బాల ఏసు జననం - ఒక మార్గదర్శక కిరణం
(Birth of Jesus is a Light to my Path)
"నజరేతులో వెలసిన దైవం
బెత్లేహేములో విరసిన దివ్య రూపం
పశుల పాకలో మెరసిన అత్మీయ వరం
బాల ఏసు జన్మం మన గమ్యం
విశ్వ సృష్టి రూపు కర్త
జీవానికి జీవం పోసిన జీవన ధాత
సోయగాలను సొగస్సులను వదలి
మంచు చలిలో పొత్తి గుడ్డల్లో ఒదిగిన
బాల ఏసు రమ్యం మన రక్షణం
లివ్ లెట్ లివ్ అన్న బోధనం
కడుపులో ఎదిగే పసికందును తుంచే
తల్లుల మైకాన్నిభయాన్ని చూచి
పశుల మధ్య కెవ్వు మన్న బాల ఏసు రోదనం
అధికార దాహాన్ని తుంచే నిశిరాత్రి వెలుగుల ఏసయ్య
మోస వ్యాపారాల హద్దు తుంచే బాల్య ఖడ్గం
స్వార్ధ కబ్జాల చేతులను అడ్డే ఏసు కమల గుణం
కుల మత ప్రాంత హద్దులనుచెరిచే సత్య కిరణం
అదే నవ సూర్య కిరణ ఉదయం ఏసు జననం
అవినీతి ఊబిని పూడ్చే నీతిసూర్య వెలుగు
ఓర్వలేని ఓర్పులేని మనవ లోపాన్నినింపే కరుణ వెలుగు
బ్రతుకులేని గూడులేని అభాగ్యులకు సేదనిచ్చే జీవ జలం
హారం కోరక ఆహారమిచ్చే జివాహరపు జన్మం
బాల ఏసు జన్మం మన గమ్యం
రండి రారండోయ్ న్యాయం తెచ్చే చేతులను పూజిద్దాం
పదండి పదండోయ్ సత్యాన్ని చూపే రారాజును ఆరాదిద్దాం
చూడండి చూడండోయ్ భారాన్ని తొలగించే ముఖాన్ని
పాడండి పాడండోయ్ లాలి లాలి ..జోలాలని పాడండి"
WISH YOU HAPPY CHRISTMAS
No comments:
Post a Comment