్పది వెండి నాణెములకు
అమ్మబడిన
అద్భుత శిలువ నాథుడా...
భారభరిత హృదయములను తేలికపరచుటకు రక్తచమటను చెమర్చిన అద్భుత
శిలువ నాథుడా
సత్యమును నిరూపించుటకు కొరడా దెబ్బలను భరించిన అద్భుత శిలువ
నాథుడా...
జీవ మార్గములకు అధిపతివని నిరూపించుటకు ఉమ్మిని కిరీటముగా
ధరించిన
అద్భుత శిలువ నాథుడా...
సాతాను రాజ్యమును కూలగొట్టిన అద్భుత శిలువ నాథుడా...
ఎడారిలో సర్పము వలె ఎత్తబడిన అద్భుత శిలువ నాథుడా...
భూమ్యాకాశములను ఏకము చేసిన అద్భుత శిలువ నాథుడా...
సూర్యచంద్ర నక్షత్రాదులను కిరీముగా ధరించిన అద్భుత శిలువ
నాథుడా...
భూమ్యాకాశ పాతాళ లోకములను విమోచించిన అద్భుత శిలువ
నాథుడా...
పంచ గాయాలలో మానవులను దాచుకొన్న అద్భుత శిలువ నాథుడా...
అంద విహీనమైన ముఖముతో లోకమును ప్రజ్బరిల్లింపచేసిన అద్భుత
శిలువ నాథుడా.
మహిమ శిలువలో రక్తము నీరును స్రవించిన అద్భుత శిలువ
నాథుడా...
బళ్ళెపుపోటుతో స్రవించిన నీటిని జ్ఞానస్నాన జలముగా
ప్రసాదించిన అద్భుత శిలువ నాథుడా...
తమ మరణముతో మరణించిన వారిని పునరుత్థానులను చేసిన అద్భుత
శిలువ నాథుడా...
మరణ గడియలో నూతన యెరూషలేమును స్థాపించిన అద్భుత శిలువ
నాథుడా...
పాత ఒప్పంద ప్రవచనమును పరిపూర్తి చేసిన అద్భుత శిలువ
నాథుడా...
పాత బలులలను తొలగించి నూతన శాశ్వతబలిని ఒసగిన అద్భుత శిలువ
నాథుడా...
శిలువపై బలివస్తువుగా, ప్రధాన యాజకునిగా
రూపొందుకొన్న అద్భుత శిలువ నాథుడా...
మానవ శాప మరణమునకు తమ రక్తమును వెలగా ఇచ్చిన అద్భుత శిలువ
నాథుడా...
శిలువపై బాధలను అనుభవిస్తూ దొంగవానికి జాలిచూపిన అద్భుత
శిలువ నాథుడా...
పశ్చాత్తాప పడిన దొంగవానిని మోక్ష ప్రాప్తుడ్ని చేసిన
అద్భుత శిలువ నాథుడా...
తమ మరణముతో మా పాపపు మరణముల్లును విరచిన అద్భుత శిలువ
నాథుడా...
తమ గాయములతో మా గాయములను కడిగిన అద్భుత శిలువ నాథుడా...
సకలకీడులనుండి. ..... అద్భుత శిలువ నాథుడా మమ్ము రక్షించండి
సకల పాపముల నుండి ..... అద్భుత శిలువ నాథుడా మమ్ము
రక్షించండి
మీ కోపాగ్ని నుండి. ..... అద్భుత శిలువ నాథుడా మమ్ము
రక్షించండి
అకస్మికమైన ఆయత్తములేని మరణము నుండి అద్భుత శిలువ నాథుడా
మమ్ము రక్షించండి
పిశాచి తంత్రముల నుండి ॥
కోపము, పగ, దుర్గుణముల నుండి ॥1
మోహాగ్ని నుండి ॥
పిడుగులు, ఘోర గాలి నుండి ॥1
భూకంపము నుండి ॥1
అంటురోగము, కరవు, యుద్ధముల నుండి ॥1
మానసిక రుగ్మతల నుండి ॥
హృది రోగముల నుండి ॥
మనో:బలహీనతల నుండి ॥
కుటుంబ ఆర్థిక సమస్యల నుండి ॥
కుమార కుమార్తె అవిధేయతల నుండి ॥1
లోక ఆశ చింతల నుండి ॥
దంపతుల మనో ఐక్యబలహీనతల నుండి ॥
అసాంఘిక శక్తుల నుండి ॥
జారత్వము, అపవిత్రతల నుండి ॥1
కైస్తవ సంఘముల అనైక్యత నుండి ॥
విగ్రహారాధన, మాంత్రిక శక్తుల
నుండి ॥1
అసూయ, కలహాల నుండి ॥1
క్రోదము, స్వార్ధముల నుండి
॥
కక్షలు, వర్గతత్వముల నుండి
॥1
మాత్సర్యము, త్రాగుబోతుతనము
నుండి ॥1
సర్వేశ్వరుని గొట్జెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడి
వారా !
మా పాపములను మన్నించండి స్వామి
సర్వేశ్వరుని గొట్జెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడి
వారా !
మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి
సర్వేశ్వరుని గొట్జెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడి
వారా !
మా మీద దయగా నుండండి స్వామి
వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధన
గు: పావన పితా! మీ దివ్య చిత్తానుసారముగా మీ దివ్య కుమారుడు
మమ్ములను
పాపము నుండి, సకల విపత్తుల
నుండి విముక్తి చేయ మానవ రూపమున మా మధ్య జన్మించిరి.
వ్యాధిగా నున్న మా సోదరీ సోదరులను మీ దివ్య చిత్త ప్రకారము
స్వస్థపరచమని వేడుచున్నాము.
వారిపై కనికరించి, మానసిక శారీరక
బాధలను తొలగించండి. తద్వారా వారు మిమ్ముస్తుతించి, గౌరవించుదురు గాక. పిత, పవిత్రాత్మతోనేకమై సదాకాలము జీవించు మా నాథుదైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అమెన్.
పవిత్ర శిలువ ధ్యానం గు: కారుణ్య వాక్యం:
ఓ మహా అద్భుత శిలువ నాథుడా ! మీరు మానవుల రక్షణార్ధం ఘోరమైన
శిలువ
మ్రాని మీద కఠినమైన మరణ దండనను అనుభవించుటను తలంచి నేను
అధికముగా
దు:ఖించుచున్నాను. మీరే దేవాదిదేవుని ఏకైక కుమారుడవని
తెలిసికొని మిమ్ములను అశ్రయించక
లోకాశ మాయలకు, 'కైస్తవ
విచ్చిన్నతకు బాధ్యులమగుచున్నాము. అజ్ఞానాంధకారములో
నలిగిపోతున్న మమ్ములను తండ్రీ! మేమేమి చేయుచున్నామో
మేమెరుగము కనుక మమ్ములను
క్షమించి మోక్ష మార్గము చూపమని ప్రార్ధించుచున్నాము. ఆమెన్.
గు: మోక్షధ్యాన వాక్యం:
ఓ మహా అద్భుత శిలువ నాథుడా ! మీరు మా పాపపు భారమును శిలువ
రూపములో
మోసి కపాల కొండపై కఠోర వేదనను అనుభవించుటను తలంచి నేను
అధికముగా
దు:ఖించుచున్నాను. కోరిన వెంటనే కాదనకుండా కనికరించు
దయాళుడవు. పశ్చాత్తాపము
అవసరములేని తొంబై తొమ్మిది మంది నీతి మంతుల కంటే ఒక్కరు
పశ్చాత్తాపము పొందినపుడు
పరలోకములో ఎక్కువ ఆనందము కలదని నేర్పించావు. అరోగ్యవంతుల
కొరకు కాకుండా
అనారోగ్యుల కొరకు వచ్చినందున ప్రతి ఒక్కరికి రక్షణము
దయచేయుమని విశ్వాసముతో
బ్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఆమెన్.
గు: దివ్య మాతృ వరప్రసాద వాక్యం:
ఓ మహా అద్భుత శిలువ నాథుడా! పరమ పవిత్రమైన మీ తిరుముఖము ఘోర
నిందావమానముల వల్ల విరూపముగా మారిన విధానమును తలంచి
అధికముగా
దు:ఖించుచున్నాను. మొదటి ఏవ అవిధేయత ఫలితముగా నరకలోకమున పాపము దాని శాపమైన
మరణమును పొందుకొనగా రెండవ ఏవ అయిన మీ మాతృ మూర్తి మరియను
రెండవ ఏవగాను
దైవ చిత్తమునకు విధేయురాలుగాను పరలోక రక్షణ మార్గమునకు
ద్వారముగాను మలచితిరే!
రక్షణ ప్రణాళికలో ఆమె ఏ విధముగా భాగస్థురాలైనదో మేమును అమె
ఆదర్శమున రక్షణ కార్యములో
భాగస్థులమగునట్లు ఆ అమ్మ ప్రార్ధనను కనికరించమని వేడుదల
చేయుచున్నాము. ఆమెన్.
గుః మహా విలాప వాక్యం:
ఓ మహా అద్భుత శిలువ నాథుడా! మీరు శిలువ మీద మహా అదేదనను
పొందుటను
రాణువులు అవిశ్వాసులు అవమానకరముగా మాట్లాడుట వలన మీకు
కలిగిన బాధలను
తలంచి మిగుల దుఃఖించుచున్నాను. నా దేవా! నా దేవా! నన్నేల
చేయి విడనాడితివి అని
ప్రార్ధించినపుడు సూర్యుడు కాంతి హీనుడైనాడు. మేఘములు
చీకటితో కమ్మివేశాయి. పాప
మలిన హృదయాలు చిమ్మ చీకట్లలో 'మ్రగ్గుచున్నవి.
పాప భారముతో నిండిన జీవితములను
ఎన్నటికి చేయి విడనాకుండా మీ రక్షణ హస్తము అందించమని
ప్రార్థించుచున్నాము. ఆమెన్.
గు: ఆత్మ దాహార్తి
వాక్యం:
ఓ మహా అద్భుత శిలువ నాథుడా ! మీరు దప్పిక గొనిన అల్ప
విశ్వాసులకు ఎడారిలో
శారీరక దాహార్తిని తీర్చినారు. ఇపుడు శిలువను మోయు సమయమున
నడచుటకు ఓపికలేని
బలహీనత దాహముగొన్నను గుక్కెడు నీళ్లకు నోచుకోలేనందున కలిగిన
విలాపమును తలంచి
మిక్కిలి దు:ఖించుచున్నాను. మీరు పొందిన దప్పిక శారీరక
దప్పిక గాక, ఆత్మల దాహార్తి అని
గ్రహిస్తున్నాను. మరణ గడియన పాతాళ లోకములో మీ విముక్తి
దాహార్తితో మొర పెడుతున్న
అత్మలను రక్షించటానికే గదా! పాతాళ లోకములోని ఉత్తరించు
స్థలములోని జీవచ్చవములైన
భూలోక ఆత్మలను రక్షించుటకై మాకు దాహము ఇమ్మని బ్రతిమాలి
ప్రార్ధించుచున్నాము. ఆమెన్.
గుః ప్రేషిత వాక్యం:
ఓ మహా అద్భుత శిలువ నాథుడా! తండ్రి దేవుని రక్షణ ప్రణాళికను
పరిపూర్తిచేయుటలో మీరు భూమ్యాకాశాల మధ్య విరిగి నలిగిన దేహముతో రక్త సిక్తమైన
శరీరమున వ్రేలాడుతూ అనుభవించిన కఠోర వేదనను తలంచి మిక్కుటముగా
దుఃఖించుచున్నాను. మీకిచ్చిన పనిని మీరు పరిపూర్తి చేశారు. అపవాధి మరణపు ముల్లును విరిచి
సమాప్తమైనదని శిలువ త్యాగ ధర్మాన్ని నేర్చించితిరే! మేముకూడా మా అధ్యాత్మిక
పరుగు పందెమును విజయవంతముగా
పరిపూర్తి చేయుటకు శిలువ విజ్ఞానమును అనుగ్రహించమని
ప్రార్థించుచున్నాము. ఆమెన్.
పవిత్ర శిలువ ధ్యానం
No comments:
Post a Comment