పరమాత్ముడా నీవూ...
(The Divine in All Things)
పరమాత్ముడా నీవూ...
(The Divine in All Things)
వింటున్నావా........
(The Mournful Cry of the Pandemic)
వింటున్నావా .......... వింటున్నావా
కాల గర్భం నింపు కొంటున్న
మట్టి మనిషి గొంతులో
గరళమైన చావు గాధను
వింటున్నావా ..........
తండ్రి క్షితిలోకి దూకి
వదిలించుకున్న ఆ దీన కూతురి మనస్తాపం
కళ్ళెదుటే కూలిపోతున్న తల్లి శవాన్ని
భుజాన వేసుకున్న కొడుకు కన్నీటిని
వింటున్నావా ..........
చచ్చిన వారిపై వ్యాపార టోకెన్ల క్యూలు
పగటి దానాని కొక రేట్టాట
రాతిరి దానానికి మరొక క రేట్టట
చచ్చినా శవాన్నొదలని కార్పోరేట్ గాధట
వింటున్నావా ..........
మహమ్మారి దాహార్తికి మరింతెదిగిన డబ్బోళ్ళు
ధనార్తికి అమ్ముడుబోయిన వాక్సినేషన్ అంతరాత్మలు
నిజం తెలిసినా సత్యాన్ని చంపేసిన అధికారం
గర్వంలో కరోనా గీటు దాటి యమ పాశాన్నందుకున్నాత్మల కథ
వింటున్నావా ........... వింటున్నావా...........
ఆశా భయాల మధ్య కామన్ మేన్
(Fear and Hope in the Common Man)
"మనిషి సాంకేతిక జ్ఞానం
మార్స్ మిద హెలికాప్టర్ ప్రయోగం
భూ మానవ చరిత్రలో
అద్భుత దశ మార్స్ రైట్ బ్రదర్స్ విజయం
అయినా నా కామన్ మేన్
నత్త నడక వెరీ కామన్
ఆశా భయాలు నా కామన్ మేన్ వరం
ఎవరెస్ట్ లా పరపతి ఎదగాలని ఆశ
జారి కింద బోర్లా పడతానని భయం
ధన శిఖరం పాకాలని ఆశ
నీచ అసూయ నాచులో జారుతానని భయం
అయినా నా కామన్ మేన్ డ్రీం ఫాస్టేస్ట్ రాకెట్
కంపు నజరాన చెట్టంత ఆశాశ్యాం
జీవన బండి కదలదన్న భయం
మెరుగు సమాజ నిలుపుదల ఆశాశ్యాం
వాటి మధ్య నా కామన్ మేన్ నిర్వీర్యం
అయినా ఆశా భయాలు రొటీన్ శస్త్రం తనకు కామన్."
చూడరా పరమేశ్వరా..........
(The Man in the Storm of Corona)
చూడరా పరమేశ్వరా..........
నీవు గన్న మనిషిని
నీ కరోనా విలయ తాండవంలో
ఊపిరాడక మృత అంగటిలో మసైన మనిషిని..........
చూడరా పరమేశ్వరా..........
నీ కల్ప వికల్ప సంకల్ప లీలల్లో
బంధమని కట్టేస్తావు
వైరాగ్యమని విడదీస్తావు
కరోనా కల్లోల కల్పనలో గుండె జారిపోవడం..........
చూడరా పరమేశ్వరా..........
బ్రతక మంటావు గుదిబండ మెడకేడ్తావు
గుండె లవిసే కన్నీటి ఊబిలో
కల్పిక కరోనాలో బలియై పోయే నిర్భాగ్యులగతిని..........
చూడరా పరమేశ్వరా..........
తల్లి ఒడిలో ఎదిగిన బిడ్డడు
తండ్రయ్యాడు భర్తయ్యాడు
బ్రతుకు బండి లాగాడు
కడన కరోనా కంటికి
తల్లి ఒడిలోనే నీరయ్యాడు..........
చూడరా పరమేశ్వరా..........
మలి మర్యాదలు నోచుకోలేక
తనవారి తుది చూపులు గానలేక
దుర్నీతంధకార వాంఛ కల్పనలో
దీన శవములుగా మారిన
నీ కలియుగ కల్పిక మనిషిని చూడరా..........