చూడరా పరమేశ్వరా..........
(The Man in the Storm of Corona)
చూడరా పరమేశ్వరా..........
నీవు గన్న మనిషిని
నీ కరోనా విలయ తాండవంలో
ఊపిరాడక మృత అంగటిలో మసైన మనిషిని..........
చూడరా పరమేశ్వరా..........
నీ కల్ప వికల్ప సంకల్ప లీలల్లో
బంధమని కట్టేస్తావు
వైరాగ్యమని విడదీస్తావు
కరోనా కల్లోల కల్పనలో గుండె జారిపోవడం..........
చూడరా పరమేశ్వరా..........
బ్రతక మంటావు గుదిబండ మెడకేడ్తావు
గుండె లవిసే కన్నీటి ఊబిలో
కల్పిక కరోనాలో బలియై పోయే నిర్భాగ్యులగతిని..........
చూడరా పరమేశ్వరా..........
తల్లి ఒడిలో ఎదిగిన బిడ్డడు
తండ్రయ్యాడు భర్తయ్యాడు
బ్రతుకు బండి లాగాడు
కడన కరోనా కంటికి
తల్లి ఒడిలోనే నీరయ్యాడు..........
చూడరా పరమేశ్వరా..........
మలి మర్యాదలు నోచుకోలేక
తనవారి తుది చూపులు గానలేక
దుర్నీతంధకార వాంఛ కల్పనలో
దీన శవములుగా మారిన
నీ కలియుగ కల్పిక మనిషిని చూడరా..........
No comments:
Post a Comment