AletheiAnveshana: July 2022

Saturday, 30 July 2022

'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' దేశభక్తి గేయం

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

(Patriotic Poem on the Country of India)

 

"నా తెలుగు బిడ్డ ఏమని నామెడలో మల్లె మాల  వేయవచ్చావు 

గౌరవింపబడి ఆనందంగా వున్నానని మంగళ  హారతులు పట్టవచ్చావా?

నా కడుపులోని బంగరమైన నీతి న్యాయాలను   స్వంతం చేసుకొని నన్నవమాన పాలు  చేసారు

నే ప్రసరించే  నా కనుచూపుల్లోని కరుణను ఎంత మంది అభాగ్యులు అనుభవిస్తున్నారు 

నా పెదవులపై చిరునవ్వులు ఇంకా వున్నాయను కుంటున్నావా?

 

గల గలామని గోదారి కదులుతుంటే పవిత్రతను మికిచ్చానను కున్నాను 

ఇంకా గోదారి పవిత్రంగా వుందను కున్నావా?

జీవాలు గుర్తు పట్టరాని శవాలై  అన్యాయంగా  దీనంగా నాపై తేలియాడుతుంటే

అపవిత్రమైన పవిత్ర జలం నన్నెందుకు కన్నావే అని తిడుతుంది."