AletheiAnveshana: 'కరోనా కాలం లోని చావు గాధ' కవిత్వము

Thursday 18 November 2021

'కరోనా కాలం లోని చావు గాధ' కవిత్వము

వింటున్నావా........

(The Mournful Cry of the Pandemic)


వింటున్నావా .......... వింటున్నావా 

కాల గర్భం నింపు కొంటున్న

మట్టి మనిషి గొంతులో 

గరళమైన చావు గాధను 


వింటున్నావా ..........

తండ్రి క్షితిలోకి దూకి 

వదిలించుకున్న ఆ దీన కూతురి మనస్తాపం

కళ్ళెదుటే కూలిపోతున్న తల్లి  శవాన్ని 

భుజాన వేసుకున్న కొడుకు కన్నీటిని


వింటున్నావా ..........

చచ్చిన వారిపై వ్యాపార టోకెన్ల క్యూలు 

పగటి దానాని కొక రేట్టాట 

రాతిరి దానానికి మరొక క రేట్టట

చచ్చినా శవాన్నొదలని కార్పోరేట్ గాధట   


వింటున్నావా ..........

మహమ్మారి దాహార్తికి మరింతెదిగిన డబ్బోళ్ళు

ధనార్తికి అమ్ముడుబోయిన వాక్సినేషన్ అంతరాత్మలు 

నిజం తెలిసినా సత్యాన్ని చంపేసిన అధికారం 

గర్వంలో కరోనా గీటు దాటి యమ పాశాన్నందుకున్నాత్మల కథ 


వింటున్నావా ........... వింటున్నావా...........

No comments:

Post a Comment